ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ నెల 11వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని ఆ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రణబీర్ సింగ్ చెప్పారు. 21 సెంటర్లలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశామని, ప్రతి నియోజకవర్గానికీ ఒక ప్రత్యేక హాలు ఉంటుందని ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఢిల్లీ అసెంబ్లీలోని 70 నియోజకవర్గాలకు శనివారం పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.
2020-02-09థాయ్ లాండ్ ఈశాన్య భాగంలో ‘కోరట్’గా వ్యవహరించే మిలిటరీ స్థావరం వద్ద 26 మందిని కాల్చి చంపిన సైనికుడిని పోలీసులు తుదముట్టించారు. నిందితుడిని థాయ్ 22వ అమ్యునిషన్ బెటాలియన్ జవాను జక్రపంత్ తోమాగా గుర్తించారు. కాల్చి చంపే ముందు లొంగిపేయాలా ఒప్పించేందుకు అతని తల్లిని కూడా పోలీసులు ఆ ప్రదేశానికి పిలిపించారు. థోమా నిన్న ఓ షాపింగ్ మాల్ లో చొరబడి మిలిటరీ ఆయుధాలతో కాల్పులు జరపగా 26 మంది మరణించారు. మరో 57 మంది గాయపడ్డారు.
2020-02-09ఎంఐఎం శాసనసభా పక్ష నాయకుడు, చాంద్రాయణ గుట్ట (హైదరాబాద్) ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఒవైసీ ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును కలిశారు. పాత బస్తీ లోని లాల్ దర్వాజాలో ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని, ఆఫ్జల్ గంజ్ మసీదు మరమ్మతుల కోసం రూ. 3 కోట్లు విడుదల చేయాలని కోరారు. వెంటనే కేసీఆర్...ఈ రెండు ప్రార్ధనా మందిరాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను ఆదేశించారు.
2020-02-09పెద్ద ఓడలనుంచి సరుకును పోర్టుల్లోకి తెచ్చే ఒక ఐరన్ బార్జ్ కాకినాడ సమీపంలో సముద్రంలో మునిగిపోయింది. అందులో ఉన్న రూ. కోటిన్నర విలువైన బియ్యం నూక నీటి పాలయ్యాయి. ఈ సరుకు రవాణా ఓడ (కెకెడిబి 81) డీప్ వాటర్ పోర్టులో నూకను తరలిస్తుండగా ప్రమాదం సంభవించింది. అందులోని కార్మికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
2020-02-09డీజీపీ స్థాయి అధికారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్.. ఏబీ వెంకటేశ్వరరావుపై అభియోగాల చిట్టాను ప్రభుత్వం అనధికారికంగా లీక్ చేసింది. నిఘా పరికరాల కాంట్రాక్టు తన కుమారుడు చేతన్ సాయి క్రిష్ణకు దక్కేలా విదేశీ (ఇజ్రాయెలీ) రక్షణ సంస్థతో ఏబీ కుమ్మక్కయ్యారన్నది మొదటి అభియోగం. ఉద్ధేశపూర్వకంగానే ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్స్, పోలీసు ప్రొసీజర్లను విదేశీ సంస్థకు వెల్లడించారని, ఇది దేశభద్రతకే ముప్పు అని రెండో అభియోగం మోపారు.
2020-02-09కాశ్మీర్లో 2జి మొబైల్ ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోయాయి. పార్లమెంటుపై దాడి కేసులో ఉరిశిక్షకు గురైన మహ్మద్ అఫ్జల్ గురు 7వ వర్ధంతి (ఫిబ్రవరి 9) సందర్భంగా ఈ చర్య తీసుకున్నారు. గత ఆగస్టు 5న ఇంటర్నెట్ నిషేధం విధించిన ప్రభుత్వం, జనవరి 25న 2జి సేవలను పునరుద్ధరించింది. అయితే, ఫిబ్రవరి 9న గురు వర్ధంతి, 11న నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ వ్యవస్థాపకుడు మక్బూల్ భట్ వర్ధంతి సందర్భంగా ‘కాశ్మీర్ బంద్’కు జెకెఎల్ఎఫ్ పిలుపునివ్వడంతో 2జి సేవల్ని కూడా నిలిపివేశారు.
2020-02-092003లో ‘సార్స్’తో ప్రపంచవ్యాప్తంగా మరణించినవారికంటే ఇప్పుడు ‘కరోనా వైరస్’తో ఒక్క చైనాలోనే ఎక్కువ మంది చనిపోయారు. శనివారానికి చైనాలో 811 మంది కరోనాతో మరణించారు. హాంకాంగ్, ఫిలిప్పీన్స్ లలో మరో ఇద్దరు మరణించారు. అంటే గడచిన 24 గంటల్లో 89 మంది మృత్యువాత పడ్డారు. 2003లో ‘సార్స్’ సోకిన సుమారు 8 వేల మందిలో 774 మంది మరణించారు. మరణాల రేటు ‘సార్స్’తో (9.6 శాతం) కంటే ‘కరోనావైరస్’తో (2.2 శాతం) తక్కువే. కరోనా కేసుల మొత్తం 37,198కి పెరిగింది.
2020-02-09‘‘మీరు సిఎం కావడానికి... టీడీపీ ఓడిపోవడానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని సన్మానిస్తారనుకుంటే సస్పెండ్ చేశారేంటి జగన్మోహన్ రెడ్డిగారూ!!!’’ అని టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆదివారం ట్వీటారు. ఏబీ సస్పెన్షన్ పై ఆంధ్రజ్యోతి పతాక శీర్షికతో రాసిన వార్తను కూడా నాని షేర్ చేశారు. ఈ వ్యంగ్యాస్త్రానికి ఏబీ ‘‘ఏమిటోనండీ ఎంపీ గారూ! మీరేమో ఇలా అంటారు. మరి నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవడానికి నేనే కారణమని అంబటి రాంబాబు గారు అప్పట్లో కడుపుబ్బా నవ్వించారు’’ అని బదులిచ్చారు.
2020-02-09చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేసిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏబీ వెంకటేశ్వరరావును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నిఘా పరికరాల కొనుగోలుకోసం ఇజ్రాయిల్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందంలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అఖిల భారత సర్వీసు నిబంధనల్లోని 3(1) ప్రకారం సస్పెండ్ చేసినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ శనివారం రాత్రి జారీ చేసిన జీవో ఎంఎస్ 18లో పేర్కొన్నారు.
2020-02-08ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఇక 11వ తేదీన ఓట్లు లెక్కించేవరకు ఓటింగ్ మెషీన్లపైనే కన్ను! వాటిని భద్రపరిచే 30 స్ట్రాంగ్ రూములపై నిఘాకోసం వాలంటీర్లను మోహరిస్తామని సిఎం కేజ్రీవాల్ శనివారం సాయంత్రం చెప్పారు. పోలింగ్ ముగిశాక కేజ్రీవాల్ పార్టీ ముఖ్య నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ లతో సమావేశయ్యారు. బాబర్ పూర్ లో ఓ ఎన్నికల అధికారి ఇవిఎం మెషీన్ ను తనవద్దనే ఉంచుకున్నారని సంజయ్ సింగ్ విలేకరులకు చెప్పారు.
2020-02-08