ఎవరెస్టు పర్వతం ఎత్తు 8,848.86 మీటర్లుగా నేపాల్, చైనా ప్రభుత్వాలు మంగళవారం ప్రకటించాయి. ఇది గతంలో నిర్ధారించిన ఎత్తుకంటే 86 సెంటీమీటర్లు (సుమారు 3 అడుగులు) అధికం. నేపాల్, చైనా సరిహద్దుల్లో ఉన్న ఎవరెస్టు ఎత్తును తాజాగా కొలిచిన మీదట ఇరు దేశాల విదేశాంగ మంత్రులు మంగళవారం ఒకే సమయంలో ఖాట్మండు, బీజింగ్ లలో ప్రకటించారు. ఇప్పటివరకు అధికారికంగా పరిగణిస్తున్న ఎత్తు 8,848 మీటర్లు (29,028 అడుగులు). 1954లో సర్వే ఆఫ్ ఇండియా వేసిన కొలత అది. 1847లో ఇండియాలోని బ్రిటిష్ సర్వేయర్లు 15వ శిఖరం ఎత్తు 8,778 మీటర్లుగా ప్రకటించారు.
2020-12-08ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కేంద్ర ప్రభుత్వం పరిధిలో పని చేసే ఢిల్లీ పోలీసులు ‘దాదాపు హౌస్ అరెస్టు’ చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది. సిఎం నివాసానికి ర్యాలీగా వెళ్లి ఆయనను విడిపించుకుంటామని ప్రకటించింది. కేజ్రీవాల్ మంగళవారం సింగు సరిహద్దులో కేంద్రానికి నిరసన తెలుపుతున్న రైతులను కలసి మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు పోలీసులు సిఎం నివాసం చుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారని, పార్టీ ఎమ్మెల్యేలు కలవడానికి వెళ్తే కొట్టారని ‘ఆప్’ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ చెప్పారు.
2020-12-08కేంద్ర వ్యవసాయ చట్టాల ఉపసంహరణ కోరుతూ చారిత్రాత్మక పోరాటానికి దిగిన ఉత్తర భారత రైతులకు మద్ధతుగా మంగళవారం భారత్ బంద్ విజయవంతమైంది. 25 రాజకీయ పార్టీలు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బంద్ కు సహకరించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రైతు నాయకులకు మంగళవారం సాయంత్రమే కలవమని ఆహ్వానం పంపారు. వ్యవసాయ మంత్రి నేత్రుత్వంలో ముగ్గురు కేంద్ర మంత్రులు రైతు ప్రతినిధులతో బుధవారం మరోసారి సమావేశం కానుండగా.. అంతకు ముందే అమిత్ షా ఆహ్వానించడం గమనార్హం.
2020-12-08జాతీయ రాజధాని సరిహద్దుల్లో మంగళవారం మరిన్ని పోలీసు బలగాలను మోహరించింది కేంద్ర ప్రభుత్వం. పోలీసులు రోడ్లపైన అనేక వరుసల్లో బ్యారికేడ్లు, కాంక్రీట్ దిమ్మెలను అడ్డుపెట్టారు. ఢిల్లీలోకి ప్రవేశించే మరో రెండు మార్గాలను మూసివేశారు. కేంద్ర వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఉత్తర భారత రైతులు రెండు వారాలుగా రాజధాని సరిహద్దుల్లోని రహదారులపై మోహరించి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం భారత్ బంద్ నేపథ్యంలో ఢిల్లీ చుట్టూ పోలీసు బలగాలు భారీగా మోహరించాయి.
2020-12-08నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోకపోతే తన ‘రాజీవ్ ఖేల్ రత్న’ అవార్డును తిరిగి ఇచ్చేస్తానని ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ హెచ్చరించారు. ఆదివారం హర్యానా-ఢిల్లీ సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతుల వద్ద మాట్లాడుతూ విజేందర్ ఈ ప్రకటన చేశారు. ఇండియా క్రీడలలో ఇచ్చే అత్యున్నతమైన పురస్కారం ‘ఖేల్ రత్న’. ఒలింపిక్స్ (2008) బాక్సింగ్ లో ఇండియాకు తొలి పతకం సాధించిన దిగ్గజం విజేందర్ సింగ్. హర్యానాకు చెందిన ఈ బాక్సర్ కు 2009లో భారత ప్రభుత్వం ‘ఖేల్ రత్న’ను ప్రకటించింది.
