డెయిరీ రైతు పేహ్లుఖాన్ (55)ను మూకగా హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న ‘గో సంరక్షకులు’ ఆరుగురినీ హర్యానా కోర్టు వదిలేసింది. 2017 ఏప్రిల్ 1న పట్టపగలు జాతీయ రహదారి 8పైన జరిగిన దాడి వీడియోను దేశమంతా నివ్వెరపోయి చూసింది. ఈ కేసులో ఖాన్ కుమారులు ఇద్దరితోపాటు 40 మంది సాక్షులను అల్వార్ లోని అదనపు జిల్లా&సెషన్స్ కోర్టు విచారించింది. ఇరువైపులా వాదనలు ఈ నెల 7వ తేదీతో పూర్తి కాగా జడ్జి సరితా స్వామి బుధవారం తీర్పు వెలువరించారు.
2019-08-14 Read Moreఅయోధ్య రాముని జన్మస్థలం అన్నది హిందువుల విశ్వాసమని, దాన్ని దాటి అందులో హేతుబద్ధత ఏమిటన్న అంశానికి కోర్టు వెళ్లకూడదని రాంలల్లా తరపు న్యాయవాది సూచించారు. రామజన్మభూమి-బాబ్రీమసీదు స్థల వివాదంలో భూయాజమాన్య హక్కులపై సుప్రీంకోర్టు విచారణ బుధవారం ఆరో రోజుకు చేరింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వాదనలు వింటోంది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలంపై ముస్లింలు హక్కును కోరలేరని న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్ వాదించారు.
2019-08-14 Read Moreపోలవరం విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి నవయుగ కంపెనీ బ్యాంకు గ్యారంటీలను జప్తు చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్యాంకులను కోరింది. బ్యాంకులు దీనికి కొంత సమయం కోరినట్టు సమాచారం. మరోవైపు... జప్తును అడ్డుకోవడానికి నవయుగ కంపెనీ కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది. ‘నవయుగ’ను ఇప్పటికే పోలవరం హెడ్ వర్క్స్ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం, తాజాగా ‘ఏపీ జెన్ కో’ జల విద్యుత్ ప్రాజెక్టు విషయంలోనూ కంపెనీపై చర్యలకు దిగడం గమనార్హం.
2019-08-14 Read Moreబాలాకోట్ దాడుల తర్వాత రోజు (ఫిబ్రవరి 27) గగనతల ఘర్షణలో పాల్గొని పాకిస్తాన్ సైన్యానికి బంధీగా చిక్కిన వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ ‘వీర్ చక్ర’ పురస్కారాన్ని అందుకోబోతున్నారు. భారత స్వాతంత్ర దిన వార్షికోత్సవం సందర్భంగా రేపు వర్తమాన్ ఈ పురస్కారాన్ని అందుకుంటారని ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. యుద్ధ పురస్కారాల్లో ప్రాధాన్యతా క్రమంలో మూడవది ‘వీర్ చక్ర’. పరమవీర్ చక్ర, మహావీర్ చక్ర అత్యంత ప్రాధాన్యత గల పురస్కారాలు.
2019-08-14 Read Moreపోలవరం టెండరును రద్దు చేసి మళ్ళీ పిలవడం వల్ల నిర్మాణం ఆలస్యమవుతుందని, వ్యయం కూడా బాగా పెరిగే అవకాశం ఉందని ప్రాజెక్టు అథారిటీ (పిపిఎ) ఆందోళన వ్యక్తం చేసింది. పోలవరం హెడ్ వర్క్స్ చేస్తున్న నవయుగ కంపెనీని రాష్ట్ర ప్రభుత్వం తప్పించిన (ప్రీ క్లోజర్) నేపథ్యంలో పిపిఎ మంగళవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అథారిటీ ఛైర్మన్ ఆర్.కె. జైన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం అనంతరం ఓ ప్రకటన విడుదలైంది. తుది నిర్ణయం తీసుకోబోయే ముందు మరోసారి ఆలోచించాలని అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
2019-08-13స్పానిష్ ఎయిర్ ఫోర్సుకు చెందిన ఎఫ్-18 యుద్ధ విమానాన్ని తమ ఫైటర్ జెట్ ఎస్.యు-27 దూరంగా తరమిన వీడియోను రష్యా మిలిటరీ మంగళవారం విడుదల చేసింది. రష్యా రక్షణ మంత్రి, అధికారులు ప్రయాణిస్తున్న పాసెంజర్ విమానం బాల్టిక్ సముద్రంపై నుంచి వెళ్తున్నప్పుడు స్పానిష్ యుద్ధ విమానం చాలా దగ్గరగా వచ్చింది. దీంతో..మంత్రి విమానానికి రక్షణగా వచ్చిన రష్యా ఫైటర్ జెట్ స్పానిష్ యుద్ధ విమానం దిశగా వెళ్లింది. అది చూసి ఎఫ్-18 దూరంగా జరిగి ఆ తర్వాత వేగంగా ఎత్తుకు ఎగిరిపోయింది.
