స్థానిక ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం నిర్వహించవలసిన రాజకీయ పార్టీల సమావేశం వాయిదా పడింది. రిజర్వేషన్ల జీవోపై బుధవారం సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో... రాజకీయ పార్టీల సమావేశాన్ని ‘‘అనివార్య కారణాలవల్ల వాయిదా’’ వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 59.85 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొంతమంది సుప్రీంకోర్టులో సవాలు చేశారు.
2020-01-15రాజధాని తరలింపు ప్రయత్నాలు మరో ఇద్దరి ఉసురు తీశాయి. పండుగ రోజే వారి గుండెలు ఆగిపోయాయి. ప్రస్తుత సచివాలయం ఉన్న వెలగపూడి గ్రామ రైతు అంబటి శివయ్య (70) బుధవారం తెల్లవారు జామున గుండె పోటుతో మరణించారు. కొద్ది రోజుల క్రితం పురుగు మందు డబ్బాతో నిరసన తెలిపిన శివయ్యను రాష్ట్రమంతా చూసింది. అమరావతి పరిరక్షణ ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నాడు. ఐనవోలు గ్రామ మహిళ కట్టెపోగు వీరమ్మ (60) కూడా గుండె పోటుతో మరణించారు.
2020-01-15స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 59.85 శాతానికి పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందంటూ బిర్రు ప్రతాపరెడ్డి, బి.సి. రామాంజనేయులు పిటిషన్లు దాఖలు చేశారు. ఏపీ హైకోర్టులో ఈ అంశంపై పెండింగులో ఉన్న పిటిషన్లపై నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
2020-01-15సంక్రాంతి పంటల పండుగ... రైతు, కూలీల పండుగ... గ్రామాలకే పండుగ... కానీ, రాజధాని అమరావతికోసం భూములిచ్చిన గ్రామాల్లో ఇప్పుడా కాంతి లేదు. పంటలు లేవు. పంట భూములు తీసుకున్న ప్రభుత్వం అభివృద్ధిని అపేసింది. దాంతో పండుగ వాతావరణమే లేదు. 29 గ్రామాలు... 29 రోజులు... ఆంక్షలు, అణచివేత మధ్య సమరమే ఇప్పుడు సం‘క్రాంతి’.
2020-01-15‘మేకిన్ ఇండియా’ అని మైకులో చెప్పి... చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని వాట్సాప్ లో ఎంత మొత్తుకున్నా... ఎగుమతులు పెరగలేదు. 2019 ఆర్థిక సంవత్సరం చైనాతో మన వాణిజ్య లోటు 56.77 బిలియన్ డాలర్లు (రూ. 4.08 లక్షల కోట్లు). ఇండియా ఎగుమతులు కేవలం 17.95 బిలియన్ డాలర్లు కాగా దిగుమతులు 74.72 బిలియన్ డాలర్లు. ద్వైపాక్షిక వాణిజ్యం 2018లో 95.7 బిలియన్ డాలర్లు కాగా... రెండు దేశాల్లో ఆర్థిక వృద్ధి మందగించడంవల్ల 2019లో 92.68 బిలియన్ డాలర్లకు తగ్గింది.
2020-01-14ఆవుపేడ, మూత్రంపై రైతులు ఆదాయం పొందేలా చేయగలిగితే ఒట్టిపోయిన తర్వాత వదిలేయకుండా ఉంటారని కేంద్ర మంత్రి, బి.జె.పి. నాయకుడు గిరిరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆవుపేడపై మరిన్ని పరిశోధనలు చేయాలని, ఒట్టిపోయిన ఆవులు కూడా భారం కాకుండా చూడాలని శాస్త్రవేత్తలకు, యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్లకు కేంద్ర మంత్రి విన్నవించారు. ‘‘వీధి ఆవులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద సమస్య’’గా మారాయని సింగ్ చెప్పారు.
2020-01-14 Read Moreజె.ఎన్.యు.పై దాడికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఢిల్లీ పోలీసులకు కీలక ఆదేశాలిచ్చింది. జనవరి 5వ తేదీ రాత్రి జరిగిన దాడి వెనుక ఉన్న వాట్సాప్ గ్రూపుల సభ్యులందరినీ పిలిపించి ప్రశ్నించాలని, ‘‘యూనిటీ అగైనెస్ట్ లెఫ్ట్’’, ‘‘ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్.ఎస్.ఎస్’’ గ్రూపులలోని అందరి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని హుకుం జారీ చేసింది. ముగ్గురు ప్రొఫెసర్లు వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారిస్తున్న కోర్టు...వాట్సాప్ డేటా, సీసీ టీవీ ఫుటేజీని భద్రపరచాలని నిన్ననే అధికారులకు సూచించింది.
2020-01-14ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకోసం ఆమ్ ఆద్మీ పార్టీ ఒకే రోజు మొత్తం (70 మంది) అభ్యర్ధుల జాబితాను ప్రకటించింది. అందులో 46 మంది ప్రస్తుతం ఎమ్మెల్యేలు. 15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చారు. మిగిలిన 9 సీట్లనూ కొత్తవారికి ఇచ్చారు. సిఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పాత్పర్ గంజ్ నుంచి బరిలోకి దిగారు. ఢిల్లీ పాఠశాలల్ని తీర్చదిద్దడంలో కీలక పాత్ర పోషించిన ఆతిషి కల్కాజి నుంచి పోటీ చేస్తున్నారు.
2020-01-14హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను ఢిల్లీకి చేర్చే ప్రయత్నంలో పట్టుబడిన కాశ్మీర్ పోలీసు అధికారి దేవీందర్ సింగ్ విద్రోహం కథ చాలా పెద్దది. ముగ్గురు ఉగ్రవాదులను గత శుక్రవారం సోఫియాన్ ప్రాంతం నుంచి తన ఇంటికే తీసుకొచ్చి ఆ రాత్రి ఆశ్రయమిచ్చాడు. ఆ ఇల్లు బాదామిబాగ్ కంటోన్మెంట్ లోని ఆర్మీ 15 కార్ప్స్ కేంద్ర కార్యాలయం ప్రక్కనే ఉంది. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ నవీద్ బాబు, అతని అనుయాయులు ఇర్ఫాన్, రఫి శనివారం ఉదయమే జమ్మూకు బయలుదేరారు.
2020-01-14భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ బెయిలు దరఖాస్తును వ్యతిరేకించిన ప్రభుత్వ న్యాయవాదిపై ఢిల్లీ తీస్ హజారీ కోర్టు మండిపడింది. నిరసన రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో భాగమని జస్టిస్ కామిని లా స్పష్టం చేశారు. ప్రార్ధనా స్థలం వెలుపల నిరసనకు అనుమతి లేదని న్యాయవాది చెప్పగా ‘‘మీరు రాజ్యాంగం చదివారా? జామియా మసీదు పాకిస్తాన్లో ఉందన్నట్టు ప్రవర్తిస్తున్నారు. పాకిస్తాన్నో ఉన్నా కూడా, అక్కడికీ వెళ్లి నిరసన తెలపొచ్చు. అదీ ఒకప్పుడు ఉమ్మడి దేశంలో భాగం’’ అని జడ్జి పేర్కొన్నారు.
2020-01-14