అసెంబ్లీలో మాట్లాడటానికి ఎన్టీ రామారావుకు (గతంలో) అవకాశం ఇవ్వని పాపంలో తానూ భాగమని, అందుకే 15 సంవత్సరాలు అధికారానికి దూరమయ్యానని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. ఓ సభ్యుడు ఆ ఉదంతాన్ని గుర్తు చేసిన నేపథ్యంలో తమ్మినేని పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఎన్టీఆర్ కు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. నిజమే. ఆ పాపంలో నేనూ భాగమయ్యాను. పశ్చాత్తాపపడ్డాను. దానికి ప్రతిఫలమే.. భగవంతుడు నన్ను 15 సంవత్సరాలు అధికారానికి దూరం చేశాడు’’ అని స్పీకర్ చెప్పారు.
2019-12-10తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశి తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. తాను ముఖ్యమంత్రిని కలిస్తే సామాజిక మాథ్యమాల్లో వ్యక్తిగతంగా తనను ధూషించారని, ఇక ఆ పార్టీ నేతలతో తాను సహచర్యం చేయలేనని వంశీ మంగళవారం అసెంబ్లీలో నివేదించారు. ఈ విజ్ఞాపనకు ముందు వంశీ ‘‘నేను కూడా తెలుగుదేశం శాసనసభ్యుడినేగా... ఒక్క నిమిషం మాట్లాడతానంటే భరించలేక చంద్రబాబు బయటకు వెళ్ళారు’’ అని విమర్శించారు.
2019-12-10పొరుగు దేశాల్లో మతపరమైన వివక్షకు గురై ఇండియాకు వస్తున్న ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించే ప్రధానోద్దేశంతో ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. సోమవారం అర్ధరాత్రి వరకు చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ లో 311-80 తేడాతో బిల్లు ఆమోదం పొందింది. వివాదాస్పద పౌరసత్వ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టడంపైనే అభ్యంతరం వ్యక్తమైంది. తొలుత దానిపైనా ఓటింగ్ జరిగింది. బిల్లును ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 293 మంది, వ్యతిరేకంగా 82 మంది ఓటు చేశారు.
2019-12-102019లో అనేక దేశాల్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తినా... అమెరికా మీడియా మాత్రం హాంగ్ కాంగ్ నిరసనలపైనే ఫోకస్ పెట్టింది. అక్కడ ఆందోళన జరుగుతున్నది చైనాకు వ్యతిరేకంగా కాబట్టి అమెరికన్ మీడియా సంస్థలు వేల కొద్దీ వార్తలు, వందలకొద్దీ వ్యాసాలు ప్రచురించాయి. హాంగ్ కాంగ్ అల్లర్లపై న్యూయార్క్ టైమ్స్ 325 కథనాలు, సిఎన్ఎన్ 412 కథనాలు ఇచ్చినట్టు ఫెయిర్ (Fair.org) సంస్థ పరిశీలనలో తేలింది. చిలీ ఆందోళనలపై న్యూయార్క్ టైమ్స్ 14 కథనాలు, సిఎన్ఎన్ 22 కథనాలు మాత్రమే ఇచ్చిందని ఆ సంస్థ పేర్కొంది.
2019-12-08 Read More2019-20 ఆర్థిక సంవత్సరం వస్తు సేవల పన్ను వసూళ్ల లక్ష్యానికి భారీగా గండి పడిండి. ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో నికరంగా రూ. 5,26,000 కోట్లు వస్తాయని బడ్జెట్ సమయంలో అంచనా వేయగా, వాస్తవంలో రూ. 3,28,365 కోట్లు మాత్రమే వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సోమవారం లోక్ సభలో వెల్లడించారు. అంటే, లక్ష్యంలో 62.43 శాతం మాత్రమే వసూలయ్యాయి. 2018-19 ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ. 6,03,900 కోట్లు వస్తాయన్నది బడ్జెట్ అంచనా కాగా, వాస్తవంలో రూ. 4,57,534 కోట్లు (75.76%) వచ్చాయి.
