రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు ఉత్తర్వులను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు మరోసారి నిరాకరించింది. నిమ్మగడ్డకు వ్యతిరేకంగా స్వయంగా ఎన్నికల కమిషన్ కార్యదర్శి పిటిషన్ దాఖలు చేయడం విశేషం. అయితే, గతంలో రాష్ట్రప్రభుత్వం సవాలు చేసినప్పుడు స్టే ఇవ్వడానికి నిరాకరించినట్టే.. ఈ పిటిషన్ పైనా సుప్రీంకోర్టు స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ పైన విచారణకు నోటీసులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. తాజా పిటిషన్లను కూడా దాంతో కలిపి విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. బాబ్డే నాయకత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
2020-06-18గత సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రాజధాని వికేంద్రీకరణ’, ‘సీఆర్డీయే రద్దు’ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపినందుకు ఆగ్రహించిన అధికార వైసీపీ ఏకంగా శాసన మండలి రద్దుకోసం శాసనసభలో తీర్మానం చేసింది. ఇప్పుడు అదే శాసన మండలి ముందుకు మరోసారి అవే బిల్లులు రావడం విశేషం. మండలి రద్దుకు పార్లమెంటు ఆమోదం తెలపాల్సి ఉండగా.. రాజధాని బిల్లులపై సెలక్ట్ కమిటీ ఏర్పాటును వైసీపీ అడ్డుకుంది. ఈ అంశం కోర్టులో ఉండగానే ప్రభుత్వం మరోసారి రాజధాని బిల్లులను శాసనసభలో ఆమోదింపజేసింది. మండలిలో బలం ఉన్న ప్రతిపక్షం ఆయా బిల్లులను ప్రవేశపెట్టకుండానే అడ్డుకుంది. అయితే, మూడు నెలల వ్యవధితో రెండోసారి మండలికి బిల్లులు వచ
2020-06-18ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించకుండానే ఏపీ శాసన మండలి నిరవధికంగా వాయిదా పడింది. ఇదివరకు మండలి సెలక్ట్ కమిటీ పరిశీలనకు నివేదించిన ‘సీఆర్డీయే చట్టం రద్దు’, ‘రాజధాని వికేంద్రీకరణ’ బిల్లులను ప్రవేశపెట్టాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టుపట్టగా.. ముందు ద్రవ్య వినిమయ బిల్లును చేపడదామని ప్రతిపక్ష తెలుగుదేశం సభ్యులు పట్టుపట్టారు. మండలిలో ప్రతిపక్షానికి బలం ఉండటంతో అధికారపక్షం అనుకున్నది ఈసారీ సాగలేదు. చివరికి ఏ బిల్లూ ప్రవేశపెట్టలేకపోయారు. జూలై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏ ఆర్థిక కార్యకలాపాలు సాగాలన్నా ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొంది తీరాలి. అయితే, ఇది మనీ బిల్లు కాబట్టి మండలి ఆమో
2020-06-18చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై ప్రధాని నరేంద్ర మోడీ ఐదువారాల తర్వాత మౌనం వీడారు. సోమవారం రాత్రి చైనా సైన్యంతో ఘర్షణలో 23 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో.. ‘కరోనా’పై సిఎంలతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా బుధవారం ప్రధాని మాట్లాడారు. జవాన్ల త్యాగం వృధా కాదని జాతికి హామీ ఇచ్చారు. ‘‘దేశ ఐక్యత, సార్వభౌమత్యం మనకు చాలా ముఖ్యం. ఇండియా శాంతిని కోరుకుంటుంది. కానీ, రెచ్చగొడితే తగిన విధంగా సమాధానం చెప్పే సామర్ధ్యం ఉంది’’ అని మోడీ ఉద్ఘాటించారు. మరణించిన జవాన్లకు సంతాపం తెలుపుతూ పిఎం, సిఎంలు 2 నిమిషాలు మౌనం పాటించారు.
2020-06-17చైనా సరిహద్దుల్లో ఘర్షణ నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 19న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహించే వర్చువల్ సమావేశంలో రాజకీయ పార్టీల అధ్యక్షులు పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం బుధవారం వెల్లడించింది. లడఖ్ లోని గాల్వన్ లోయలో మొన్న రాత్రి జరిగిన ఘర్షణలో 23 మంది భారత జవాన్లు మరణించారు. మరికొంత మంది మృత్యువుతో పోరాడుతున్నారు. గత నెలలో గాల్వన్ లోయ, పాంగాంగ్ ట్సో ప్రాంతాల్లో చైనా సైన్యం కొన్ని కిలోమీటర్ల దూరం చొచ్చుకు వచ్చి టెంట్లు వేసుకున్న సంగతి తెలిసిందే.
