చైనాను దాటి ప్రపంచమంతటా ‘కరోనా వైరస్’ విస్తరిస్తున్న నేపథ్యంలో... అన్ని రకాల వ్యక్తిగత రక్షణ పరికరాల ఎగుమతిని ఇండియా నిషేధించింది. గాలి ద్వారా వ్యాపించే కణాల నుంచి రక్షణకోసం వినియోగించే మాస్కులు, శరీరం మొత్తం కప్పి ఉంచే దుస్తులు నిషేధిత జాబితాలో ఉన్నాయి. చైనాలో ఈ వైరస్ 200 మందికి పైగా ప్రజలను బలి తీసుకోవడం, ఇండియాలో తొలి కేసు నమోదు కావడం తెలిసిందే. దీంతో, ముందు జాగ్రత్త చర్యగా ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.
2020-01-31‘‘మాట్లాడుకుందాం.. ప్రభుత్వం కమిటీ వేస్తే భాగస్వాములు కండి’’.. ఇదీ రాజధాని రైతులతో నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు రాయబారం సారాంశం. శుక్రవారం మందడం గ్రామంలో రైతుల నిరశన శిబిరాన్ని ఎంపీ సందర్శించారు. రైతుల ఆవేదనను, అధికార పార్టీ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆచితూచి మాట్లాడారు. ‘‘రెండు వైపులా ఒక్కో మాట తూలి ఉండొచ్చు. మీరు పెద్దవారు. మీ పిల్లలు విదేశాల్లో కూడా చదువుకున్నారు. కొద్దిగా సమన్వయం పాటించి ముందుకు వెళ్లాలని మిమ్మల్ని కోరుతున్నా’’ అని రైతులకు ఎంపీ విన్నవించారు.
2020-01-31రాజధాని తరలింపును నిరసిస్తూ 45 రోజులుగా ఆందోళన చేస్తున్న అమరావతి ప్రాంత రైతులను తొలిసారిగా ఓ అధికార పార్టీ నేత శుక్రవారం పరామర్శించారు. నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు మందడంలోని శిబిరానికి వచ్చి రైతులతో మాట్లాడారు. ‘‘మీ ఆస్తి వ్యాపారాలతో వచ్చింది కాదు. తరతరాలుగా వచ్చిన ఆస్తి కాబట్టి భావోద్వేగం ఉంటుంది. మీ భావోద్వేగం మాకు కూడా తెలుసు. మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకూడదు. మీకు అందరికీ అన్ని విధాలా న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం. న్యాయం జరిగే ప్రక్రియ తొందర్లోనే జరగాలని ఆశిద్దాం’’ అని ఎంపీ పేర్కొన్నారు.
2020-01-31నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక ‘మేకిన్ ఇండియా’ నినాదమిచ్చారు. అధికార బిజెపి, దాని సోదర సంస్థలు చైనా ఉత్పత్తులపై ప్రచ్ఛన్న యుద్ధం చేశాయి. అయినా, చైనా నుంచి వస్తువుల దిగుమతులు వెల్లువెత్తాయి. మోడీ హయాంలో చైనాతో భారత వాణిజ్య లోటు మొత్తం 304.23 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 21.90 లక్షల కోట్లు)గా తేలింది. 2017-18లో పతాక స్థాయికి చేరిన లోటు 2018-19లో తగ్గింది. 2019-20లో నవంబర్ వరకు 35.32 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే, మోడీ హయాంలో అమెరికాతో వాణిజ్య మిగులు 108.12 బిలియన్ డాలర్లుగా ఉంది.
2020-01-31శుక్రవారం పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, పౌరసత్వ సవరణ చట్టం బాధిత మైనారిటీలకోసమేనని చెప్పడాన్ని ప్రతిపక్షం తప్పుపట్టింది. రాష్ట్రపతి ప్రసంగంలో ఈ అంశం వచ్చినప్పుడు ‘‘సిగ్గు సిగ్గు’’ అని ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. భారతీయాత్మపై నమ్మకం ఉంటే సిఎఎకు మద్ధతు ఇవ్వాలని రాష్ట్రపతి హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం రాసి ఇచ్చిన ప్రసంగాన్ని రాష్ట్రపతి చదవడం ఆనవాయితీ. ప్రసంగ సమయంలో అధికారపక్షం సభ్యులు అనేకసార్లు బల్లలపై చరిచి మద్ధతు తెలిపారు.
2020-01-312020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 6 నుంచి 6.5 శాతం వరకు ఉంటుందని ఆర్థిక సర్వే 2020 అంచనా వేసింది. ఈ (2019-20) ఆర్థిక సంవత్సరం నమోదయ్యే 5 శాతంతో పోలిస్తే ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడాది పుంజుకుంటుందని పేర్కొంది. 2020 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే పత్రాన్ని పార్లమెంటు ముందుంచారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జాతీయ ఆర్థిక వ్యవస్థ గమనాన్ని ఈ పత్రంలో విశ్లేషించారు.
2020-01-31పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, నిరసనల సందర్భంలో జరుగుతున్న హింస ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని వ్యాఖ్యానించారు. శుక్రవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ప్రారంభించిన రాష్ట్రపతి, ఉభయ సభల సభ్యులను ఉద్ధేశించి మాట్లాడారు. కొత్త ప్రభుత్వ తొలి 7 మాసాల కాలంలో అనేక ముఖ్యమైన చట్టాలను చేయడం ద్వారా పార్లమెంటు రికార్డు సృష్టించిందని రాష్ట్రపతి ప్రశంసించారు.
2020-01-31చైనాను కమ్మేసిన ‘కరోనా వైరస్’కు కేంద్ర బిందువైన వుహాన్ నగరంలో గురువారం ఓ దృశ్యం ప్రజలను మరింత భయకంపితులను చేసింది. ఓ వృద్ధుడు వీధిలో మరణించి పడి ఉన్న హృదయవిదారక దృశ్యం అది. ఆయన ‘కరోనావైరస్’తో మరణించారా..లేక మరేదైనా కారణమా? అన్నది తెలియరాలేదు. ముఖానికి మాస్క్, చేతిలో షాపింగ్ బ్యాగ్ ఉన్నాయి. వైద్య సిబ్బంది వచ్చేవరకు... రోడ్డుపై తిరుగుతున్న ఒకరిద్దరు కూడా మృతదేహం వైపు వెళ్లే సాహసం చేయలేదు.
2020-01-31 Read Moreఈ పార్లమెంటు సమావేశాల్లో ప్రధానంగా ఆర్థిక అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు మోడీ మీడియాతో మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థ, సంబంధిత అంశాలపై పార్లమెంటు ఉభయ సభల్లో అర్ధవంతమైన చర్చ జరగాలని ప్రధాని పేర్కొన్నారు. ఈ దశాబ్దానికి బలమైన పునాది ప్రస్తుత సమావేశాల్లోనే వేయాలన్నారు.
2020-01-31చైనాలో వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచం మొత్తానికి సమస్యగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సమస్యను అంతర్జాతీయ ఆరోగ్య అత్యయిక స్థితిగా ప్రకటించింది. గురువారం (జెనీవా సమయం) సమావేశమైన డబ్ల్యుహెచ్ఒ... ‘కరోనావైరస్’ను ఎదుర్కోవడంలో చైనా సామర్ధ్యాన్ని ప్రశంసించింది. ఆరోగ్య వ్యవస్థలు బలహీనంగా ఉన్న దేశాలపై వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని, అందుకే ఆరోగ్య ఎమర్జెన్సీని ప్రకటిస్తున్నామని పేర్కొంది.
2020-01-31