అయోధ్యలో రామజన్మభూమి నిర్మాణంకోసం ట్రస్టు ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం లోక్ సభలో ప్రకటన చేశారు. ట్రస్టుకు ‘శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర’గా నామకరణం చేసినట్టు చెప్పారు. రామజన్మభూమి దర్శనంకోసం వచ్చే యాత్రీకులను కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. బుధవారం ఉదయం కేంద్ర కేబినెట్ సమావేశమై రామజన్మభూమి నిర్మాణ ట్రస్టుకు సంబంధించిన నిర్ణయాలను తీసుకుంది.
2020-02-05జనవరి 5న జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జె.ఎన్.యు)పై జరిగిన దాడిలో గాయపడిన విద్యార్ధులపై కేసు పెట్టలేదని ఢిల్లీ పోలీసులను ఉటంకిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించింది. బిజూ జనతాదళ్ ఎంపీ భర్తృహరి మహతాబ్ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు మంగళవారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సమాధానమిచ్చారు. దాడిలో బయటి వ్యక్తులు పాల్గొన్నారా? అనే ప్రశ్నకు ‘‘ఈ దశలో దర్యాప్తు వివరాలను వెల్లడించలేం’’ అని మంత్రి బదులిచ్చారు.
2020-02-04భారత పౌరుల జాతీయ రిజిస్టర్ (ఎన్.ఆర్.ఐ.సి) సవరణ ప్రక్రియను దేశవ్యాప్తంగా చేపట్టే అంశంపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర హోం శాఖ పార్లమెంటుకు తెలిపింది. పౌర రిజిస్టర్, జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్.పి.ఆర్)లపై వేర్వేరు ప్రశ్నలకు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మంగళవారం సమాధానాలిచ్చారు. ఎన్.పి.ఆర్. కోసం ప్రతి కుటుంబం, వ్యక్తి స్థితిగతులను తెలుసుకుంటామని, ఈ ప్రక్రియ సందర్భంగా ఎలాంటి పత్రాలూ ఇవ్వనవసరం లేదని పేర్కొన్నారు.
2020-02-04తమ భూభాగంలో రాజధాని ఏర్పాటుపై నిర్ణయాధికారం రాష్ట్రాలదేనని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర హోం శాఖ మంగళవారం సమాధానమిచ్చింది. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు తాము పత్రికల్లో చూశామని కేంద్ర మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015 ఏప్రిల్ 23న అమరావతిని రాజధానిగా నోటిఫై చేసిందని కూడా తెలిపారు.
2020-02-04‘కరోనావైరస్’ మహమ్మారిలా కమ్ముకున్న వేళ చైనాలోని హుబీ ప్రావిన్సు అధికారులు ఓ పెద్ద ఆసుపత్రిని కేవలం 9 రోజుల్లో నిర్మించారు. జనవరి 24వ తేదీన నిర్మాణం ప్రారంభించి ఫిబ్రవరి 2వ తేదీకి పూర్తి చేశారు. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న వుహాన్ నగర శివార్లలో 1000 పడకలతో నిర్మించిన ఈ ఆసుపత్రికి ఆదివారం పరికరాలు కూడా తరలివచ్చాయి. ప్రత్యేక వైద్య బృందాలనూ కేటాయించారు. చైనాలో ఆదివారం సాయంత్రానికి 17 వేలకు పైగా ‘కరోనా’ కేసులు నమోదు కాగా 361 మంది చనిపోయారు.
2020-02-03‘కరోనా వైరస్’ బారిన పడి కోలుకున్న వ్యక్తులకు మళ్ళీ సోకే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదట జంతువులనుంచి సోకిన ఈ వైరస్ ఇప్పుడు మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతోంది. మధ్య చైనాలోని హుబి ప్రావిన్సులో వుహాన్ కేంద్ర బిందువుగా వ్యాపించిన ‘కరోనా’తో చైనాలోనే 361 మంది మరణించారు. 2296 మంది వ్యాధి తీవ్రతకు గురయ్యారు. ఇప్పటిదాకా 480 మంది కోలుకొని ఆసుపత్రులనుంచి డిశ్చార్జి అయ్యారు. వారూ అప్రమత్తంగా ఉండక తప్పదు.
2020-02-03కరోనా వైరస్ కేసులు చైనాలో అసాధారణంగా పెరుగుతున్నాయి. చైనా ఆరోగ్యాధికారులు సోమవారం (ఫిబ్రవరి 3న) వెల్లడించిన వివరాల ప్రకారం... గడచిన 24 గంటల్లో 57 మంది మరణించారు. సుమారు 2800 కొత్త కేసులు నమోదయ్యాయి. హుబి ప్రావిన్సులోని వుహాన్ నగరంలో గత డిసెంబరులో తలెత్తిన ఈ మహమ్మారి న్యూమోనియా ఇప్పటిదాకా చైనాలోనే 17,238 మందికి సోకింది. ఇతర 23 దేశాల్లో 148 మంది ఆసుపత్రుల పాలయ్యారు. చైనాలో 361 మంది, ఫిలిప్పీన్స్ లో ఒకరు మరణించారు.
2020-02-03కరోనావైరస్ కేసులు చైనాలో శరవేగంగా పెరుగుతున్నాయి. ఆదివారం ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం..గడచిన 24 గంటల్లో చైనాలో 2590, ఇతర దేశాల్లో 14 కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా చైనాలో 14,411 మందికి వైరస్ సోకగా 304 మంది మరణించారు. ఇతర 23 దేశాల్లో 146 కేసులు నమోదయ్యాయి. చైనా వెలుపల తొలి మరణం పిలిప్పీన్స్ లో నమోదైంది. చైనాలో మరో 2110 మందిలో వ్యాధి తీవ్రత అధికంగా ఉంది. చైనాలో ప్రావిన్సులవారీ కేసుల మ్యాప్ పైన చూడవచ్చు.
2020-02-02కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదివారం (ఫిబ్రవరి 2న) న్యూఢిల్లీలోని గంగాారామ్ ఆసుపత్రిలో చేరారు. కడుపు నొప్పితో బాధపడుతున్న సోనియాగాంధీకి కొన్ని పరీక్షలు నిర్వహించనున్నట్టు సమాచారం. నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020 బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెడుతున్న సందర్భంలో సోనియాగాంధీ ఆ సమావేశాలకు హాజరు కాలేకపోయారు.
2020-02-02అధికార వికేంద్రీకరణకు అనేక మార్గాలు ఉన్నాయని, రాజధాని మార్పుతోనే వికేంద్రీకరణ జరగదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలోనే రాజధాని కొనసాగాలని బిజెపి ఏపీ శాఖ చేసిన తీర్మానాన్ని ఆయన ఉటంకించారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లుగానీ, రాజధానిని మారుస్తున్నట్లుగానీ ఇంతవరకు కేంద్రానికి రాష్ట్రం నుంచి అధికారిక సమాచారం లేదని కిషన్ రెడ్డి చెప్పారు. అమరావతి పరిరక్షణ జె.ఎ.సి. విన్నపంపై కిషన్ రెడ్డి ఆదివారం స్పందించారు.
2020-02-02