ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లాలో మంగళవారం మావోయిస్టులు జరిపిన దాడిలో బీజేపీ ఎంఎల్ఎ భీమా మందవి, నలుగురు సెక్యూరిటీ సిబ్బంది మరణించారు. ఎంఎల్ఎ బాచేలి ప్రాంతంనుంచి కువకొండ వైపు వెళ్తుండగా శ్యామగిరి హిల్స్ వద్ద నక్సలైట్లు ఐఇడి పేల్చి కాల్పులు జరిపారు. దంతెవాడ ప్రాంతం బస్తర్ లోక్ సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ తొలి దశలో భాగంగా ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. మంగళవారమే తొలి దశ ప్రచారం ముగిసింది.
2019-04-09 Read More‘‘సంకల్ప పత్రం’’ పేరిట బీజేపీ మేనిఫెస్టోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం విడుదల చేశారు. సుదీర్ఘ కాలంగా బీజేపీ హామీలుగా ఉన్న ‘‘అయోధ్యలో రామమందిరం’’, దేశమంతటా ‘‘యూనిఫాం సివిల్ కోడ్’’, కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించే ‘‘ఆర్టికల్ 370 రద్దు’’లతో పాటు ‘‘సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ బిల్లు’’, మరికొన్ని భావోద్వేగ అంశాలు మేనిఫెస్టోలో చేరాయి. జాతీయవాదం, అంత్యోదయ, సుపరిపాలన ప్రధానాంశాలుగా రూపొందించిన తమ మేనిఫెస్టో, ‘‘ప్రజల ఆకాంక్ష’’లకు అద్దం పడుతోందని మోదీ ఈ సందర్భంగా చెప్పారు.
2019-04-08 Read Moreఏప్రిల్ 16, 20 మధ్య మరోసారి దాడి చేయడానికి ఇండియా సిద్ధమవుతోందంటూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఖురేషి చేసిన ప్రకటనను కేంద్ర విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. పాకిస్తాన్ మంత్రి ప్రకటన ‘‘బాధ్యతారాహిత్యం, అర్ధరహితం’’ అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావీష్ కుమార్ ఓ ప్రకటనతో ఘాటుగా స్పందించారు. ఇండియా దాడికి సిద్ధమైనట్టు తమకు ‘‘విశ్వసనీయమైన ఇంటెలిజెన్స్ సమాచారం’’ ఉందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖురేషి మాట్లాడిన కొద్ది గంటలకే ఇండియా స్పందించింది.
2019-04-08 Read Moreతమ భూభాగంపై మరోసారి దాడి చేయడానికి ఇండియా సిద్ధమైనట్టు తమకు ‘‘విశ్వసనీయమైన సమాచారం’’ ఉందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషి ఆదివారం చెప్పారు. ఏప్రిల్ 16, 20 తేదీల మధ్య దాడి జరగవచ్చని పేర్కొన్నారు. ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు మరణించిన నేపథ్యంలో.. 26వ తేదీన పాకిస్తాన్ లోని బాలాకోట్ జెఇఎం స్థావరంపై భారత వైమానిక దళం దాడి చేసింది. మరో దాడికి సంబంధించి తమ ఆందోళనను ఐక్యరాజ్యసమితి శాశ్వత సభ్యులైన ఐదు దేశాలతో పంచుకున్నట్టు పాకిస్తాన్ తెలిపింది.
2019-04-07 Read Moreలోక్ సభ ఎన్నికలకు ముందు ఆదాయ పన్ను శాఖ ‘విశ్వరూపం’ చూపుతోంది. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమలనాథ్ సంబంధీకుల ఆస్తులపై ఏకంగా 50 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. ఢిల్లీలోని గ్రీన్ పార్క్, మధ్యప్రదేశ్ లోని ఇండోర్, భోపాల్ తదితర ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారు జామునే సోదాలు ప్రారంభమయ్యాయి. కమలనాథ్ మాజీ ఒ.ఎస్.డి. ప్రవీణ్ కక్కడ్, మాజీ సలహాదారు రాజేంద్ర మిగ్లాని, ఆయన భావమరిది కంపెనీ మోసర్ బేయర్ అధికారులు, మేనల్లుడు రతుల్ పూరి ఐటీ సోదాల జాబితాలో ఉన్నారు. వీరిలో కక్కడ్, మిగ్లాని కొద్ది రోజుల క్రితమే తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు.
