2011కంటే భారతీయుల నెలవారీ వ్యయం తగ్గిందని ఎన్ఎస్ఎస్ఒ డేటా స్పష్టం చేస్తుంటే.. అందుకు భిన్నంగా పేదరికం 7 శాతానికి తగ్గిందని కొత్త అధ్యయనం ఒకటి చెబుతోంది. 2011లో 27 కోట్లు (దేశ జనాభాలో 14.9%)గా ఉన్న పేదలు 2017 నాటికి 8.4 కోట్లకు తగ్గారని సూర్జిత్ ఎస్. భల్లా, అరవింద్ విర్మాని, కరణ్ భాసిన్ అంచనా వేశారు. ‘‘పావర్టీ, ఇనీక్వాలిటీ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ ఇన్ ఇండియా’’ పేరిట ఓ అధ్యయన పత్రాన్ని వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్.సి.ఎ.ఇ.ఆర్)కు సమర్పించారు.
2020-02-18 Read Moreఇండియాలో కంపెనీలు ఈ ఏడాది వేతనాలను సగటున 9.1 శాతం పెంచవచ్చని హెచ్ఆర్ కన్సల్టెన్సీ సంస్థ ‘అయాన్’ తన వార్షిక సర్వే నివేదికలో అంచనా వేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇదే అత్యధికం కాగా.. ఇండియాలో గత ఏడాది పెరుగుదల కంటే తక్కువ కావడం గమనార్హం. 2019లో వేతనాలు సగటున 9.3 శాతం పెరిగాయి. మంగళవారం విడుదలైన ఈ నివేదిక కోసం 20 రంగాలకు సంబంధించిన 1,000 సంస్థల్లో సర్వే చేశారు. 2020లో 39% సంస్థలు వేతనాల్లో 10 శాతం పైగా పెంపుదలను సూచించాయి.
2020-02-18 Read Moreభారత పౌరులమని నిరూపించుకోవాలంటూ హైదరాబాద్ వాసులు ముగ్గురికి యునీక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న ముగ్గురూ ముస్లింలే..! వారు భారత పౌరులు కారని, తప్పుడు పత్రాలు చూపించి ‘ఆధార్’ కార్డులు పొందారని అధారిటీ ప్రాంతీయ కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నెల 20న యుఐడిఎఐ ప్రాంతీయ కార్యాలయానికి వచ్చి కలవాలని ఈ అంశంపై విచారణాధికారిగా నియమితులైన అమిత బింద్రూ నోటీసులు పంపారు.
2020-02-18 Read Moreజనాభాలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. బడ్జెట్ పరిమాణంలోనూ ఆ రాష్ట్రమే నెంబర్ 1. అయితే, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వ్యయంలో అధిక భాగాన్ని ఆ రాష్ట్రం సంపాదించడం లేదు. యూపీ ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన 2020-21 బడ్జెట్ ప్రకారం మొత్తం వ్యయంలో 32.37 శాతం (రూ. 1,66,021 కోట్లు) మాత్రమే సొంత పన్నుల ఆదాయం. దాదాపు దానికి సమానంగా రూ. 1,52,863.17 కోట్లు కేంద్ర పన్నుల్లో వాటా వస్తుందని అంచనా. రూ. 77,990.70 కోట్లు అప్పులతో సమకూరనుండగా మిగిలిన మొత్తంలో అధికభాగం కేంద్రం గ్రాంట్ల రూపంలో రానుంది.
2020-02-18ప్రత్యేక ఆర్థిక మండళ్ళ ద్వారా ఎగుమతులు 100 బిలియన్ డాలర్లకు చేరినట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంగళవారం వెల్లడించింది. 2019-20లో సోమవారం (ఫిబ్రవరి 17) వరకు ఎస్.ఇ.జడ్.ల ద్వారా 100.59 బిలియన్ డాలర్ల విలువైన వస్తు సేవలు ఎగుమతి అయ్యాయి. గత ఏడాది కంటే వస్తువుల ఎగుమతి విలువ కేవలం 2.97 శాతం పెరిగితే..సేవల ఎగుమతులు 22.61 శాతం పెరిగాయి. మొత్తంగా పెరుగుదల 13.42 శాతం. ఫిబ్రవరి 17 వరకు 42.7 బిలియన్ డాలర్ల వస్తువులు, 57.89 బిలియన్ డాలర్ల సేవలు ఎగుమతి అయ్యాయి.