2019-08-13రూపాయి విలువ 6 నెలల కనిష్ఠానికి పడిపోయింది. అమెరికన్ డాలరుతో పోలిస్తే మంగళవారం 62 పైసలు తగ్గి రూ. 71.40 వద్ద ముగిసింది. మార్కెట్ల పతనం, అర్జెంటినా కరెన్సీ కుప్పకూలడం ఇన్వెస్టర్లను సురక్షిత మార్గాలవైపు మళ్లించాయి. గత శుక్రవారం ఒక డాలరుకు రూ. 70.78 వద్ద మార్కెట్ ముగిసింది. బక్రీద్ పండుగ కారణంగా సోమవారం మార్కెట్లకు సెలవు. మంగళవారం ఇంటర్ బ్యాంకు ఫారెన్ ఎక్సేంజ్ వద్ద రూ. 71.15గా ప్రారంభమైన డాలర్ విలువ ఒక దశలో రూ. 71.02కు చేరుకొని చివరికి రూ. 71.40గా ముగిసింది.
2019-08-13 Read Moreనిమిషానికి రూ. 50 లక్షలు. రోజుకు సుమారు రూ. 700 కోట్లు. వాల్ మార్ట్ వెనుక ఉన్న వాల్టన్ కుటుంబ సంపద పెరుగుతున్న తీరు ఇది. బ్లూంబెర్గ్ ర్యాంకుల్లోని సంపన్నులు గత ఏడాది నుంచి కూడాబెట్టిన మొత్తాలు చూస్తే కళ్లు తిరగడం ఖాయం. వాల్టన్ కుటుంబ ఆస్తి 2018 జూన్ కంటే ఇప్పటికి 39 బిలియన్ డాలర్లు పెరిగి 191 బిలియన్ డాలర్లకు చేరింది. ఇతర అమెరికన్ సంపన్న కుటుంబాల్లో ‘మార్స్’ ఆస్తి గత ఏడాదికంటే 37 బిలియన్ డాలర్లు పెరిగింది. పారిశ్రామిక, రాజకీయ దిగ్గజం ‘కోచ్స్’ సంపద 26 బిలియన్ డాలర్లు పెరిగింది.
2019-08-11 Read Moreమాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరోసారి రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. ఈసారి ఆయన రాజస్థాన్ నుంచి ఎన్నికకోసం ఈ నెల 13న నామినేషన్ దాఖలు చేయనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇంతకు ముందు మన్మోహన్ సింగ్ అస్సాం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆయన సభ్యత్వం జూన్ మాసంతో ముగిసింది. రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు మదన్ లాల్ సైని మరణంతో ఈ నెల 24న ఓ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానం నుంచి మన్మోహన్ సింగ్ ను రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
2019-08-11 Read Moreకాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలను ఆ పార్టీ నేతలు మరోసారి సోనియాగాంధీకి అప్పగించారు. శనివారం సమావేశమైన పార్టీ వర్కింగ్ కమిటీ సోనియాను ‘మధ్యంతర’ అధ్యక్షురాలిగా ఎంపిక చేసింది. ఈ విషయం శనివారం బాగా పొద్దుపోయిన తర్వాత వెల్లడైంది. అంతకు ముందు వర్కింగ్ కమిటీ ఐదు సబ్ గ్రూపులు సమర్పించిన నివేదికలపై విస్తృతంగా చర్చలు జరిపింది. శనివారం ఉదయం ఓసారి సమావేశమైన కమిటీ రాహుల్ గాంధీని కొనసాగవలసిందిగా కోరింది. అయితే, ఆయన అప్పుడూ తిరస్కరించారు.
2019-08-10 Read More