2019-04-07 Read Moreవైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి ఆడియో టేప్ ఒకటి శనివారం బయటకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిబద్ధత లేదని, వారు తెలంగాణ ప్రజల్లా కాదని విజయసాయి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం రేపాయి. ఎన్నికలకు ముందు తమ పార్టీ నేతలకు విజయసాయి జాగ్రత్తలు చెప్పడం, హెచ్చరికలు చేయడం ఆ టేపులో రికార్డయింది. ఆ క్రమంలోనే..‘‘మళ్ళీ ఆంధ్రావాళ్ల పెత్తనం వస్తుందంటే తెలంగాణ జనం అంతా ఏకమయ్యారు. ఆంధ్రా జనానికి అంత నిబద్ధత లేదు. అక్కడ కులాల సంఘర్షణను చంద్రబాబు ఉపయోగించుకుంటారు’’ అని విజయసాయి వ్యాఖ్యానించారు.
2019-04-06‘‘ప్రజాస్వామ్య విలువలు తెలియని ఒక వ్యక్తి చేతిలో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని నేను ఎప్పటినుంచో చెబుతున్నాను. అదే విషయాన్ని అద్వానీగారు సున్నితంగా చెప్పారు’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘‘మొదట దేశం.. తర్వాత పార్టీ.. చివరిగానే వ్యక్తిగతం’’ అని, వాక్ స్వాతంత్రానికి.. భిన్నత్వానికి కట్టుబడి ఉండాలని అద్వానీ అన్న మాటలు నరేంద్ర మోదీని ఉద్ధేశించేనని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మన రాష్ట్రానికి ద్రోహం చేయడమే కాకుండా తన స్వార్ధంకోసం మోదీ దేశాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు.
2019-04-05నరేంద్ర మోదీ పోయేకాలం వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలపై ఆదాయపన్ను శాఖ అధికారులు వరుసగా చేస్తున్న దాడులను శుక్రవారంనాటి ఎన్నికల సభల్లో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. మొన్న పుట్టా సుధాకర్ యాదవ్, ఇవ్వాళ గుంటూరులో నానిలపై ఐటీ దాడులు చేయడం కక్ష సాధింపులో భాగమని చంద్రబాబు ఆరోపించారు. ‘‘మోదీ.. నీ ఉద్యోగం శాశ్వతం కాదు. ప్రజలు నిన్ను చీకొట్టే రోజు వస్తుంది. అసహ్యించుకునే రోజు వస్తుంది’’ అని సిఎం మండిపడ్డారు.
2019-04-05గుజ్జార్లు, మరో నాలుగు సామాజికవర్గాలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయంపై స్టే కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలోని బెంచ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. గుజ్జార్లకు ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించే బిల్లును రాజస్థాన్ ప్రభుత్వం ఫిబ్రవరిలో అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
2019-04-05 Read Moreబీహార్ రాష్ట్రంలో... డాన్లు వ్యూహం మార్చారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధానికి గురైనవారో, తమకు సీటు ఇవ్వడానికి పార్టీలు నిరాకరించిన సందర్భంలోనో ఈ ‘బాహుబలులు’ తమ భార్యలకు సీట్లు సంపాదించారు. ఈ విధంగా... మహాకూటమి లోక్ సభ అభ్యర్ధుల జాబితాలో ముగ్గురు మాజీ డాన్ల భార్యల పేర్లు చేరాయి. కాంగ్రెస్ అభ్యర్థుల్లో... నీలమ్ దేవి భర్త మాజీ ఎంఎల్ఎ అనంత్ సింగ్, రంజీత్ రంజన్ భర్త పప్పు యాదవ్, ఆర్.జె.డి. అభ్యర్ధి హేనా సాహబ్ భర్త మహ్మద్ షాబుద్ధీన్ పాపులర్ డాన్లు. ఈ అభ్యర్ధుల్లో రంజీత్ రంజన్ సిటింగ్ ఎంపీ. సో.. డాన్లు జైలుకెళ్లినా భార్యల రూపంలో పార్లమెంటులో ఉన్నట్టే!!
2019-04-05 Read More