2020-06-17చైనా సరిహద్దులోని గాల్వన్ లోయలో నిన్న రాత్రి జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు మరణించినట్టు ఆర్మీ మంగళవారం రాత్రి ప్రకటించింది. తొలుత ముగ్గురు మరణించినట్టు మంగళవారం ఉదయం ప్రకటించిన ఆర్మీ, రాత్రికి మరో ప్రకటన చేసింది. తీవ్రంగా గాయపడిన 17 మంది కూడా అతిశీతల వాతావరణం వల్ల మరణించారని పేర్కొంది. మరోవైపు మరణించిన, గాయపడిన చైనా సైనికుల సంఖ్య 43గా భారత అధికారులకు సమాచారం అందిందని వార్తలు వచ్చాయి. అయితే, చైనా సైన్యం మాత్రం మృతుల సంఖ్యను వెల్లడించలేదు. 1967 తర్వాత ఇరుదేశాల మధ్య ఈ స్థాయిలో ప్రాణ నష్టం జరగడం ఇదే తొలిసారి.
2020-06-16ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి ఆందోళనకరంగా మారింది. 2019-20లో రెవెన్యూ లోటు అసాధారణంగా రూ. 26,646 కోట్లకు పెరిగింది. రాష్ట్ర విభజన జరిగాక... చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టిన సంవత్సరం (2014-15) రెవెన్యూ లోటు రూ. 24,314 కోట్లు కాగా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తొలి ఏడాది అంతకు మించిపోయింది. గత ఏడాది రెవెన్యూ రశీదులు రూ. 1,10,871 కోట్లకు తగ్గిపోగా వ్యయం రూ. 1,37,518 కోట్లకు పెరిగింది. 2020-21లో రెవెన్యూ రశీదులు రూ. 1,61,958 కోట్లుగా, వ్యయం రూ. 1,80,392 కోట్లుగా తాజా బడ్జెట్లో అంచనా వేశారు. లోటు రూ. 18,434 కోట్లు ఉంటుందని అంచనా. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.
2020-06-16జగన్ ప్రభుత్వ తొలి బడ్జెట్ (2019-20) అంచనా ప్రకారం రెవెన్యూ రశీదుల మొత్తం రూ. 1,78,697 కోట్లు రావలసి ఉంది. సవరించిన అంచనాల ప్రకారం ఈ మొత్తం 1,10,871 కోట్లు మాత్రమే! రూ. 68 వేల కోట్లు కోత ఎక్కడ పడింది? సొంత పన్నుల ఆదాయం రూ. 75,438 కోట్లు వస్తుందని బడ్జెట్ రోజు అంచనా వేయగా సవరించిన అంచనా ప్రకారం ఆ మొత్తం రూ. 57,447 కోట్లు. ఇక్కడ 18 వేల కోట్లు, పన్నేతర ఆదాయంలో మరో రూ. 4 వేల కోట్లు కోత పడింది. కేంద్రం నుంచి రూ. 61,071 కోట్ల మేరకు గ్రాంట్లు వస్తాయని గత బడ్జెట్లో చూపారు. వచ్చింది రూ. 21,876 కోట్లు. కేంద్ర పన్నుల్లో వాటా రూ. 34,833 కోట్లు అనుకుంటే రూ. 28,224 కోట్లకు తగ్గింది.
2020-06-162020-21లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యయం రూ. 2,24,789 కోట్లు ఉంటుందని బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు. ఈమేరకు బడ్జెట్ ప్రతిని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మంగళవారం అసెంబ్లీకి సమర్పించారు. ఈ మొత్తం గత ఏడాది బడ్జెట్ ప్రతిపాదన (రూ. 2,27,975 కోట్ల) కంటే తక్కువగా ఉండటం గమనార్హం. గత ఏడాది (2019-20) జగన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి బడ్జెట్లో అంచనాలు అసాధారణంగా కనిపించాయి. అయితే, సవరించిన అంచనాల్లో ఆ మొత్తాన్ని రూ. 1,74,757 కోట్లకు తగ్గించారు. అంటే, బడ్జెట్ అంచనా కంటే రూ. 53,218 కోట్లు (23.34%) తక్కువ. మరి ఈ ఏడాదైనా బడ్జెట్ అంచనాలకు తగినట్టుగా వ్యయం ఉంటుందా?
2020-06-162020-21 ఏపీ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మంగళవారం ఉదయం గవర్నర్ ప్రసంగం తర్వాత.. మధ్యాహ్నం ఒంటిగంటకు సభ పున:ప్రారంభమైంది. ఈ ఏడాది కూడా సిఎం జగన్, ఆయన తండ్రి వైఎస్ఆర్ పేరిట ఉన్న పథకాలకు సింహభాగం కేటాయించారు బుగ్గన. ‘జగనన్న అమ్మఒడి’కి రూ. 6000 కోట్లు, ఆయన తండ్రి పేరిట ఉన్న ‘వైఎస్ఆర్ ఆసరా’కు రూ. 6300 కోట్లు కేటాయించారు. గ్రామ వాలంటీర్లకు రూ. 1104 కోట్లు, పాత పథకాల్లో వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు రూ. 16,000 కోట్లు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి రూ. 2,100 కోట్లు, వైఎస్ఆర్ రైతు భరోసాకు 3615 కోట్లు కేటాయించారు.
2020-06-16