శనివారం మరణించిన ఒమన్ దేశపు సుల్తాన్ కబూస్ బిన్ సెయిద్ అల్ సెయిద్ ఒకప్పుడు ఇండియాలో చదువుకున్నారు. మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ వద్ద విద్యను అభ్యసించారు. శర్మ రాష్ట్రపతి కాక ముందు సంగతి అది. కబూస్ తండ్రి కూడా ఇండియాలో...అజ్మీర్ లోని మేయో కళాశాలలో చదివారు. ఆయన తన కుమారుడిని చదువుకోసం పూణె పంపారు. ప్రాథమిక విద్యా దశలో సుల్తాన్ కబూస్ పూణెలోని ఓ ప్రైవేటు విద్యాలయంలో చదివారు.
2020-01-11పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కి వ్యతిరేకంగా శుక్రవారం హైదరాబాద్ నగరంలో ‘తిరంగా ర్యాలీ’ జరిగింది. యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ తలపెట్టిన ఈ కార్యక్రమానికి ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వం వహించారు. జాతీయ జెండాలు చేతబూనిన వేలాది మంది ‘‘సిఎఎ చెల్లదు’’, ‘‘హిందూస్థాన్ జిందాబాద్’’ అంటూ నినాదాలు చేశారు. మీర్ ఆలం దర్గా నుంచి శాస్త్రిపురం వరకు ర్యాలీ సాగింది. ర్యాలీకి మద్ధతుగా ఆ ప్రాంతమంతా షాపులు మూసివేశారు.
2020-01-10ఒమన్ దేశపు సుల్తాన్ కబూస్ బిన్ సెయిద్ అల్ సెయిద్ (79) శనివారం మరణించారు. నాలుగు దశాబ్దాలపాటు పాలించిన కబూస్, చమురు సిరులతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. సుల్తాన్ తన వారసుడెవరో ప్రకటించలేదు. దీంతో ఇప్పుడు ఒమన్ రాజధాని ‘మస్కట్’లో ఉత్కంఠ నెలకొంది. మిలిటరీ రంగంలోకి దిగింది. రాజ కుటుంబం సమావేశమై తదుపరి పాలకుడిని నిర్ణయించాలని ఒమన్ మిలిటరీ కోరినట్టు వార్తలు వచ్చాయి.
2020-01-11శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్ ను 2-0 తేడాతో ఇండియా సునాయాసంగా కైవశం చేసుకుంది. శుక్రవారం జరిగిన చివరి పోటీలో ఏకంగా 78 పరుగుల తేడాతో ఇండియా నెగ్గింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, మిగిలిన రెండు మ్యాచ్ లలోనూ ఇండియా గెలిచింది. శుక్రవారం తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 6 వికెట్లనష్టానికి 201 పరుగులు సాధించింది. తర్వాత శ్రీలంక జట్టు 15.5 ఓవర్లు మాత్రమే ఆడి 123 పరుగులకు కుప్పకూలింది.
2020-01-10జె.ఎన్.యు.ఎస్.యు. అధ్యక్షురాలు ఐషే ఘోష్ ఫొటోల్లో ఒకచోట ఎడమచేతికి, మరోచోట కుడి చేతికి కట్టు ఉందేమిటి? ఆ ‘కట్టు కథ’ ఇది. ఈ నెల 5న జరిగిన దాడిలో ఐషే ఎడమ చేతికి దెబ్బ తగిలింది. ఆ చేతికి కట్టు ఉన్న ఫొటోను, దాని మిర్రర్ ఇమేజ్ ను కలిపి షెఫాలి వైద్య అనే మేధావి ‘‘అద్భుతం. ఐషే విరిగిన చేయి ఒక్క రోజులో నయమైంది. మళ్లీ విరిగింది’’ అని ట్వీటారు. కొద్దిసేపటికే వేల సంఖ్యలో లైకులు, రీట్వీట్లు వచ్చాయి. ఈ ‘కట్టు కథ’పై కౌంటర్లు పడేసరికి ట్వీట్ తొలగించారు.
