డస్కవరీ ఛానల్ క్రేజీ కార్యక్రమం ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’. ఇంతకు ముందు ప్రధాని నరేంద్ర మోడీతో ఓ ఎపిసోడ్ చేసిన కార్యక్రమ నిర్వాహకుడు బేర్ గ్రిల్స్, ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలసి కర్నాటక బందిపూర్ అడవిలో మరో ఎపిసోడ్ చిత్రీకరించారు. అక్కడ రజినీకాంత్ ఏం చేశారో ఈ నెల 23వ తేదీ రాత్రి 8 గంటలకు ‘డిస్కవరీ’లో చూడాల్సిందే. సోమవారం విడుదలైన ఆ కార్యక్రమ ట్రైలర్ రజినీ థ్రిల్లర్ మూవీ టైటిల్స్ ను తలపించింది.
2020-03-09‘‘అమృతా అమ్మవద్దకు రా’’.. ఆదివారం హైదరాబాద్ వైశ్య భవనంలో ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు కుమార్తెను ఉద్ధేశించి రాసిన వాక్యం ఇది. అయితే... తాను అక్కడికి వెళ్ళబోయేది లేదని, తన వద్దకు తల్లి వస్తే బాధ్యత తీసుకుంటానని అమృతవర్షిణి సోమవారం స్పష్టం చేశారు. ఆస్తి వివాదాల్లో.. శ్రవణ్ (అమృత బాబాయి) వల్ల తన తల్లికి హాని జరగవచ్చనే అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు. తన భర్త (ప్రణయ్)ని హత్య చేయించినందుకు మారుతీరావు, శ్రవణ్ లకు చట్టపరంగా శిక్ష పడాలనుకున్నానని, ఆత్మహత్య చేసుకోవడం మాత్రం బాధాకరమని అమృత చెప్పారు.
2020-03-09ముడి చమురు ధరల ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో రోజువారీ మార్పులు చేసే విధానం ఆచరణలో ప్రహసనంగా మారింది. సోమవారం ముడి చమురు ధరలు దాదాపు 30 శాతం తగ్గితే ఇండియాలో పెట్రోలు ధర 24 పైసలు, డీజిల్ ధర 25 పైసలు తగ్గింది. జనవరిలో బ్యారెల్ ముడి చమురు ధర 61 డాలర్లు ఉండగా మార్చి 9 నాటికి 30 డాలర్లకు తగ్గింది. అదే సమయంలో ఇండియాలో పెట్రోల్ ధర కేవలం రూ. 4.55 మేరకు తగ్గింది. ముడి చమురు ధరలు భారీగా పతనమైనా ఆ ప్రయోజనం వినియోగదారులకు చేరడంలేదు.
2020-03-09స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సిఎఫ్ఒ) అండ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టరుగా చలసాని వెంకట్ నాగేశ్వర్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆయన అంతర్జాతీయ బ్యాకింగ్ గ్రూపు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టరుగా పని చేస్తున్నారు. చలసానికి సిఎఫ్ఒ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టరుగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ.. తక్షణమే ఈ ఉత్తర్వు అమల్లోకి వస్తుందని ఎస్.బి.ఐ. సోమవారం బిఎస్ఇకి నివేదించింది.
2020-03-09 Read Moreభారత స్టాక్ మార్కెట్లు సోమవారం పాతాళం వైపు పరుగులు తీశాయి. బిఎస్ఇ సెన్సెక్స్ సోమవారం మధ్యాహ్నం 1.11 గంటల సమయానికి 2331 పాయింట్లు (సుమారు 6.2 శాతం) దిగజారింది. గత 15 నెలల్లో ఇదే కనిష్ఠ స్థాయి. కరోనా వైరస్, ఎస్ బ్యాంకు సంక్షోభం, క్రూడాయిల్ ధరల తగ్గుదల వంటి పరిణామాలతో మార్కెట్ పతనావస్థకు చేరుకుంది. క్రితం రోజు ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 37,573.62 పాయింట్ల వద్ద ఉంది. సోమవారం ఉదయం నుంచే మార్కెట్ అల్లకల్లోలంగా మారింది.
