ఐసిసి ప్రపంచ కప్ టోర్నీ గురువారం యు.కె.లో ప్రారంభం కానుంది. మే 30, జూలై 14 మధ్య 46 రోజుల్లో 48 మ్యాచులు 11 వేదికలపై జరుగుతాయి. మొదటి మ్యాచ్ ఆతిథ్య టీమ్, దక్షిణాఫ్రికా మధ్య లండన్ లోని కెన్నింగ్టన్ ఓవల్ స్టేడియంలో జరుగుతుంది. ఇండియా తొలి మ్యాచ్ జూన్ 5న దక్షిణాఫ్రికాతో సౌతాంప్టన్ లో జరుగుతుంది. జూలై 9, 11 తేదీల్లో సెమీఫైనల్స్, జూలై 14న ఫైనల్ ఉంటాయి. (పూర్తి షెడ్యూలుకోసం ఎడమకు స్వైప్ చేయండి)
2019-05-29 Read Moreతెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టీడీపీపీ) నేతగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నియమితులయ్యారు. బుధవారం తన నివాసంలో జరిగిన ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశం అనంతరం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభ, రాజ్యసభలలో పార్టీ పక్ష నేతలుగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, వైఎస్ చౌదరి (సుజనా చౌదరి)లను చంద్రబాబు నియమించారు.
2019-05-292014, 19 మధ్య కేంద్ర ఆర్థిక మంత్రిగా పని చేసిన అరుణ్ జైట్లీ కొత్త మంత్రివర్గంలో తన పేరు చేర్చవద్దంటూ మోదీకి లేఖ రాశారు. తనకు ఆరోగ్యం బాగాలేనందున చికిత్స చేయించుకోబోతున్నట్టు జైట్లీ పేర్కొన్నారు. జైట్లీకి ఈసారి ఆర్థిక శాఖ దక్కదన్న వార్తల మధ్య తాజా పరిణామం జరిగింది. గత ప్రభుత్వంలోనే చివరి సంవత్సరం అరుణ్ జైట్లీ చికిత్స పేరు చెప్పి పీయూష్ గోయల్ కు ఆర్థిక శాఖను అప్పగించారు. జైట్లీ తిరిగి వచ్చాక కూడా గోయల్ ఆర్థిక శాఖ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు.
2019-05-29 Read Moreఆయిల్ మార్కెటింగ్ కంపెనీల అప్పులు ఈ ఏడాది బాగా పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బిపిసిఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్.పి.సి.ఎల్)ల అప్పులు 2019 మార్చినాటికి రూ. 1.62 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడాదికంటే ఈ మొత్తం 30 శాతం అదనం. కేపిటల్ వ్యయం పెరగడం, ప్రభుత్వం నుంచి రావలసిన రూ. 33,900 కోట్ల సబ్సిడీ మొత్తం ఆలస్యం కావడం కంపెనీలపై అప్పుల భారం పెరగడానికి కారణాలు.
2019-05-29 Read Moreవాణిజ్య యుద్ధానికి తెర తీసిన అమెరికాకు చైనా ‘అరుదైన’ హెచ్చరిక చేసింది. సెల్ ఫోన్లనుంచి అణు విద్యుత్ కేంద్రాలవరకు అవసరమైన అరుదైన ఖనిజాల ఉత్పత్తిలో సింహభాగం (70 శాతం) చైనాలోనే జరుగుతోంది. అమెరికా 2014 నుంచి 2017 వరకు దిగుమతి చేసుకున్న అరుదైన ఖనిజాల్లో 80 శాతం చైనానుంచే వెళ్ళాయి. అవసరమైతే చైనా ఈ ఎగుమతులను నియంత్రిస్తుందని ఆ దేశ కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక ‘పీపుల్స్ డైలీ‘ బుధవారం ఓ సంపాదకీయంలో పేర్కొంది.
2019-05-29 Read Moreతెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికయ్యారు. బుధవారం చంద్రబాబు నివాసంలో శాసనసభా పక్ష సమావేశం జరిగింది. నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు, లోక్ సభ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
2019-05-29‘‘చంద్రబాబును 10 శాతం ఇవిఎంలు మోసం చేస్తే 90 శాతం పార్టీ నేతలే మోసం చేశారు’’.. టీడీపీ నేత నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారా? సాక్షి టీవీ ప్రసారం చేసిన వార్త వాస్తవమా? కాదు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మంగళవారం గుంటూరులో జరిగిన సభలో చంద్రబాబునాయుడు సమక్షంలో ఓ మహిళా కార్యకర్త ఈ వ్యాఖ్యలు చేశారు. లోకేష్ మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు మహిళా కార్యకర్త మాటలను ‘‘సాక్షి’’ లోకేష్ కు ఆపాదించింది.
2019-05-28ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 12;23 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ సహా పలువురు నేతలను ఆహ్వానించారు. మంగళవారం చంద్రబాబునాయుడుకు స్వయంగా ఫోన్ చేసిన జగన్, తన ప్రమాణ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.
2019-05-28లోక్ సభ ఎన్నికల్లో వైఫల్యం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానన్న రాహుల్ గాంధీకి డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ మంగళవారం ఫోన్ చేశారు. రాజీనామా చేయవద్దని స్టాలిన్ సూచించారు. ఎన్నికల్లో ఓడినా ప్రజల హృదయాలను గెలుచుకున్నారని రాహుల్ గాంధీకి స్టాలిన్ ప్రశంసించారు. డిఎంకె నాయకత్వంలోని కూటమి తమిళనాట విజయం సాధించినందుకు స్టాలిన్ ను రాహుల్ గాంధీ అభినందించారు.
2019-05-28 Read Moreపోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇకపైనా రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే జరుగుతుందని ప్రాజెక్టు అథారిటీ (పిపిఎ) ఛైర్మన్ ఆర్.కె. జైన్ స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడలో పీపీఎ సమావేశం జరిగింది. త్వరలో డిపిఆర్-2కు ఆమోదం లభిస్తుందని, వచ్చే ఏడాది జూన్ నాటికి గ్రావిటీతో నీళ్ళు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇవ్వాల్సింది రూ. 2 వేల కోట్లేనని, ప్రభుత్వం చెప్పినట్టు రూ. 4,800 కోట్ల పెండింగ్ నిధులతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు.
2019-05-28 Read More