2020-01-11 Read Moreజె.ఎన్.యు.పై దాడి జరిగిన వెంటనే ఓ ముసుగు యువతి ఫొటో వైరల్ అయింది. ఆమె ఎబివిపి కార్యకర్త ‘‘కోమల్ శర్మ’’ అంటూ.. ముసుగు వేయక ముందు, వేశాక ఫొటోలను పెట్టి నెటిజన్లు దాదాపు నిర్ధారించారు. పాఠశాల నుంచి కోమల్ శర్మకు సీనియర్ అయిన అనూజ ఠాకూర్ ఆ ముసుగును పూర్తిగా తొలగించారు. ‘ఇన్స్టాగ్రామ్’ సంభాషణలో ‘ఈరోజు మునిర్కావద్ద నిన్ను చూశాను’, ‘ఎరుపు-తెలుపు గళ్ళ చొక్కా వేసుకున్నావు’ అని తనూజ చెబితే ‘అక్కా, ఎవరికీ చెప్పకు’ అని కోమల్ శర్మ బ్రతిమాలింది.
2020-01-11ఆదివారం రాత్రి జె.ఎన్.యు. విద్యార్ధులు, అధ్యాపకులపై జరిగిన దాడికి, ఫీజుల పెంపుపై జరిగిన ఆందోళనకు ముడిపెట్టారు ఢిల్లీ పోలీసులు. ‘వామపక్ష విద్యార్ధులు’ సెమిస్టర్ పరీక్షల రిజిస్ట్రేషన్ ను అడ్డుకున్నారని, 5వ తేదీ మధ్యాహ్నం ముసుగులు ధరించి పెరియార్ హాస్టల్ లో కొన్ని గదులపై దాడి చేశారని ఢిల్లీ డీజీపీ (క్రైమ్) చెప్పారు. అయితే, ఆ రోజు రాత్రి జరిగిన దాడి ‘ఏ పక్షంవారు’ చేశారో చెప్పలేదు. ‘‘వామపక్ష విద్యార్ధులు’’ ముసుగుల్లో ఉన్నా గుర్తించామన్న డీసీపీ, రాత్రి ముసుగుల సంగతి చెప్పలేదు.
2020-01-10ఈ నెల 5న జె.ఎన్.యు.లో విద్యార్ధులు, అధ్యాపకులపై దాడికి పాల్పడింది ఆర్.ఎస్.ఎస్. అనుబంధ ఎ.బి.వి.పి. యాక్టివిస్టులేనని ‘ఇండియా టుడే’ స్టింగ్ ఆపరేషన్ వెల్లడించింది. స్టింగ్ వీడియోలలో కనిపించిన ఇద్దరు (అక్షత్ అవస్థి, రోహిత్ షా) తాము ఎ.బి.వి.పి. యాక్టివిస్టులమని, వామపక్ష విద్యార్ధి సంఘాల సభ్యులు, అధ్యాపకులపై దాడి చేశామని చెప్పారు. ఈ దాడిలో 20 మంది యూనివర్శిటీ ఎ.బి.వి.పి. యాక్టివిస్టులు పాల్గొనగా, బయటి నుంచి మరో 20 మంది వచ్చారని వారు చెప్పారు.
2020-01-10 Read Moreఢిల్లీ పోలీసులు జె.ఎన్.యు. బాధితులపైనే గురి పెట్టారు. ఆదివారం రాత్రి క్యాంపస్‌లో జరిగిన హింసాకాండకు, దానికి దారితీసిన పరిస్థితులకు కారకులంటూ జెఎన్‌యుఎస్‌యు అధ్యక్షురాలు ఐషే ఘోష్‌తో సహా తొమ్మిది మంది విద్యార్థులపై ఆరోపణలు మోపారు. దాడి చేసింది ఎ.బి.వి.పి. సభ్యులనే ఆరోపణలున్నా... పోలీసులు ఆ సంస్థ పేరు ప్రస్తావించలేదు. తాము ‘గుర్తించిన’ 9 మంది ఫొటోలను (సీసీ టీవీ గ్రాబ్) విడుదల చేస్తూ... త్వరలో వారిని పిలిచి ప్రశ్నిస్తామని ప్రకటించారు.
2020-01-10 Read Moreపౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై కేంద్ర హోం శాఖ శుక్రవారం గజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో, పౌరసత్వ చట్టానికి చేసిన సవరణలు ఈ రోజునుంచే అమల్లోకి వచ్చాయి. మత ప్రాతిపదికన పౌరసత్వ చట్టానికి సవరణలు చేయడంపై దేశవ్యాప్తంగా నిరసన చెలరేగింది. భవిష్యత్తులో చేపట్టే జాతీయ పౌర రిజిస్ట్రీ (ఎన్.ఆర్.సి) ప్రక్రియతో దేశీయ మైనారిటీలకు ప్రమాదం పొంచి ఉందనే ఆందోళన ఉంది. అయినా, కేంద్రం తన ఎజెండా నుంచి వెనక్కు తగ్గలేదు.
2020-01-10