ఈ ఏడాది జనవరిలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు కేవలం 1.7 శాతమే..! 2018 జనవరి వృద్ధి రేటు (7.5 శాతం)తో పోలిస్తే ఇది చాలా తక్కువ. కేంద్ర గణాంక సంస్థ (సిఎస్ఒ) మంగళవారం తాజా ఐఐపి డేటాను విడుదల చేసింది. 2018 డిసెంబర్ ఐఐపిని ఇదివరకు అంచనా వేసిన 2.4 శాతం నుంచి 2.6 శాతానికి పెంచింది. తయారీ రంగంలో వృద్ధి 2018తో (8.7 శాతం) పోలిస్తే ఈ జనవరిలో బాగా తగ్గడం (కేవలం 1.3 శాతం) గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ - జనవరి కాలం మొత్తానికి తీసుకుంటే మాత్రం పారిశ్రామిక వృద్ధి గత ఏడాదికంటే కాస్త ఎక్కువగా 4.4 శాతం నమోదైంది.
2019-03-12 Read More‘‘2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ? ప్రతి బ్యాంకు అకౌంట్లో మోదీ వాగ్ధానం చేసిన రూ. 15 లక్షలు ఏవి?’’ అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రియాంక, బాధ్యతాయుతంగా ఓటు వేయాలని ప్రజలకు విన్నవించారు. ‘‘దేశంలో ప్రస్తుత వాతావరణం చూస్తే ఆవేదన కలుగుతోంది. విద్వేషం దేశమంతా వ్యాపించింది. అయితే, ఆ విద్వేష పవనాలను ప్రజలే తుడిచివేయగలరు’’ అని ప్రియాంక పేర్కొన్నారు.
2019-03-12 Read More58 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశం గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. 2019 లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని కూడా రాహుల్ గాంధీ గుజరాత్ నుంచే ప్రారంభించారు. మంగళవారం అహ్మదాబాద్ నగరంలో సిడబ్ల్యుసి సమావేశం అనంతరం ఎన్నికల ప్రచార సభ కూడా నిర్వహించారు. బీజేపీ, ఆర్.ఎస్.ఎస్.లను అధికారానికి దూరం చేసే ప్రయత్నంలో ‘‘ఏ త్యాగమూ మహా గొప్పది కాదు. ఏ ప్రయత్నమూ మరీ చిన్నది కాదు’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాహుల్ సోదరి ప్రియాంకా గాంధీ కూడా సిడబ్ల్యుసి, ఎన్నికల సభల్లో పాల్గొన్నారు.
2019-03-12 Read Moreకెనడాలో నివశిస్తున్న ఓ భారతీయ కుటుంబపు ‘జీవిత కాలపు విహార యాత్ర’ పెను విషాధాన్ని నింపింది. ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ విమానం కూలిన ప్రమాదంలో ఆ కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. ఆదివారం జరిగిన విమాన ప్రమాదంలో 157 మంది మరణించిన సంగతి తెలిసిందే. అందులో కెనడియన్ భారతీయ కుటుంబంలోని పన్నగేష్ వైద్య (73), ఆయన భార్య హన్సిని వైద్య (67), కుమార్తె కోషా వైద్య (37), అల్లుడు ప్రేరిత్ దీక్షిత్ (45), వారి పిల్లలు అక్ష దీక్షిత్ (14), అనుష్క దీక్షిత్ (13) ఉన్నారు. కెన్యా సఫారీ విహారానికి మార్చి మాసం మంచి తరుణమని భావించి వారంతా నైరోబీ బయలుదేరినట్టు వైద్య కుమారుడు మననం చేసుకున్నారు.
