దేశంలో ఆర్థిక మందగమనం ప్రభావం రైల్వేలను తీవ్రంగా ప్రభావితం చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రవాణా చార్జీల్లో రూ. 3,901 కోట్లు, ప్రయాణీకుల చార్జీల ద్వారా వచ్చే ఆదాయంలో రూ. 155 కోట్లు తగ్గింది. 2019 ఏప్రిల్-జూన్ కాలంలో సరుకు రవాణా ద్వారా రైల్వేలకు రూ. 29,067 కోట్ల ఆదాయం వచ్చింది. జూలై-సెప్టెంబర్ కాలంలో అది రూ. 25,165 కోట్లకు తగ్గింది. ప్రయాణీకుల ద్వారా ఏప్రిల్-జూన్ కాలంలో రూ. 13,399 కోట్లు ఆదాయం రాగా, జూలై-సెప్టెంబర్ కాలంలో రూ. 13,244 కోట్లకు తగ్గింది.
2019-10-26 Read Moreగంజాయి పంటకు, అమ్మకాలకు విశాఖపట్నం ప్రాంతం కేంద్ర బిందువుగా మారింది. తాజాగా విశాఖ జిల్లా కశింకోట మండలం తాళ్ళపాలెం గ్రామంలో పోలీసులు 561 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 11.25 లక్షలు ఉంటుందని ప్రాథమిక సమాచారం.
2019-10-261991 విదేశీ మారకద్రవ్య చెల్లింపుల సంక్షోభ సమయంలో భారతీయ రిజర్వు బ్యాంకు 67 టన్నుల బంగారాన్ని ‘యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్’కు తాకట్టు పెట్టింది. మళ్లీ ఇంత కాలానికి రిజర్వు బ్యాంకు తన బంగారు నిల్వలనుంచి కొంత భాగాన్ని అమ్మేసింది. శుక్రవారం విడుదలైన రిజర్వు బ్యాంకు వారాంతపు గణాంకాల ప్రకారం... జూలై నెలనుంచి రిజర్వు బ్యాంకు 5.1 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని కొనుగోలు చేసంది. అదే సమయంలో 1.15 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని విక్రయించింది.
2019-10-25 Read More2019 ఆర్థిక సంవత్సరానికి అమెరికా బడ్జెట్ లోటు దాదాపు 1 ట్రిలియన్ డాలర్లకు (సుమారు రూ. 71 లక్షల కోట్లు) పెరిగింది. ట్రెజరీ డిపార్ట్‌మెంట్ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2012 నుండి ఇదే అతిపెద్ద లోటు. లోటును తగ్గిస్తానని, తొలగిస్తానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాగ్దానం చేసినప్పటికీ అది మరింత పెరిగింది. సెప్టెంబరుతో ముగిసిన 12 నెలల కాలానికి బడ్జెట్ లోటు 26% పెరిగి 984 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2017 చివరిలో ఆమోదించిన రిపబ్లికన్ పన్ను తగ్గింపు ప్యాకేజీ ఈ లోటుకు కొంత వరకు కారణం.
2019-10-26‘‘నాకు అన్నిచోట్లా బుడగలు కనిపిస్తున్నాయి’’.. నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ షిల్లర్ ప్రపంచ స్టాక్ మార్కెట్లపై వ్యక్తం చేసిన అభిప్రాయమిది. యేల్ యూనివర్శిటీ ఆర్థిక శాస్త్రం ప్రొఫెసర్ షిల్లర్ బుధవారం లాస్ ఏంజెలిస్ నగరంలో ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య చేశారు. ‘‘అహేతుక ఉత్సాహం’’ పేరిట ఇంతకు ముందే స్టాక్ మార్కెట్ల పతనంపై పుస్తకం రాసిన షిల్లర్, తాజాగా ‘‘నేరేటివ్ ఎకనామిక్స్’’ అనే పుస్తకాన్ని వెలువరించారు. 2000 సంవత్సరపు స్టాక్ మార్కెట్ల పతనాన్ని, 2007లో హౌసింగ్ మార్కెట్ పతనాన్ని షిల్లర్ ముందే అంచనా వేశారు.
