దేశ పౌరుల్లో భయాందోళనలు కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ, అర్బన్ నక్సల్స్ అవాస్తవాలను ప్రచారంలో పెట్టారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ముస్లింలను డిటెన్షన్ సెంటర్లకు పంపుతారంటూ పుకార్లు పుట్టించారని, అసలు ఇండియాలో డిటెన్షన్ సెంటర్లే లేవని మోడీ చెప్పారు. ఆదివారం ఢిల్లీ రామ్ లీలా మైదానంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర తీసిన మోడీ, పౌరసత్వ సవరణ చట్టం విషయంలో ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
2019-12-22పాత బకాయిల కింద తమకు రూ. 1,72,655 కోట్లు చెల్లించాలంటూ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్)కు కేంద్ర టెలికం శాఖ లేఖ రాసింది. ‘గెయిల్’ కంపెనీ నికర విలువకు ఈ మొత్తం మూడున్నర రెట్లు ఉండటం విశేషం. 2002లో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐపిఎస్) లైసెన్సు పొందిన గెయిల్, తాము ఆ లైసెన్సుతో ఏ వ్యాపారమూ చేయలేదంటోంది. అయితే, టెలికం శాఖ కేటాయించిన స్పెక్ట్రంను ఉపయోగించి నాన్ టెలికం రెవెన్యూ సంపాదించినా ప్రభుత్వానికి ఫీజు చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
2019-12-22ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు చేయగలిగిన ఉత్తమమైన పని... తన పదవికి రాజీనామా చేయడమేనని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం అభిప్రాయపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు దేశవ్యాప్తంగా విస్తరించిన నేపథ్యంలో... చిదంబరం ‘‘ద వీక్’’ పత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను మోడీ ప్రభుత్వం ఐసియులో పెట్టిందని, మోడీ తన సన్నిహిత పెట్టుబడిదారులకు మాత్రమే మేలు చేస్తున్నారని చిదంబరం విమర్శించారు.
2019-12-22ప్రభుత్వం ఏ ఒక్కరి హక్కులనూ లాక్కోవడం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక ఆందోళనలు దేశమంతా విస్తరించిన నేపథ్యంలో... మోడీ ఆదివారం ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రాంలీలా మైదానంలో భారీ జనసమీకరణను ఉద్దేశించి మాట్లాడిన మోడీ ‘‘మేము లక్షల ఇండ్లు కట్టించాం. ఎవరినీ వారి మతం ఏమిటో అడగలేదు... పౌరసత్వ సవరణ చట్టంపై తప్పుడు సమాచారం, అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారు’’ అని మోడీ వ్యాఖ్యానించారు.
2019-12-22పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శనివారం హైదరాబాద్ పాత బస్తీలో భారీ ర్యాలీ జరిగింది. ఆలిండియా ముస్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) ప్రధాన కార్యాలయమైన దారుస్సలాంలో బహిరంగ సభ నిర్వహించారు. సిఎఎకి, పౌర రిజిస్ట్రీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న ఉద్యమంగా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అభివర్ణించారు. పోరాటం శాంతియుతంగా ఉండాలని ఆయన సూచించారు.
2019-12-21మరణించిన వ్యక్తులపై పాత కేసులేమైనా ఉంటే తీసివేయడం సహజం. కానీ, వ్యక్తులు మరణించిన తర్వాత వారిపై కేసులు నమోదు చేయడం అసాధారణం.. అరాజకం. కర్నాటకలో ఇదే జరిగింది. సిఎఎకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారిపై మంగుళూరు పోలీసులు జరిపిన కాల్పుల్లో అబ్దుల్ జలీల్, నౌసీన్ యానె మరణించారు. ఆ తర్వాత వారిపై అల్లర్ల కేసు నమోదు చేశారు. కేసు నమోదైన రెండు రోజులకు... వారి కుటుంబాలకు కర్నాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప పరిహారం ప్రకటించారు.
2019-12-22మత ప్రాతిపదికన పౌరసత్వ చట్టానికి సవరణలు చేస్తూ రూపొందించిన సిఎఎకి దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతుండగా అధికార బీజేపీ ఒక్కటే అక్కడక్కడా మద్ధతు ర్యాలీలు చేస్తోంది. ఆర్.ఎస్.ఎస్. కేంద్ర స్థానమైన నాగపూర్ లో ఆదివారం బిజెపి, దాని మాతృ సంస్థ, అనుబంధ సంస్థ లోక్ అధికార్ మంచ్ ర్యాలీ నిర్వహించాయి. ‘‘సిఎఎకు నాగపూర్ స్వాగతం’’ అనే నినాదంతో కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు.
2019-12-22ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారడానికి బిజెపినే కారణమని సమాజ్ వాదీ పార్టీ (ఎస్.పి) ఆరోపించింది. ప్రభుత్వంలోనే కూర్చున్నవాళ్లే అల్లర్లను ప్రేరేపించారని, బిజెపి ఉద్దేశపూర్వకంగా ద్వేషాన్ని వెదజల్లుతోందని ఎస్.పి. అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ దుయ్యబట్టారు. నిజమైన సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని ప్రజలను భయపెడుతోందని విమర్శించారు.
2019-12-2266వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుక శనివారం రాత్రి చెన్నైలో జరిగింది. దక్షిణాది తారా లోకం సందడి చేసింది. తెలుగులో ఉత్తమ నటుడిగా రామ్ చరణ్ (రంగస్థలం), ఉత్తమ నటిగా కీర్తి సురేశ్ (మహానటి) ఎంపికయ్యారు. తమిళంలో ఉత్తమ నటిగా త్రిష క్రిష్ణన్ ఎంపికయ్యారు. మలయాళం, తమిళంలో ఉత్తమ నటులుగా దుల్కేర్ సల్మాన్, ధనుష్ ఎంపికయ్యారు. ‘మహానటి’కి ఉత్తమ దర్శకుడు (నాగ్ అశ్విన్) అవార్డు, రంగస్థలం సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడు (దేవిశ్రీ ప్రసాద్) అవార్డు దక్కాయి.
2019-12-21దేశవ్యాప్తంగా పౌరసత్వ (సవరణ) చట్టం (సిఎఎ)కు వ్యతిరేకంగా నిరసన వెల్లువెత్తడంతో బిజెపి ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో...పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సిఎఎకి అనుకూలంగా లక్షల మంది ర్యాలీ చేసినట్టు పేర్కొంటూ కొన్ని ఫొటోలు సామాజిక మాథ్యమాల్లో చెలామణి అవుతున్నాయి. బీజేపీ తమిళనాడు రాష్ట్ర ఐటి, సోషల్ మీడియా చీఫ్ సి.టి.ఆర్. నిర్మల్ కుమార్ ఈ ఫొటోలను షేర్ చేసినవారిలో ఒకరు. నిజానికి అవి బెంగాల్ కు సంబంధించినవే కాదు. 2016లో మరాఠాలకు రిజర్వేషన్ కోరుతూ మహారాష్ట్రలో జరిగిన భారీ ర్యాలీల ఫొటోలు.
2019-12-21