‘కరోనా వైరస్’ దాదాపు భూగోళం మొత్తాన్ని కవర్ చేసింది. సోమవారానికి 168 దేశాల్లో 3,67,038 మందికి వైరస్ సోకగా 16,113 మంది (4.39%) మరణించారు. విషాధకరమైన వాతావరణంలో ఓ మంచి వార్త ఏమంటే.. సోమవారం నాటికి వ్యాధి నయమై ఇళ్లకు వెళ్లినవారి సంఖ్య లక్ష దాటింది (1,00,879). అత్యంత దారుణంగా ‘వైరస్’ బారిన పడిన ఇటలీలో మరణాల రేటు 9.51%కి పెరిగింది. ఆ దేశంలో 63,927 మందికి వైరస్ సోకగా 6,077 మంది మరణించారు. అత్యధిక కేసులు (81,496) నమోదైన చైనాలో 3,274 మంది (4.01%) చనిపోయారు. కేసుల సంఖ్యలో (41,511తో) అమెరికా మూడో స్థానంలో ఉంది. అయితే, అక్కడ మరణాల రేటు తక్కువే (1.2%).
2020-03-23‘కరోనా వైరస్’ వ్యాప్తి వేగవంతం కావడంతో ఇండియాలో 100 కోట్ల మందికి పైగా ప్రజలు పూర్తి స్థాయి ఆంక్షల పరిధిలోకి వచ్చారు. కేంద్రం సూచనను అనుసరించి... 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పూర్తి ‘లాక్ డౌన్’ ప్రకటించాయి. మరో 3 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పరిమిత ‘లాక్ డౌన్’ను అమలు చేస్తున్నాయి. మొత్తంగా 548 జిల్లాలు పూర్తి స్థాయి ఆంక్షల పరిధిలోకి రాగా 58 జిల్లాలు పాక్షిక నిర్బంధంలో ఉన్నాయి. దేశంలో 471 ‘పాజిటివ్’ కేసులు నమోదైనట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) సోమవారం రాత్రి ప్రకటించింది.
2020-03-23న్యూయార్క్ రాష్ట్రంలో ఒక్క రాత్రికే కరోనా నిర్ధారిత కేసులు 38 శాతం పెరిగి 20,875కు చేరాయి. దీంతో ఆసుపత్రుల సామర్ధ్యాన్ని 50 శాతం పెంచాలని రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యూమో అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. అమెరికాలో దాదాపు సగం కేసులు న్యూయార్క్ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఒక్క న్యూయార్క్ నగరంలోనే సోమవారం ఉదయానికి 12,305 ‘కరోనా’ నిర్ధారిత కేసులు నమోదైనట్టు క్యూమో తెలిపారు. ఈ పరిస్థితి కొన్ని నెలలపాటు కొనసాగవచ్చని ఆయన అంచనా వేశారు. 621 మంది పేషెంట్లు ఐసియులలో ఉన్నారని, 157 మంది మరణించారని ఆయన వివరించారు.
2020-03-23 Read Moreనిత్యావసరాలకోసం ఇంటికి ఒక్కరికి మాత్రమే.. అదీ ఇంటినుంచి 3 కిలోమీటర్ల లోపే.. అనుమతించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘కరోనా’ కట్టడిపై సోమవారం సమీక్ష అనంతరం ఆంక్షలను కఠినతరం చేశారు. విశాఖ విమ్స్, విజయవాడ, తిరుపతి, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రులలో 1300 బెడ్లు అందుబాటులోకి వస్తున్నాయని, 150 వెంటిలేటర్లతో ఐసియు యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో మరో 200 వెంటిలేటర్లతో అదనపు యూనిట్లు ఏర్పాటవుతాయని అధికారులు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులలో 450 వెంటిలేటర్లను సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
2020-03-23గత ప్రభుత్వ (చంద్రబాబు) హయాంలో రాజధానిని ప్రకటించడంలోనే అక్రమాలు జరిగాయంటూ.. సీబీఐ దర్యాప్తునకు ఉత్తర్వులు జారీ చేసింది జగన్ ప్రభుత్వం. గత ప్రభుత్వంలోని వ్యక్తులు చేసిన అవకతవకలపై మంత్రివర్గ ఉపసంఘం నివేదికలో పేర్కొన్న ముఖ్యాంశాల ఆధారంగా దర్యాప్తు చేపట్టేందుకు సిబిఐకి అనుమతిస్తూ జీవో ఎంఎస్ నెం. 46ను సోమవారం జారీ చేసింది. ఇప్పటికే ఎపి సిఐడి నమోదు చేసిన కేసులను సీబీఐకి అప్పగించనుంది. రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, అప్పటి అధికార పార్టీ నేతలు 4 వేల ఎకరాలు కొనుగోలు చేశారని ఉపసంఘం నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే.