2019-03-12 Read Moreవివాదాలకు ప్రసిద్ధుడైన కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ముస్లిం తండ్రికి , క్రిస్టియన్ తల్లికి పుట్టిన గాంధీ బ్రాహ్మణుడు ఎట్లా అయ్యాడని హెగ్డే ప్రశ్నించారు. రాహుల్ గాంధీని విదేశీయుడని కూడా వ్యాఖ్యానించారు. తాను బ్రాహ్మణుడనని నిరూపించుకునేందుకు రాహుల్ గాంధీ డి.ఎన్.ఎ. పరీక్షకు సిద్ధమా? అని ప్రశ్నించారు. కర్నాటకలో ఆదివారం ఓ సభలో హెగ్డే మాట్లాడినప్పటి వీడియో ప్రస్తుతం సామాజిక మాథ్యమాల్లో వైరల్ అయింది.
2019-03-11 Read Moreఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు చంద్రశేఖర్ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మైలవరం నియోజకవర్గంలో ఉమ ప్రత్యర్ధి అయిన వసంత కృష్ణ ప్రసాద్ తోడుగా.. దేవినేని చంద్రశేఖర్ సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జగన్ తమ పార్టీ కండువా కప్పి లాంఛనంగా చంద్రశేఖర్ చేరికను ప్రకటించారు. తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రశేఖర్.. తన సోదరుడి హయాంలో నిర్మాణమైన ప్రాజెక్టులపైనే ఆరోపణలు చేశారు.
2019-03-11ప్రముఖ హాస్య నటుడు ఆలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ను కలసిన ఆలీ కొత్త కండువా కప్పుకొన్నారు. గతంలో టీడీపీకోసం ప్రచారం చేసిన ఆలీ, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ఏపీలోని ప్రధాన పార్టీల అధినేతలను కలసిన ఆలీ, ఎమ్మెల్యే సీటుతో పాటు మంత్రి పదవికి హామీ కోరినట్టు వార్తలు వచ్చాయి. వై.ఎస్.ఆర్.సి.లో చేరాక మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం అధినేత చూద్దాం..చేద్దాం..అంటారేగానీ నిర్ధిష్టంగా ఏమీ ఉండదని ఆలీ విమర్శించారు.
2019-03-11* 90 కోట్లు : ఇండియా మొత్తం ఓటర్ల సంఖ్య ఇది. అమెరికా, రష్యా, జపాన్, జర్మనీ, యుకె, ఫ్రాన్స్, ఇటలీ దేశాల జనాభా మొత్తాన్ని కలిపినా ఇంతకంటే తక్కువే. * 8.43 కోట్లు : 2014 ఎన్నికల తర్వాత నమోదైన ఓటర్ల సంఖ్య. విడివిడిగా చూస్తే జర్మనీ, ఫ్రాన్స్, యుకె దేశాల జనాభా కంటే ఎక్కువ. * 1.5 కోట్లు : 18,19 సంవత్సరాల వయసు ఓటర్ల సంఖ్య.
2019-03-11ఎన్నికల షెడ్యూలు వెలువడినందు ఇక ఓట్ల తొలగింపు దరఖాస్తుల స్వీకరణను నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం ఆయన 13 జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల తొలగింపు దరఖాస్తులు వెల్లువెత్తడంపై రాష్ట్రంలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. నకిలీ ఓటర్ల పేర్లు తొలగించాలంటూ దాఖలైన దరఖాస్తుల్లో ఎక్కువ భాగం నకిలీవని తేలింది. ఆదివారం వరకు పరిశీలించిన 7,24,914 దరఖాస్తుల్లో ఏకంగా 5,25,914 తప్పుడువేనని అధికారులు నిర్ధారించారు.
2019-03-10ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్ సభ, 175 అసెంబ్లీ సీట్లకు.. తెలంగాణ లోని 17 లోక్ సభ సీట్లకు తొలి దశలో ఒకేసారిగా (ఏప్రిల్ 11వ తేదీన) పోలింగ్ జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 18న విడుదల కానుంది. తర్వాత నామినేషన్ల దాఖలుకు మార్చి 25 వరకు గడువు ఉంటుంది. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన, 28వ తేదీన ఉపసంహరణ పూర్తయ్యాక... ఏప్రిల్ 11న పోలింగ్ జరుగుతుంది. అయితే, ఫలితాలు మాత్రం అన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ముగిశాక మే 23వ తేదీన విడుదలవుతాయి.
2019-03-10 Read More