2020-12-06భారత నూతన పార్లమెంటు భవనానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10న పునాది రాయి వేస్తారని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. ఆధునిక పరికరాలతో భూకంప-సురక్షితంగా నిర్మించే ఈ భవనంలో సంయుక్త సమావేశాలలో 1,224 మంది వరకు కొలువుదీరేలా వసతి ఉంటుందని స్పీకర్ తెలిపారు. ఓం బిర్లా ఈ విషయమై శనివారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. లోక్ సభలో 888 సీట్లు, రాజ్యసభలో 384 సీట్లు ఉంటాయని, ప్రస్తుత పార్లమెంటు భవనానికి ఆనుకొని నిర్మించే కొత్త భవనం 22 నెలల్లో పూర్తవుతుందని స్పీకర్ చెప్పారు.
2020-12-05కోవిడ్ టీకా ప్రయోగాల్లో భాగంగా భారత్ బయోటెక్ రూపొందించిన ‘కోవాక్సిన్’ తీసుకున్న హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ కరోనా బారిన పడ్డారు. కరోనా పరీక్షలలో పాజిటివ్ ఫలితం వచ్చిందని శనివారం ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ వార్త దేశవ్యాప్తంగా కలకలం రేపింది. టీకా తీసుకున్న తర్వాత కూడా కరోనా సోకడం ఏమిటి? టీకా విఫలమైందా? అనే ప్రశ్నలు తెలెత్తాయి. అయితే, మంత్రి ఒక్క డోసు మాత్రమే తీసుకున్నారని, రెండో డోసు తీసుకున్న తర్వాత కొద్ది రోజులకు మాత్రమే ప్రతిరోధకాలు జనిస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ వివరణ ఇచ్చింది.
2020-12-05చైనా రూపొందించిన ‘కృత్రిమ సూర్యుడు’ తొలిసారిగా విజయవంతంగా పని చేశాడు. అణు విద్యుత్ పరిశోధనా సామర్ధ్యంలో గొప్ప ముందడుగా భావిస్తున్న న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ హెచ్ఎల్-2ఎం టొకమాక్ ను చైనా గత ఏడాది రూపొందించింది. దీన్నే ‘కృత్రిమ సూర్యుడు’గా వ్యవహరిస్తున్నారు. ఇది చైనాలో అతిపెద్ద రియాక్టర్, అత్యాధునిక న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రయోగాత్మక పరికరం. 150 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రత వరకు చేరుకొని ఇంధనాన్ని ఉత్పత్తి చేయగలదు. అంటే, సూర్యుడి కేంద్రకంలో ఉండే ఉష్ణోగ్రత కంటే 10 రెట్లు అధికం.
2020-12-05ఇండియాలో మూడు టీకాలు వివిధ ప్రయోగ దశలలో ఉన్నాయని, ఒక టీకా మరికొద్ది వారాల్లో సిద్ధమవుతుందని నిపుణులు విశ్వాసం వ్యక్తం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కోవిడ్- టీకా సవాళ్ళపై శుక్రవారం మోదీ రాజకీయ పార్టీలతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. టీకా ధర నిర్ణయం, పంపిణీ అంశాలపై రాష్ట్రాలతో చర్చలు జరుగుతున్నాయని ప్రధాని చెప్పారు. ఈ సమావేశానికి వివిధ పార్టీల నుంచి 12 మంది నాయకులు హాజరయ్యారు. కేంద్ర రక్షణ, హోం, వైద్య శాఖల మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, హర్షవర్ధన్ సమావేశంలో ఉన్నారు.
2020-12-04ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులపై ‘ఖలిస్థానీలు’, ‘దేశ వ్యతిరేకులు’గా ముద్ర వేయవద్దని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (ఇజిఐ) మీడియా సంస్థలకు సూచించింది. ఇలాంటి కవరేజ్ బాధ్యతాయుతమైన, నైతిక పాత్రికేయ నియమాలకు విరుద్ధమని శుక్రవారం గిల్డ్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ‘‘రైతుల నిరసనను చట్టవిరుద్ధమైనదిగా చెప్పడానికి వారిని ఏ ఆధారాలూ లేకుండా ‘ఖలిస్థానీలు’, ‘జాతివ్యతిరేకులు’ అంటూ మీడియాలోని కొన్ని సెక్షన్లు ముద్రలు వేస్తున్నాయి. ఈ కవరేజ్ పట్ల ఎడిటర్స్ గిల్డ్ ఆందోళన చెందుతోంది’’ అని పేర్కొంది.
2020-12-04