2020-03-09ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఒ.ఎన్.జి.సి) షేర్ల విలువ 15 సంవత్సరాల కనిష్ఠానికి పడిపోయింది. సోమవారం 12 శాతం దిగజారి రూ. 78.05కి చేరింది. ఫలితంగా ఒ.ఎన్.జి.సి. మార్కెట్ విలువ లక్ష కోట్ల రూపాయల దిగువకు పడిపోయింది. 2004 ఆగస్టు తర్వాత ఈ ప్రభుత్వ రంగ దిగ్గజం విలువ లక్ష కోట్ల కంటే తగ్గడం ఇదే తొలిసారి. సోమవారం ఉదయం 10.01కి కంపెనీ మార్కెట్ కేపిటలైజేషన్ రూ. 98,818 కోట్లుగా ఉన్నట్టు బిఎస్ఇ డేటా చూపిస్తోంది. ముడి చమురు ధర పడిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు కోల్ ఇండియా, ఎన్.టి.పి.సి.ల కంటే ఒ.ఎన్.జి.సి.విలువ తక్కువ.
2020-03-09 Read Moreఅంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర సుమారు 30 శాతం తగ్గింది. సోమవారం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ 31 డాలర్ల చొప్పున పడిపోయింది. చమురు ఉత్పత్తిని తగ్గించే విషయంలో ప్రధాన ఉత్పత్తిదారులు ఏకాభిప్రాయానికి రాలేకపోవడం ధరల పతనానికి దారి తీసింది. ఏప్రిల్ సరఫరాపై సౌదీ అరేబియా అసియా దేశాలకు బ్యారెల్ కు 4 నుంచి 6 డాలర్లు, అమెరికాకు 7 డాలర్ల చొప్పున ధరలను తగ్గించింది. ప్రధాన చమురు ఉత్పత్తి దేశాల మధ్య ధరల యుద్ధానికి ఇది ప్రారంభంగా భావిస్తున్నారు.
2020-03-09 Read Moreబిఎస్ఇ సెన్సెక్స్ సోమవారం 1,634 పాయింట్లు (4.35%) పతనమైంది. ‘కరోనా వైరస్’, ఎస్ బ్యాంకు ప్రభావంతో 35,942 పాయింట్లకు దిగజారింది. నిఫ్టీ 50 కూడా 444 పాయింట్లు (4.05%) తగ్గి 10,550కు చేరింది. బిఎస్ఇ 500లోని 125 స్టాక్స్52 వారాల కనిష్ఠానికి పడిపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు విలువ 9.14 శాతం దిగజారింది. 11 సంవత్సరాలలో ఇదే అతి పెద్ద పతనం. ప్రభుత్వ రంగ సంస్థ ఒ.ఎన్.జి.సి. అత్యధికంగా (11%) నష్టపోయింది. బిఎస్ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ. 5 లక్షల కోట్లు తగ్గిపోయింది.
2020-03-09 Read More2020-21 ఆర్థిక సంవత్సరం చివరికి తెలంగాణ ప్రభుత్వ అప్పు రూ. 2,29,205 కోట్లకు పెరుగుతుందని తాజా బడ్జెట్ అంచనా. 2017-18లో రూ. 1,52,190 కోట్లుగా ఉన్న అప్పులు ఈ నెలాఖరుకు 1,99,215 కోట్లకు పెరుగుతున్నాయి. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో అప్పులు 2017-18లో 20.21%గా ఉంటే 2020-21కి 20.74%కి పెరగనున్నాయి. ఇంతవరకు చూస్తే బాగున్నట్టే అనిపిస్తుంది. ప్రభుత్వ అప్పులకు.. వివిధ శాఖల పరిధిలోని కార్పొరేషన్లు, సంస్థల రుణాలకు ఇచ్చిన గ్యారంటీలు కలిపితే మొత్తం బాధ్యతలు రూ. 3 లక్షల కోట్లు దాటుతున్నాయి.
2020-03-08తెలంగాణ బడ్జెట్లో సొంత (పన్నులు+పన్నేతర) ఆదాయాన్ని రూ. 83,602 కోట్ల నుంచి రూ. 1,15,900 కోట్లకు పెంచి చూపించారు. ఒక్క ఏడాదిలో 38.63 శాతం పెరగడం సాధ్యమా? 2020-21 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పెరుగుదల రిజిస్ట్రేషన్లు (55.13%), ఎక్సైజ్ (26.98%) ఆదాయంలో చూపించారు. సొంత పన్నుల ఆదాయంలో ఎక్సైజ్ (రూ. 16 వేల కోట్లు) ద్వారానే 18.75% సమకూరుతుందని అంచనా. 2018-19లో ఎక్సైజ్ వాటా 16,45% ఉండగా, 2019-20 సవరించిన అంచనాల్లో 17.66%కి పెరుగుతోంది. రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 10 వేల కోట్లు (11.76%) వస్తుందని అంచనా.
2020-03-08