2019-10-26 Read Moreహర్యానాలో బిజెపి, జననాయక్ జనతా పార్టీ (జెజెపి) కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానుంది. జెజెపి అధినేత దుష్యంత్ చౌతాలా శుక్రవారం రాత్రి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమై ఒక ఒప్పందానికి వచ్చారు. దీని ప్రకారం బీజేపీ నుంచే ముఖ్యమంత్రి ఉంటారు. దుష్యంత్ చౌతాలాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారు. స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నదే తమ అభిప్రాయమని చౌతాలా ఈ సందర్భంగా చెప్పారు. రేపు చండీగఢ్ లో గవర్నరును కలవనున్నట్టు సిఎం మనోహర్ లాల్ ఖట్టర్ చెప్పారు.
2019-10-25వాషింగ్టన్ నగరంలో శ్వేతసౌధానికి కూత వేటు దూరంలో ఉన్న ‘ట్రంప్ హోటల్’ను అమ్మబోతున్నారట! ఈ సంపన్న హోటల్ అమెరికా అధ్యక్షుడికి చెందిన ‘ట్రంప్ ఆర్గనైజేషన్’ చేతిలో ఉంది. ట్రంప్ దేశాధ్యక్షునిగా ఉండి ఈ ఆస్తినుంచి లాభం పొందుతున్నారని విమర్శలున్నాయి. నిజానికి ఈ హోటల్ భవనం ట్రంప్ సొంతం కాదు. అమెరికా ప్రభుత్వ భవనాన్ని ట్రంప్ సంస్థకు లీజుకిచ్చారు. ఈ లీజు హక్కులను ధారాదత్తం చేయడం ద్వారా ఇప్పుడు ట్రంప్ సంస్థకు 50 కోట్ల డాలర్లు (సుమారు రూ. 3,600 కోట్లు) వస్తాయని అంచనా.
2019-10-25 Read Moreకార్పొరేట్ పన్నును సుమారు 10 శాతం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బడా కంపెనీలకు వరమైంది. దేశంలో అతిపెద్ద ఫండ్ హౌస్ అయిన హెచ్‌డిఎఫ్‌సి అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లాభం ఏకంగా 79 శాతం పెరిగింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ లాభంలో వృద్ధి పన్ను చెల్లించక ముందు 44 శాతంగా ఉంటే, (తగ్గించిన) పన్ను చెల్లింపుల తర్వాత అది 79 శాతానికి పెరిగింది. సెప్టెంబర్ 30 నాటికి కంపెనీ రూ .3.6 లక్షల కోట్ల ఆస్తులను నిర్వహించింది. ఇది ఏడాది క్రితం కంటే 25 శాతం ఎక్కువ.
2019-10-25 Read Moreతెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘం నాయకుడు అశ్వత్థామరెడ్డిపై కూకట్ పల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. కార్మికుల ఆత్మహత్యలకు అశ్వత్థామరెడ్డిదే బాధ్యత అంటూ కూకట్ పల్లి డిపో డ్రైవర్ కోరేటి రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ కార్మికులది కాదని, అది అశ్వత్థామరెడ్డిదేనని రాజు ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
2019-10-25తప్పుడు వార్తలు, సమాచారానికి వేదికైందనే విమర్శలను ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్, ఆ అప్రతిష్ట నుంచి బయటపడటానికి ఓ ‘న్యూస్ టాబ్’ను రూపొందించింది. ‘ఫేస్‌బుక్ న్యూస్’ పేరిట రూపొందించిన ఈ టాబ్ శుక్రవారం అమెరికన్లకు అందుబాటులోకి వచ్చింది. పాత్రికేయులు వృత్తినైపుణ్యంతో రూపొందించిన సమాచారాన్ని ఈ టాబ్ ద్వారా అందించనున్నట్టు ఫేస్‌బుక్ ప్రకటించింది. వైరల్ అవుతున్న పుకార్లకు ప్రత్యామ్నాయంగా ఫేస్‌బుక్ యాప్ లోనే ఈ వార్తలను చదువుకోవచ్చని తెలిపింది.
2019-10-25