2020-02-18 Read Moreఏపీలో 8 మంది ఐపిఎస్ అధికారులకు స్థానచలనమైంది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కె.ఆర్.ఎం. కిషోర్ కుమార్ ను ఎపి రోడ్డు భద్రతా సంస్థ ఛైర్మన్ పోస్టులో నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నవారిలో... అదనపు డీజీపీ కుమార్ విశ్వజిత్ హోం శాఖ ముఖ్యకార్యదర్శిగా, ఎన్. బాలసుబ్రహ్మణ్యం రైల్వే అదనపు డీజీపీగా, సునీల్ కుమార్ నాయక్ సీఐడీ డీఐజీగా, అభిషేక్ మహంతి గ్రేహౌండ్స్ కమాండరుగా నియమితులయ్యారు. క్రిపానంద్ త్రిపాఠి (డీజీ, డ్రగ్ కంట్రోల్)ని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.
2020-02-18‘‘మున్సిపాలిటీ అంటేనే మురికికి పర్యాయపదంగా మారింది. అవినీతికి మారుపేరు అయింది. బల్దియా... ఖాయా పీయా చల్దియా అనే సామెతలు వచ్చాయి. ఆ చెడ్డ పేరు పోవాలి. పట్టణ ప్రగతి ప్రణాళికా బద్ధంగా ఉండాలి. అది మీ చేతుల్లో ఉంది’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లకు హితబోధ చేశారు. తెలంగాణ పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకోవాలని మంగళవారం ప్రగతిభవనంలో జరిగిన సమ్మేళనంలో పిలుపునిచ్చారు.
2020-02-18హైదరాబాద్ భరత్ నగర్ బ్రిడ్జిపై నుంచి మంగళవారం వేకువజామున ఓ కారు అతి వేగంతో కిందకు పడిపోయింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా ఐదుగురు గాయపడ్డారు. భరత్ నగర్ నుంచి ఎర్రగడ్డ వైపు వస్తూ అతి వేగంతో వంతెన గోడను ఢీకొట్టారు. వేకువజామున కావడంతో జనసంచారం పెద్దగా లేదు. చనిపోయిన వ్యక్తిని బోరబండకు చెందిన సోహైల్ గా గుర్తించారు. గతంలో గచ్చిబౌలి బయో డైవర్సిటీ వంతెన పై నుంచి కూడా ఓ కారు అమాంతం కిందకు పడిపోయింది.
2020-02-18సెలక్ట్ కమిటీల ఏర్పాటు విషయంలో శాసన వ్యవస్థ సచివాలయ కార్యదర్శి తన ఆదేశాలను లెక్క చేయకపోవడంపై ఆగ్రహంతో ఉన్న శాసన మండలి ఛైర్మన్ ఎంఎ షరీఫ్ ఈ విషయమై గవర్నరు బిశ్వబూషణ్ హరిచందన్ తో చర్చించనున్నారు. రాజధాని తరలింపునకు ఉద్ధేశించిన రెండు బిల్లులను సెలక్ట్ కమిటీలకు పంపాలని నిర్ణయించిన షరీఫ్, కమిటీల ఏర్పాటు ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా కార్యదర్శిని ఆదేశించినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వ ఒత్తిడితోనే ఛైర్మన్ ఆదేశాలను కార్యదర్శి ధిక్కరించారనే ఆరోపణలున్నాయి.
2020-02-18ఎయిర్ ఇండియా రిక్రూట్ మెంట్ యాడ్ పేరిట ఓ తప్పుడు ఇ-మెయిల్ అనేక మందికి అందింది. ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం 11.30కి ముంబై చత్రపతి శివాజీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో ఇంటర్వ్యూకి హాజరు కావాలని ఆ యాడ్ లో సూచించారు. అయితే, అలాంటి ఇ మెయిల్ ఏదీ తాము పంపలేదని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. ఉద్యోగార్ధులు నోటిఫికేషన్లకోసం ఎయిర్ ఇండియా అధికారిక వెబ్ సైట్ (www.airindia.in) చూడాలని ఆ సంస్థ సూచించింది.
2020-02-18