ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో ఆర్.టి.సి.ని విలీనం చేసే విషయంలో ‘‘ఏపీలో ఏ మన్నూ జరగదు’’ అని కొద్ది కాలం క్రితం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ... ‘‘మేం చేసి చూపించాం’’ అని నాని గర్వంగా చెప్పారు. తెలంగాణలో ఆర్.టి.సి. సమ్మె జరుగుతున్నప్పుడు.. విలీనం సాధ్యం కాదని కేసీఆర్ స్పష్టం చేశారు.
2020-01-012019కి తెలంగాణ మత్తుగా వీడ్కోలు పలికింది. డిసెంబరు 30, 31 తేదీల్లో మద్యం అమ్మకాలు కొత్త శిఖరాలకు చేరుకున్నాయి. గత ఏడాది కంటే రూ. 98 కోట్లు అదనంగా రూ. 436 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలో రెండు రోజుల్లోనే 4.85 లక్షల కేసుల మద్యం, 5.10 లక్షల కేసుల బీరు అమ్ముడుపోయాయి. అంటే సుమారు 2.388 కోట్ల సీసాలు. తెలంగాణ జనాభాలో ప్రతి ముగ్గురికీ రెండు సీసాలన్నమాట!
2020-01-02డిసెంబరు 31 రాత్రి ఎక్కువగా తాగడం సహజం. ఏపీ ప్రభుత్వం భారీగా రేట్లు పెంచడంతో ఈసారి మద్యం వినియోగం బాగా తగ్గింది. 2018 డిసెంబరు 31న 2.05 లక్షల కేసుల మద్యం, 1.45 లక్షల కేసుల బీరు వినియోగిస్తే...ఈసారి 1.33 లక్షల కేసుల మద్యం, 50,995 కేసుల బీరు మాత్రమే తాగారు. బీరు అమ్మకాలు 65 శాతం, మద్యం అమ్మకాలు 35 శాతం తగ్గాయి. అయితే, అమ్మకాల విలువ 12.53 శాతమే తగ్గింది. గత ఏడాది అమ్మకాల విలువ రూ. 120 కోట్లు కాగా, ఈసారి 105 కోట్లు.
2020-01-02‘అమరావతి’కోసం జైలుకైనా వెళ్తానని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చెప్పారు. ‘అమరావతి’నుంచి రాజధానిని మార్చవద్దనే డిమాండుతో ఆందోళన చేస్తున్న రైతులకు మద్ధతుగా చంద్రబాబు దంపతులు బుధవారం పలు గ్రామాల్లో నిరసన శిబిరాలను సందర్శించారు. ‘అమరావతి’పై జగన్మోహన్ రెడ్డికి ఎందుకంత కడుపు మంట? అని చంద్రబాబు ప్రశ్నించారు. నిర్మాణాలు సాగించిన భూములను రైతులకు యధాతథంగా ఎలా తిరిగి ఇస్తారని ప్రశ్నించారు.
2020-01-01తమకు ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీయేనని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు స్పష్టం చేశారు. ఎత్తుపల్లాలను చూసినా ఆ పార్టీని తక్కువగా అంచనా వేయలేమని పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. 2020 దశకం కూడా టీఆర్ఎస్ దేనని ఉద్ఘాటించారు. తెలంగాణలో బిజెపి పరిస్థితిలో పెద్దగా మార్పు లేదని, తన చిన్నతనంలో ఎలా ఉందో ఇప్పుడూ అంతే ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
2020-01-01ముంబయి నగరంలో 2020 జనవరి 1న... కొత్త సంవత్సర వేడుకల కమనీయ సన్నివేశాల మధ్య ఓ దయనీయ దృశ్యం గుండెను పిండేసింది. ఇద్దరు పారిశుద్య కార్మికులు మురుగునీటి ఛాంబర్ ను శుద్ధి చేస్తున్న సమయంలో ఊపిరాడక మరణించారు. ‘‘న్యూ ఇండియా’’లోనూ మలమూత్రాలలోకి దిగి చేతులతో శుద్ధి చేసే పరిస్థితే విషాదకరం. ఆ మురుగునీటి ఛాంబర్లే కార్మికుల పాలిట గ్యాస్ ఛాంబర్లుగా మారి ఉసురు తీస్తున్నాయి.
2020-01-01నూతన సంవత్సర వేడుకల వేళ కేరళలోని పోర్టు నగరం ‘‘కొచ్చి’’ పౌరసత్వ సవరణ చట్ట (సిఎఎ) వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లింది. ‘‘ఇండియాలో పుట్టాం. ఇండియాలో నివసిస్తున్నాం. ఇండియాలోనే చనిపోతాం’’ అని నిరసనకారులు గట్టిగా నినదించారు. జాతీయ పతాకాలు చేతబూనిన ప్రదర్శనకారులు సిఎఎను ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ముస్లిం సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
2020-01-01 Read Moreపరీక్షల్లో ఒత్తిడిని ఎలా జయించాలి? అన్న అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 20వ తేదీన విద్యార్ధులకు పాఠం చెప్పబోతున్నారు. ‘‘పరీక్షా పె చర్చ 2020’’ పేరిట ఈ కార్యక్రమాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్వహించనుంది. 2018, 2019 సంవత్సరాల్లో కూడా పరీక్షలకు ముందు ప్రధాని మోడీ ఇలాగే విద్యార్ధులతో మాట్లాడారు. విద్యార్ధుల్లో ఒత్తిడిని దూరం చేయడంతోపాటు ప్రధానమంత్రిని కలిసే అవకాశం ఇవ్వడం ఈ కార్యక్రమం ఉద్ధేశమని కేంద్రం చెబుతోంది.
2020-01-01మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అమరావతి రైతులకు ఇవ్వవలసింది చేతి గాజులు కాదని, ‘ఇన్సైడర్ ట్రేడింగ్’లో కొట్టేసిన భూములని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్ఫశ్రీవాణి వ్యాఖ్యానించారు. రైతు ఉద్యమానికి మద్ధతుగా భువనేశ్వరి గాజులు విరాళంగా ఇవ్వడంపై డిప్యూటీ సిఎం స్పందించారు. ఐదేళ్ళలో రాజధానిని నిర్మించలేకపోవడం, రైతులకు అభివృద్ధి చేసిన భూమిని ఇవ్వలేకపోవడంపై సమాధానం చెప్పలేక చంద్రబాబు కొత్త నాటకం వేస్తున్నారని విమర్శించారు.
2020-01-01కొత్త సంవత్సరం ప్రారంభం రోజే రైల్వే ఛార్జీల భారంతో పాటు గ్యాస్ బండ ప్రజల నెత్తిన పడింది. 14.2 కేజీల సిలిండర్ ఒక్కోదానికి రూ. 20 మేరకు ధర పెరిగింది. ముంబయి, ఢిల్లీ నగరాల్లో రూ. 19 చొప్పున, చెన్నైలో రూ. 20, కోల్ కత నగరంలో ఏకంగా రూ. 21.5 పెరిగింది. సెప్టెంబరు నుంచి గ్యాస్ ధర పెరగడం ఇది ఐదోసారి. ఐదు విడతలుగా ఒక్కో సిలిండరుపై రూ. 139.50 పెరిగడం గమనార్హం.
2020-01-01 Read More