దేశం ఆర్థిక మాంద్యాన్ని చవి చూస్తున్నా బాలీవుడ్ సినిమాలపై ఆ ప్రభావం పడలేదు. 2019లో ఆదాయం ఏకంగా 30 శాతం పెరిగి తొలిసారి రూ. 4000 కోట్ల మార్కు దాటింది. హిందీ సినిమాల కలెక్షన్లు 2017లో రూ. 3000 కోట్లు దాటగా 2018లో రూ. 3,300 కోట్లు వచ్చాయి. 2019లో ఏకంగా రూ. 4,350 కోట్లు వసూలయ్యాయి. 2019లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ‘వార్’ (292.71 కోట్లు) ముందుంది. తర్వాత కబీర్ సింగ్ (276.34 కోట్లు), సర్జికల్ స్ట్రైక్స్ (244 కోట్లు) ఉన్నాయి.
2019-12-28పౌరసత్వ సవరణ బిల్లు (సిఎబి)లో మతాల పేర్లు ప్రస్తావించవద్దని నిపుణులు చెప్పినా కేంద్ర ప్రభుత్వం వినిపించుకోలేదట. బిల్లులో ‘హిందు, సిక్కు, పార్సి’ అంటూ మతాల పేర్లు వద్దని, ‘పీడిత మైనారిటీలు’ అని పేర్కొనాలని 7, 8, 9 లోక్ సభలకు సెక్రటరీ జనరల్ గా పని చేసిన రాజ్యాంగ నిపుణుడు సుభాష్ కశ్యప్ 2016లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)కి సూచించారట. ఇప్పుడు కోర్టు ద్వారాగానీ, పార్లమెంటు చట్ట సవరణ ద్వారా గానీ చట్టాన్ని ‘సరి’ చేయవచ్చని ఆయన చెబుతున్నారు.
2019-12-28గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో జరిగిన భూ లావాదేవీలపై లోకాయుక్త విచారణకు రాష్ట్ర మంత్రివర్గం మొగ్గు చూపినట్టు సమాచారం. శుక్రవారం సచివాలయంలో సిఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. గత ప్రభుత్వ పెద్దలపై సీబీఐ లేదా లోకాయుక్త లేదా సీఐడీతో విచారణ జరిపించాలని చర్చించారు. ఈ అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం...కేబినెట్ సమావేశానికి ముందే సిఎంకు నివేదిక సమర్పించింది.
2019-12-27రాజధాని భూముల విషయంలో తమపై ఆరోపణలు చేస్తున్న జగన్ ప్రభుత్వం ఏడు నెలలుగా ఏం తవ్విందని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’పై సీబీఐ విచారణ జరిపించాలని మంత్రివర్గ సమావేశంలో చర్చించిన నేపథ్యంలో... చంద్రబాబు స్పందించారు. ‘‘చట్టపరంగా నీవల్ల ఏమైతే అది చేసుకో. నువ్వు వేరేవాళ్ళ దయాదాక్షిణ్యాలపైన ఆధారపడ్డావ్. మేము నీ దయాదాక్షిణ్యాలపై లేము’’ అని సిఎంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
2019-12-27ప్రభుత్వ రంగ సంస్థ ఎల్.ఐ.సి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రూ. 2,610.74 కోట్లు డివిడెండ్ రూపంలో చెల్లించింది. ఎల్.ఐ.సి. ఛైర్మన్ ఎం.ఆర్. కుమార్ శుక్రవారం ఈ మొత్తాన్ని చెక్ రూపంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు అందించారు. ఆ సంవత్సరంలో ఎల్.ఐ.సి. రూ. 53,214 కోట్ల మిగులు విలువను సాధించింది. జీవిత బీమా మార్కెట్లో ఎల్.ఐ.సి. వాటా 76.28 శాతంగా ఉంది. తొలి ఏడాది ప్రీమియంలో ఈ వాటా 71 శాతం.
2019-12-27‘‘విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని’’ అన్న ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటన ఆయన కోరికై ఉంటుందని సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అయితే ఇంతరకు ఆ మాట చెప్పలేదని స్పష్టం చేశారు. ‘‘అది విజయసాయిరెడ్డిగారి కోరిక అయి ఉంటుంది. ఆయన వైసీపీకి విశాఖపట్నం జిల్లా ఇన్ఛార్జి. అందువల్ల కోరుకోవచ్చు’’ అని నాని పేర్కొన్నారు. జి.ఎన్. రావు కూడా రాజధానిపై ప్రకటన చేయలేదని గుర్తు చేశారు.
2019-12-27విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిన్ననే వెల్లడించగా... కేబినెట్ మాత్రం ఈ వ్యవహారాన్ని మరికొంత కాలం సాగదీసేలా నిర్ణయాలు తీసుకుంది. రాజధానికి సంబంధించి జి.ఎన్.రావు కమిటీ ఇచ్చిన నివేదికను, ఇంకా రావలసిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు (బి.సి.జి) రిపోర్టును అధ్యయనం చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
2019-12-27సూర్యగ్రహణం చుట్టూ అల్లుకున్న నమ్మకాలు, మూఢనమ్మకాలు అనేకం. అందులో ఒకటి గ్రహణం సమయంలో రోకలి నిలబడటం. ఈ మూఢ విశ్వాసాన్ని పటాపంచలు చేయడానికి గ్రహణం రోజునే ఎంచుకున్నారు ప్రజా సైన్స్ కార్యకర్త రమేష్. గురువారం సూర్యగ్రహణం వీడిన తర్వాత ఓ గృహిణి రోకలిని నిలబెట్టిన దృశ్యాన్ని రమేష్ సామాజిక మాథ్యమాల్లో షేర్ చేశారు. ఏ రోజైనా, ఎక్కడైనా గురుత్వాకర్షణ ఆధారంగానే రోకలైనా మరొకటైనా నిలబడుతుందని రమేష్ స్పష్టం చేశారు.
2019-12-26మిగ్ 27. 1985లో భారత వాయుసేన లోకి ప్రవేశించిన ఈ యుద్ధ విమానం అన్ని వైమానిక ఆపరేషన్లలోనూ కీలక పాత్ర పోషించింది. గగన తలం నుంచి భూమిపైన లక్ష్యాలపై దాడి చేయడానికి ప్రధానంగా ఈ విమానాలను వాయుసేన వినియోగించింది. 1999 కార్గిల్ యుద్ధంలోనూ ఈ విమానానిది కీలక పాత్ర. మూడు దశాబ్దాలకు పైగా సేవలు అందించిన ఈ శక్తివంతమైన విమానానికి శుక్రవారం (డిసెంబర్ 27) వాయుసేన వీడ్కోలు పలుకుతోంది.
2019-12-27కజకిస్తాన్ దేశంలోని అల్మాటీ నగరం సమీపంలో ఓ విమానం కూలిపోయింది. అందులో 95 మంది ప్రయాణీకులు, ఐదుగురు సిబ్బంది ఉండగా... ప్రాథమిక సమాచారం ప్రకారం 12 మంది మరణించారు. ఈ బెక్ విమానం కజకిస్తాన్ రాజధాని ‘నూర్ సుల్తాన్’కు వెళ్ళడానికి టేకాఫ్ అవుతున్న సమయంలోనే నిర్దేశిత గమనం నుంచి కిందకు దిగిపోయి ఓ కాంక్రీట్ ఫెన్స్ లోకి దూసుకుపోయిది. ప్రక్కనే ఉన్న రెండంతస్థుల భవనాన్ని ఢీకొట్టింది.
2019-12-27