కాశ్మీర్ వివాదంపై ఏ చర్చలైనా ఇండియా, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షికంగానే జరుగుతాయని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ అమెరికా స్టేట్ సెక్రటరీ మైక్ పాంపియోకి స్పష్టం చేశారు. థాయ్ లాండ్ లో జరుగుతున్న ఆసియాన్ 2019 సదస్సుకు ఈ ఇద్దరూ హాజరయ్యారు. కాశ్మీర్ అంశంలో జోక్యానికి సిద్ధమంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి కూడా వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య ఆ ప్రస్తావన వచ్చింది.
2019-08-02 Read Moreజమ్మూ కాశ్మీర్ వివాదంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి అనుమానాస్పదంగా మారింది. ఇండియా, పాకిస్తాన్ కోరితే వివాద పరిష్కారానికి తాను జోక్యం చేసుకుంటానని మరోసారి వ్యాఖ్యానించారు. కాశ్మీర్లో మధ్యవర్తిత్వానికి తనను ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే కోరారని గత వారం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సమక్షంలో బహిరంగంగా ట్రంప్ చెప్పారు. ఆ ప్రకటనను ఇండియా ఖండించింది. అయినా గురువారం మళ్ళీ అదే పాట పాడారు.
2019-08-02 Read Moreఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయానికి బెదిరింపు ఇమెయిల్స్ అందాయి. ఆయనను చంపుతామని బెదిరిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయానికే బెదిరింపు రావడంతో, పోలీసులు కేసు నమోదు చేశారు. సిఎంను చంపుతామన్న బెదిరింపులతో జూలై 25, 30 తేదీల్లో రెండు ఇ మెయిల్స్ అందినట్టు పోలీసులు చెప్పారు. సిఎంఒ ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసు సైబర్ సెల్ స్పెషల్ యూనిట్ ఐపిసి సెక్షన్ 506 కింద కేసు నమోదు చేసింది.
2019-08-02 Read Moreకాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి తన పేరు పరిశీలనలోకి తీసుకోవద్దని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా సీనియర్ నేతల సమావేశంలో చెప్పినట్టు తెలిసింది. ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి సోదరుడు రాహుల్ రాజీనామా చేసిన నేపథ్యంలో, ఆ బాధ్యతను చేపట్టాల్సిందిగా కొంతమంది నేతలు ప్రియాంకా గాంధీని కోరారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కొత్త అధ్యక్షలు ఎవరన్న విషయమై నిర్ణయం తీసుకోనుంది.
2019-08-01కొద్ది రోజుల క్రితం 10 వేల మంది పారా మిలిటరీ సిబ్బందిని అదనంగా ‘జమ్మూ-కాశ్మీర్’కు పంపిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా మరో 25 వేల మందిని తరలించడానికి గురువారం ఆదేశాలిచ్చింది. దీంతో కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన చర్యలేవో తీసుకుంటుందన్న ఆందోళన ఆ రాష్ట్రంలో తీవ్రమవుతోంది. అమరనాథ్ యాత్రకోసం ఇదివరకే పంపిన 40 కంపెనీల పారామిలిటరీ దళాల్లో ఎక్కువ మందిని వివిధ జిల్లాలకు పంపాలని ఆదేశాలందాయి.
2019-08-01 Read Moreఉన్నావో (యూపీ) గ్యాంగ్ రేప్ బాధితురాలు, ఆమె కుటుంబంపై జరిగిన నేరాలకు సంబంధించిన ఐదు కేసులను సుప్రీంకోర్టు లక్నో సీబీఐ కోర్టు నుంచి ఢిల్లీ సీబీఐ కోర్టుకు బదిలీ చేసింది. బాధితురాలికి మధ్యంతర భృతిగా రూ. 25 లక్షలు ఇవ్వాలని, సి.ఆర్.పి.ఎఫ్. భద్రత కల్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులను రోజువారీగా విచారించి 45 రోజుల్లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.
2019-08-01 Read Moreపదేళ్ళ బాలికను రేప్ చేసి.. ఆమెను, ఏడేళ్ళ సోదరుడిని దారణంగా చంపిన ఓ కిరాతకుడికి మరణ శిక్షే సరైనదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోయంబత్తూరులో తొమ్మిది సంవత్సరాల క్రితం జరిగిన దారుణంలో రేపిస్టు హంతకుడు మనోహరన్ కు మద్రాసు హైకోర్టు విధించిన మరణశిక్షనే సుప్రీం ఖరారు చేసింది. జస్టిస్ రోహింగ్టన్ నారిమన్, జస్టిస్ హేమంత్ గుప్తా ఈ కేసును ‘‘అత్యంత అరుదైన కేటగిరి’’గా గుర్తించి మరణశిక్షను విధించగా, జస్టిస్ సంజీవ్ ఖన్నా అతను సహజంగా మరణించేవరకు జైల్లో ఉంచాలని సూచించారు.
2019-08-01తమ పార్టీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ (యూపీ) ఒక టీనేజ్ బాలికను రేప్ చేసినా.. ఆమె తండ్రిని చిత్రహింసలు పెట్టినా.. చివరికి రేప్ కేసులో ఆ ఎమ్మెల్యే జైలుకు వెళ్లినా బీజేపీ స్పందించలేదు. ఇప్పుడు బాధితురాలి కుటుంబం మొత్తాన్ని తుదముట్టించడానికి ఆ ఎమ్మెల్యే జైల్లోనుంచే చేసిన కుట్ర దేశంలో కలకలం రేపడంతోపాటు అంతర్జాతీయ వార్తగా మారింది. చిట్టచివరకు తప్పనిసరై ఆ ఎమ్మెల్యేను బీజేపీ బహిష్కరించింది.
2019-08-01 Read Moreఆదాయ పన్ను శాఖ గత డైరెక్టర్ జనరల్ తనను తీవ్రంగా వేధించారని తప్పిపోయిన వ్యాపారవేత్త వి.జి. సిద్ధార్థ పేర్కొన్నారు. సోమవారం మంగళూరులో అదృశ్యమయ్యాక ఆయన రాసిన లేఖను కంపెనీ ఉద్యోగులు బయటపెట్టారు. రెండు సందర్భాల్లో తమ షేర్లను అటాచ్ చేయడంవల్ల తీవ్రమైన ద్రవ్య సమస్యను ఎదుర్కొన్నానని సిద్ధార్థ ఆ లేఖలో పేర్కొన్నారు. ‘మైండ్ ట్రీ’ ఒప్పందం విషయంలోనూ, ‘కాఫీ డే’ షేర్ల విషయంలోనూ ఆ అధికారి అడ్డుపడ్డారని ఆరోపించారు.
2019-07-29కనిపించకుండా పోయిన కేఫ్ కాఫీ డే అధినేత వి.జి. సిద్ధార్థ మృతదేహం బుధవారం నేత్రావతి నది ఒడ్డున కనిపించింది. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు. సోమవారం సాయంత్రం మంగళూరులో సిద్ధార్ధ అదృశ్యం కాగా, ఆయన మృతదేహాన్ని బుధవారం వేకువజామున నగర శివార్లలో మత్య్సకారులు గుర్తించారు. ఈలోగా వందలమందితో గాలించారు. సిద్ధార్ధ మృతదేహంపైన ప్యాంట్ మాత్రమే ఉంది. టీషర్టు నీటి తాకిడికి కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
2019-07-31