ప్రపంచ కప్ వార్మప్ మ్యాచులలో తొలుత న్యూజిలాండ్ జట్టు చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన ఇండియా, మంగళవారం బంగ్లాదేశ్ పైన మాత్రం చెలరేగింది. ఎంఎస్ ధోని (78 బంతుల్లో 113), కెెఎల్ రాహుల్ (99 బంతుల్లో 108) విజృంభణతో భారీ స్కోరు (359) చేసింది. 50 ఓవర్లు ఆడి 7 వికెట్లు నష్టపోయింది. బంగ్లాదేశ్ ముందు 360 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ధోని 7 సిక్సర్లు, 8 ఫోర్లతో విశ్వరూపం చూపించాడు. రాహుల్ పోటాపోటీగా 4 సిక్సర్లు, 12 ఫోర్లు బాదాడు.
2019-05-28ఈ ఎన్నికల్లో తాను ఓడిపోయినా మళ్ళీ మంగళగిరిలోనే పోటీ చేస్తానని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల మనసులు గెలిచానని వ్యాఖ్యానించారు. సోమవారం తనను కలవడానికి వచ్చిన కార్యకర్తలతో లోకేష్ మాట్లాడారు. తాను పోటీ చేయడానికి మంగళగిరిని ఎంచుకోవడం సరికాదని చాలా మంది చెప్పారని, ఓడిపోయాక కూడా అదే అంటున్నారని, అయినా తాను ఇక్కడినుంచి పోటీ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని లోకేష్ చెప్పారు.
2019-05-27నటుడు అజయ్ దేవగన్ తండ్రి, వెటరన్ స్టంట్ డైరెక్టర్ వీరూ దేవగన్ సోమవారం ముంబయిలో మరణించారు. వీరూ దేవగన్ 80 సినిమాలకు పని చేశారు. అమితాబ్ బచన్, అజయ్, మనీషా కోయిరాలా నటించిన ‘హిందూస్థాన్ కీ కసమ్’ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. యాక్షన్ డైరెక్షన్ చేసే సమయంలో అనేకసార్లు గాయాలపాలయ్యారు. వృద్దాప్యంలో అనారోగ్యంతో ముంబయిలోని సూర్య హాస్పిటల్ లో చేరిన చికిత్స పొందుతూ మరణించారు. ఆయన అంత్యక్రియలు సోమవారం సాయంత్రం 6 గంటలకు జరుగుతాయి.
2019-05-27 Read More17వ లోక్ సభ తొలి సమావేశాలు జూన్ 6-15 తేదీల్లో జరిగే అవకాశాలున్నాయి. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో 17వ లోక్ సభ కొలువుదీరనుంది. ఈ నెల 31వ తేదీన జరిగే తొలి కేబినెట్ సమావేశంలో పార్లమెంటు సమావేశాల తేదీలను ఖరారు చేయవచ్చు. 30వ తేదీన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
2019-05-27 Read Moreఆంధ్రప్రదేశ్ నూతన సారథి జగన్మోహన్ రెడ్డికి ఆయన తండ్రి సహచరుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కొన్ని సలహాలు ఇచ్చారు. 1. ప్రతి ప్రభుత్వ సమాచారమూ ప్రజలు చూసేలా ఇంటర్నెట్లో ఉంచడం (అధికారులు మాత్రమే పాస్ వర్డ్ లతో చూసే సమాచారంతో సహా) 2. ప్రతి ప్రభుత్వ కార్యాలయం ఎదుటా ఉద్యోగులు, అధికారుల జీతభత్యాల బోర్డులు పెట్టడం.. అందులో ఉన్నాయి. అవినీతి రహిత పాలనతో జగన్ 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలంటే ఇలాంటి చర్యలు తప్పవని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.
2019-05-27వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. శాసనసభలోని 175 స్థానాలకు గాను 151 చోట్ల గెలిచిన నేపథ్యంలో శనివారం తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో శాసనసభా పక్ష సమావేశం జరిగింది. కొత్త ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానంతో జగన్మోహన్ రెడ్డిని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. జగన్ పేరును సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రతిపాదించగా పిఎసి ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నేతలు ధర్మాన ప్రసాదరావు, పార్థసారధి, ఆదిమూలపు సురేష్ బలపరిచారు.
2019-05-25 Read Moreతెలుగుదేశం పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాననుకున్న నారా లోకేష్, కింగ్ మేకర్ అవుతానన్న పవన్ కళ్యాణ్.. ఇద్దరూ ఓటమి పాలయ్యారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేష్ సిటింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి (వైసీపీ) చేతుల్లో 5,337 ఓట్ల తేడాతో ఓడిపోయారు. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసినా ఒక్క సీటూ తెచ్చుకోలేకపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 8,357 ఓట్ల తేడాతోను, విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఏకంగా 16,753 ఓట్ల తేడాతోనూ పవన్ ఓడిపోయారు. ఆ రెండుచోట్లా వైసీపీ గెలిచింది.
2019-05-232019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లు గెలిచింది. 175 సీట్ల అసెంబ్లీలో ఇవి కేవలం 13.14 శాతం. టీడీపీ ఇంత తక్కువ స్థాయిలో సీట్లు గెలుచుకోవడం ఆ పార్టీ 36 సంవత్సరాల ఎన్నికల చరిత్రలో ఇదే తొలిసారి. పదేళ్ల పాలన తర్వాత 2004లో ఓటమి పాలైన సందర్భంలో కంటే.. ఇప్పుడు మరీ ఘోరమైన ఓటమిని టీడీపీ చవిచూసింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ 47 సీట్లు గెలుచుకుంది. అసెంబ్లీలోని మొత్తం 294 సీట్లలో అవి 15.99 శాతం. ఇప్పుడు ఐదేళ్లకే అంతకంటే ఘోరంగా ఇంటిదారి పట్టింది.
2019-05-242019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అసాధారణ విజయాన్ని నమోదు చేసింది. వరుసగా రెండోసారి సొంతగా మెజారిటీ (303 సీట్లు) సాధించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ 52 సీట్లకే పరిమితమైంది. కూటమిగా ఎన్డీయే 349 సీట్లు సాధించగా యూపీఎ 89కి పరిమితమైంది. 2014 ఎన్నికల్లో కంటే బీజేపీకి 21 సీట్లు పెరిగితే.. అప్పట్లో ఘోర ఓటమిని ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేవలం 8 సీట్లను మాత్రమే పెంచుకోగలిగింది. ప్రభుత్వంలో ఉన్న పార్టీ తిరిగి సొంత మెజారిటీతో అధికారంలోకి రావడం గత నాలుగు దశాబ్దాల్లో ఇదే తొలిసారి.
2019-05-24ప్రజలు విశ్వసనీయతకు ఓటు వేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన పార్టీ కార్యకర్తలను, మీడియాను ఉద్ధేశించి మాట్లాడారు. విశ్వసనీయత లేని రాజకీయ నాయకుల స్థితి ఏమిటో ప్రజలు ఓటుతో తెలియజేశారని వ్యాఖ్యానించారు. విజయం తన బాధ్యతను పెంచిందన్న జగన్.. పాలన అంటే ఎలా ఉండాలో చూపిస్తానని, ఏడాది లోపే మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానని ఉద్ఘాటించారు.
2019-05-23