కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రానికి డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖరరావు ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం హుజూర్ నగర్ ‘‘ప్రజా ఆశీర్వాద’’ సభలో ప్రసంగించారు. ఆ డజను మందిలో ప్రతి ఒక్కరూ ‘‘నన్ను గెలిపించండి. నేను ముఖ్యమంత్రి అవుతా’’ అంటారని, అయితే కాంగ్రెస్ పార్టీనే గెలిచే పరిస్థితి లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం తీయనని శపథం చేశారంటూ, ‘‘ఆయన తీస్తే ఎంత తీయకపోతే ఎంత’’ అని ఎద్దేవా చేశారు.
2023-10-31దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య యుద్ధం జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ యుద్ధంలో ఓవైపు కె.సి.ఆర్. కుటుంబం మాత్రమే ఉందని కొల్లాపూర్ సభలో రాహుల్ అన్నారు. ‘‘ప్రజల తెలంగాణ అంటే... మహాలక్ష్మి పథకం కింద ప్రతి వివాహిత మహిళకు నెలకు 2,500; రూ. 500కే గ్యాస్ సిలిండర్; మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం; ఇందిరమ్మ ఇళ్ళు; పేదలకు ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్; యువ వికాసం.’’ అని రాహుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అన్ని రాష్ట్రాల్లోనూ ఇచ్చిన హామీలన్నిటినీ మొదటి కేబినెట్ సమావేశంలోనే నెరవేర్చామని చెప్పారు.
2023-10-31కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయలను బిజెపి, బిఆర్ఎస్ నేతలు కలసి లూటీ చేశారని కాంగ్రెెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మంగళవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలో జరిగిన అతిపెద్ద మోసం అని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు నిర్మించిన కొద్ది కాలానికే బ్యారేజీ కుంగిపోయిందని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వెచ్చించిన ప్రతి రూపాయినీ ప్రజల నుంచి పన్నుల రూపంలో దోపిడీ చేశారని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబంపై రూ. 31 వేల చొప్పున భారం మోపారని రాహుల్ దుయ్యబట్టారు.
2023-10-31తాను జైలులో ఉన్న సమయంలో ప్రత్యక్షంగా వచ్చి కలసి సంఘీభావం తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన క్లుప్తంగా మాట్లాడారు. తనకోసం రోడ్లపైకి వచ్చినవారికి, సంఘీభావ సభలు నిర్వహించిన వారందరికీ చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. బి.జె.పి, సి.పి.ఐ, బి.ఆర్.ఎస్ పార్టీలు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా తనకు సంఘీభావం తెలిపారంటూ, వారికి కూడా కృతజ్ఞతలు తెలిపారు.
2023-10-3145 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో తాను ఏ తప్పూ చేయలేదని, ఇక ముందూ చేయబోనని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. మంగళవారం సాయంత్రం బెయిలుపై విడుదలైన అనంతరం రాజమండ్రి జైలు వద్ద తనకు స్వాగతం పలికిన నేతలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. తాను చేపట్టిన విధానాలతో లబ్దిపొందిన అందరూ రోడ్లపైకి వచ్చి సంఘీభావం తెలిపారని, అభివృద్ధిని ప్రదర్శించారని సంతోషం వ్యక్తం చేశారు. ‘‘నేను ఏ తప్పూ చేయలేదు. నేను చేయను, చేయనివ్వను’’’ అని ఆయన పేర్కొన్నారు.
2023-10-3152 రోజులపాటు రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండు ఖైదీగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం సాయంత్రం విడుదలయ్యారు. హైకోర్టు జారీ చేసిన మధ్యంతర బెయిలుకు అనుగుణంగా విడుదల లాంఛనాలు పూర్తయ్యాయి. చంద్రబాబును జైలు గేటు వద్ద వేచి చూస్తున్న ఆయన మనవడు దేవాన్ష్ కావలించుకుని స్వాగతం పలికారు. చంద్రబాబు కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, వియ్యంకుడు బాలకృష్ణ, పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, కంభంపాటి రామ్మోహన్ రావు, టి.డి. జనార్థన్ తదితరులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు జైలు వద్దకు వచ్చారు.
2023-10-31ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నవంబర్ 2న అరెస్టు చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ సందేహం వ్యక్తం చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఇప్పటికే మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా రిమాండులో ఉండగా, దానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణ కోసం కేజ్రీవాల్‌కు ఇ.డి. సమన్లు జారీ చేసింది. నవంబర్ 2న ఆయన హాజరైనప్పుడు అరెస్టు చేస్తారని, తమ పార్టీలోని పెద్ద నాయకులు అందరినీ జైలులో పెట్టి "ఆప్"ను అంతమొందించాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని ఢిల్లీ మంత్రి ఆతిషి ఆరోపించారు.
2023-10-31మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై ఆంధ్రప్రదేశ్ సి.ఐ.డి. మరో కేసు నమోదు చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా మద్యం కంపెనీలకు అనుమతులు ఇవ్వడంలో అక్రమాలు జరిగాయన్నది తాజా ఆరోపణ. ఈ కేసులో చంద్రబాబును మూడో నిందితుడిగా పేర్కొంటూ నమోదైన ఎఫ్.ఐ.ఆర్.ను సి.ఐ.డి. అధికారులు సోమవారం విజయవాడలోని ఎ.సి.బి. కోర్టుకు సమర్పించారు. అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ఐ.ఎస్. శ్రీ నరేష్, అప్పటి మంత్రి కొల్లు రవీంద్ర తొలి ఇద్దరు నిందితులు. బెవరేజెస్ కార్పొరేషన్ ప్రస్తుత ఎం.డి. వాసుదేవరెడ్డి ఫిర్యాదుదారు.
2023-10-30‘స్కిల్ డెవలప్మెంట్’ కేసులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్, సి.ఐ.డి. ప్రతివాదనలు విన్న తర్వాత జస్టిస్ టి. మల్లిఖార్జునరావు ఆరోగ్య కారణాలపై బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువరించారు. లక్ష రూపాయల బెయిల్ బాండ్ సమర్పించాలని, నిందితుడు తనకు నచ్చిన ఆసుపత్రిలో సొంత ఖర్చుతో చికిత్స చేయించుకోవచ్చని, నవంబర్ 28న రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో లొంగిపోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
2023-10-31ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని, అందువల్లనే ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు 50 రోజులుగా రిమాండులో ఉన్నారని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. శనివారం రాజమండ్రి కేంద్ర కారాగారంలో తండ్రిని పరామర్శించిన అనంతరం లోకేశ్ విలేకరులతో మాట్లాడారు. వ్యవస్థలను మేనేజ్ చేయకపోతే... అవినీతి కేసుల్లో నిందితుడైన జగన్ పదేళ్ళుగా బెయిలుపై ఉండటం, సొంత బాబాయిని నరికి చంపిన అవినాశ్ రెడ్డి స్వేచ్ఛగా తిరగడం సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని లోకేశ్ వ్యక్తం చేశారు.
2023-10-28