పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మండిపడ్డారు. మైనారిటీలపై పాకిస్తాన్ దాష్ఠీకానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని హితవు పలికారు. గురువారం కర్నాటకలోని తుమకూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మోడీ మాట్లాడారు. ‘‘మతం పునాదులపైనే పాకిస్తాన్ ఏర్పాటైంది. అందువల్లనే... హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లపై దాడులు పెరిగాయి. కానీ, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా మాట్లాడవు’’ అని ఆరోపించారు.
2020-01-02 Read More2021 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాలీలను ఆకట్టుకోవడానికి అమిత్ షా బంగ్లా భాషను నేర్చుకుంటున్నారు. ఎన్నికల వ్యూహాలకు భాష అడ్డు కాకూడదని షా భావిస్తున్నారట. ‘‘బెంగాలీ ఆత్మగౌరవ’’ నినాదంతో మమతా బెనర్జీ చేస్తున్న ఎదురు దాడిని తట్టుకోవాలంటే భాషను నేర్చుకోక తప్పదని షా భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ‘బయటి వ్యక్తులు’ అని మమత వ్యాఖ్యానించడం బిజెపికి ఇబ్బందికరమైంది.
2020-01-02 Read More‘‘టిక్ టాక్’ వీడియోలు చేయడం కాదు. కాస్త జనాన్ని కూడా చూడండి’ అని తెలుగుదేశం పార్టీ నేత అనురాధ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పుష్ఫశ్రీవాణికి సూచించారు. సిఎం జగన్ పాలనను పొగుడుతూ డిప్యూటీ సిఎం ‘టిక్ టాక్’లో వీడియో పోస్టు చేసిన విషయాన్ని అనురాధ గురువారం విలేకరుల సమావేశంలో గుర్తు చేశారు. ‘‘ప్రజలు మిమ్మల్ని చూడాలంటే టిక్ టాక్ వీడియోలు చూడాలి. పని కావాలంటే మీ నియోజకవర్గంలో ఓ మనిషిని కలవాలి’’ అని అనురాధ విమర్శించారు.
2020-01-02‘‘వైసీపీ ఫ్యాన్ రెక్కలు మూడున్నాయి కాబట్టి రాష్ట్ర రాజధాని కూడా మూడు ముక్కలు చేద్దామనుకుంటున్నారేమో!’’ అని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యంగ్యాస్త్రం విసిరారు. ‘మూడు రాజధానులు’ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. దక్షిణాఫ్రికాలో ఉన్న జాతి విభేదాలు, విదేశీ పాలకుల కారణంగా అక్కడ చారిత్రకంగా మూడు రాజధానులు ఉన్నాయని, అది సరి కాదని నెల్సన్ మండేలా కూడా చెప్పారని యనమల గుర్తు చేశారు.
2020-01-022019లో ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) 243 కేసులు నమోదు చేసింది. వాటిలో 96 ట్రాప్ కేసులు కాగా 23 ఆదాయానికి మించి ఆస్తులు తేలినవి. ప్రభుత్వ శాఖల్లో రెవెన్యూ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. ఆ శాఖకు సంబంధించిన అధికారులపై 36 కేసులు నమోదు కాగా, హోం శాఖకు సంబంధించి 11, మున్సిపల్ శాఖకు సంబంధించి 9 నమోదయ్యాయి. తర్వాత స్థానాల్లో ఇంథనం (7), పంచాయతీరాజ్ (6), జల వనరుల శాఖ (4), విద్యా శాఖ (4) ఉన్నాయి.
2020-01-01తమ డిగ్రీలు చూపించలేని ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు దేశ పౌరులను ఆధారాలు అడుగుతున్నారని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆక్షేపించారు. ఇది చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. ఎన్.ఆర్.సి.కి ఎన్.పి.ఆర్. ప్రాతిపదిక అవుతుందని స్పష్టం చేసిన ఏచూరి, సంబంధం లేదన్న విధంగా కేంద్రం తప్పుడు వివరణలు ఇస్తోందని విమర్శించారు. గురువారం ఉదయం ఏచూరి వరుస ట్వీట్లతో కేంద్రంపై విరుచుకుపడ్డారు.
2020-01-02అణు, క్షిపణి పరీక్షలపై మారటోరియం ముగిసినట్టు ఉత్తర కొరియా చేసిన ప్రకటనపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. అణు, క్షిపణి పరీక్షలను పునరుద్ధరించవద్దని ఆయన ఉత్తర కొరియాకు విన్నవించారు. అణ్వాయుధాలు, దూర శ్రేణి బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగంపై తాము స్వయంగా విధించుకున్న మారటోరియాన్ని ముగిస్తూ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర్వుపై సంతకం చేసినట్టు ఉత్తర కొరియా బుధవారం ప్రకటించింది.
2020-01-02 Read Moreకంటే జనవరి 1నే కనాలి... అనే కోరికతో చాలామంది సిజేరియన్ తేదీని నిర్ణయించుకుంటున్నారు. ఈ ధోరణి ఇండియాలో ఎక్కువగా ఉందని ‘యునిసెఫ్’ ఆందోళన వ్యక్తం చేసింది. 2020 జనవరి 1న ప్రపంచ వ్యాప్తంగా 3,92,078 మంది పిల్లలు పుట్టినట్టు ఆ సంస్థ అంచనా. అందులో ఇండియా 67,385 జననాలతో అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో చైనా (46,229), నైజీరియా (26,039), పాకిస్తాన్ (16,787), ఇండోనేషియా (13,020), అమెరికా (10,452) ఉన్నాయి.
2020-01-02తైవాన్ మిలిటరీ హెలికాప్టర్ ఒకటి గురువారం ఉదయం 9 గంటల సమయంలో అత్యవసరంగా నేలకు దిగింది. అందులో ప్రయాణిస్తున్న ఉన్నతాధికారిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఉత్తర తైవాన్ ప్రాంతంలో ప్రమాదకర పరిస్థితుల్లో నేలకు దిగిన బ్లాక్ హాక్ హెలికాప్టర్లో 13 మంది ఉండగా 11 మంది బయటపడ్డారు. ఇద్దరి ఆచూకీ తెలియలేదు.
2020-01-02 Read Moreగురువారం ఉదయం మార్కెట్లలో మిశ్రమ స్పందన కనిపించింది. 117.44 పాయింట్ల పెరుగుదలతో స్టాక్ మార్కెట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో అమెరికన్ డాలరుతో పోల్చినప్పుడు రూపాయి విలువ తగ్గింది. 11 పైసలు పడిపోయి డాలరుకు రూ. 71.33 వద్ద వాణిజ్యం ప్రారంభమైంది. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటిదాకా రూపాయి విలువ 3 శాతం పడిపోగా, బెంచ్ మార్కు సెన్సెక్స్ 6.81 శాతం పెరిగింది.
2020-01-02