2019-12-09గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రతినిధులపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ), ఫారెన్ ఎక్సేంజ్ మేనేజ్ మెంట్ చట్టం (ఫెమా) కింద ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 82 కేసులు నమోదు చేసింది. సీబీఐ 18 మంది ప్రజాప్రతినిధులు, మాజీలపై 14 కేసులు నమోదు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొంది. సీబీఐ కేసుల్లో ఇద్దరు సిటింగ్ ఎంపీలు, 9 మంది మాజీ ఎంపీలు, ఐదుగురు ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.
2019-12-09పెద్ద నోట్ల రద్దు తర్వాత నకిలీ కరెన్సీ నిలిచిపోతుందని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎంత చెప్పినా.. ఆచరణలో అందుకు భిన్నంగా జరుగుతోంది. కొత్త రూ. 2000, రూ. 500 నోట్లకు పెద్ద మొత్తంలో నకిలీలు మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. 2017-18లో రూ. 500 నోట్లు 9,892, రూ. 2000 నోట్లు 17,929... 2018-19లో రూ. 500 నోట్లు 21,865, రూ. 2000 నోట్లు 21,847 పట్టుబడ్డాయి. 2019-20లో ఇప్పటిదాకా రూ. 500 నోట్లు 13,959... రూ. 2000 నోట్లు 7,435 పట్టుకున్నారు. పట్టుబడిన నకిలీ కరెన్సీ ఎంత ఉందో?!
2019-12-09పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళపై పలుమార్లు వ్యాఖ్యలు చేసిన ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం అసెంబ్లీ సాక్షిగా పరోక్షంగా సెటైర్ వేశారు. ‘‘నాకు ఒకటే భార్య అధ్యక్షా’’ అని ఆయన నొక్కి చెప్పడంతో ఎమ్మెల్యేలంతా గొల్లున నవ్వారు. రేపిస్టులపై విచారణ మూడు వారాల్లోనే పూర్తి చేసి ఉరిశిక్ష విధించేలా చట్టాన్ని తెస్తున్నట్టు చెప్పిన సిఎం, ‘‘నాకూ ఇద్దరు కుమార్తెలున్నారు. ఒక చెల్లి ఉంది. ఒక భార్య ఉంది. నాకు ఒకటే భార్య అధ్యక్షా’’ అంటూ సీరియస్ అంశంలోనూ ఓ చెణుకు విసిరారు.
2019-12-09మాజీ ఎం.పి, బీజేపీ సీనియర్ నేత గోకరాజు గంగరాజు కుమారుడు రంగరాజు, వారి కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నర్సాపురం ఎం.పి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు రఘురామరాజు కేంద్రంలో బీజేపీ నేతలతో సన్నిహితంగా మెలగడం పట్ల సిఎం జగన్ ఆగ్రహంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. తమ సొంత పార్టీ ఎం.పి.కి, ఆయనను దువ్వుతున్న బీజేపీకి డబుల్ బ్లో ఇవ్వడానికి జగన్ వ్యూహాత్మకంగా గోకరాజు కుటుంబాన్ని వైసీపీలోకి లాగుతున్నట్టు సమాచారం.
2019-12-09మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినవారికి 21 రోజుల్లోనే ఉరిశిక్ష పడేలా కొత్త చట్టం తెస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి భావాద్వేగభరిత ప్రసంగం చేశారు. హైదరాబాద్ గ్యాంగ్ రేప్ ఉదంతాన్ని ప్రస్తావించిన జగన్, ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా తాను ఆ బాధితురాలి బాధను అర్ధం చేసుకోగలనని పేర్కొన్నారు. మహిళలపై అఘాయిత్యాల కేసుల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తామని సిఎం ప్రకటించారు.
2019-12-09