2020-03-23‘కరోనా’ కష్ట కాలంలో ప్రజలపై పెట్రోల్, డీజిల్ ధరల భారం పడుతుందా? సోమవారం పార్లమెంటులో ఫైనాన్స్ బిల్లుకు కేంద్రం చేసిన సవరణ అవుననే అంటోంది! ప్రత్యేక ఎక్సైజ్ సుంకం విధింపుపై ఉన్న పరిమితులను పెట్రోలుపై రూ. 18కి, డీజిలుపై రూ. 12కి పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ బిల్లు 2020కి సవరణను ప్రతిపాదించారు. ఈ సవరణతో సహా ఫైనాన్స్ బిల్లు ఏ చర్చా లేకుండానే ఆమోదం పొందింది. దీంతో.. భవిష్యత్తులో రూ. 8 మేరకు పన్నులు పెంచే అధికారం ప్రభుత్వానికి దఖలు పడింది. ముడి చమురు ధరలు తగ్గుతున్నా కేంద్ర ప్రభుత్వం పన్నులు పెంచుకుంటూ పోతోంది.
2020-03-23స్టాక్ మార్కెట్ తరహాలోనే రూపాయి తిరోగమనం కొనసాగుతోంది. సోమవారం డాలరు విలువ ఓ రూపాయికి పైగా పెరిగింది. డాలరుకు 76.29 రూపాయల వద్ద ట్రేడింగ్ ముగిసింది. ఇది చరిత్రలోనే కనిష్ఠ స్థితి. రిస్కీ ఆస్తులను వదిలించుకొని ఇన్వెస్టర్లు సురిక్షత మార్గాలవైపు మళ్ళుతుండటం ఈ పరిస్థితికి కారణంగా మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇటీవలే 11 సంవత్సరాల కనిష్ఠ స్థితికి చేరిన భారత జాతీయ వృద్ధి రేటు ‘కరోనా’ దెబ్బకు మరింత తగ్గుతుందనే ఆందోళన నెలకొంది.
2020-03-23‘కరోనా’ వ్యాప్తి నిరోధంకోసం అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన ప్రభుత్వం, ఈ నెల 25వ తేదీనుంచి దేశీయ విమాన ప్రయాణాన్నీ నిషేధించింది. మంగళవారం రాత్రి 11.59 నిమిషాల కల్లా అన్ని విమానాలు నేలపైకి దిగాలని కేంద్ర విమానయాన శాఖ సోమవారం ఆదేశించింది. అయితే, సరుకు రవాణా విమానాలకు ఈ నిషేధం వర్తించదు. ప్రయాణీకుల విమాన సర్వీసులను ఎప్పుడు పునరుద్ధరించేదీ సోమవారం చెప్పలేదు. ఇండియాలో కరోనా యాక్టివ్ కేసులు 415కి పెరగడంతో చర్యలు తీవ్రతరమయ్యాయి. మార్చి 20న అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించారు.
2020-03-23 Read More‘కరోనా వైరస్’ దెబ్బకు భారత స్టాక్ మార్కెట్ పేక మేడలా కూలుతోంది. బిఎస్ఇ సెన్సెక్స్ ఒకే రోజు 3,934.72 పాయింట్లు (13.15%) దిగజారి పతనంలో కొత్త రికార్డును నెలకొల్పింది. ప్రస్తుతం 25,981.24 పాయింట్లకు చేరింది. సెన్సెక్స్ 10 శాతం పైగా పతనమై వాణిజ్యాన్ని నిలిపివేయడం గత 10 రోజుల్లో ఇది రెండోసారి. ట్రేడింగ్ తిరిగి ప్రారంభం కాగానే అమ్మకాలు ఊపందుకున్నాయి. ఫలితంగా మార్కెట్ కోలుకోలేకపోయింది. కరోనా ప్రపంచవ్యాప్త మాంద్యానికి బాటలు వేయడం, దేశమంతటా ‘లాక్ డౌన్’ ప్రకటించడం భాతర మార్కెట్లను తీవ్ర స్థాయిలో దెబ్బ తీసింది.
2020-03-23‘కరోనా’ వ్యాప్తి నేపథ్యంలో... లోక్ సభలో ఎలాంటి చర్చ లేకుండానే ఫైనాన్స్ బిల్లు 2020 పాసైంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రతిపాదించిన పన్ను ప్రతిపాదనలను కొద్దిపాటి సవరణలతో చర్చ లేకుండానే ఆమోదించడానికి అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించాయి. ఈ ప్రధానమైన అంకంతో పార్లమెంటు సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు. అయితే, ‘కరోనా’ కాలంలో ప్రజలకోసం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని ప్రతిపక్ష సభ్యులు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని డిమాండ్ చేశారు.
2020-03-23 Read More