వైఎస్ రాజశేఖర రెడ్డి పేరిట వచ్చే నాలుగేళ్ళలో 25 లక్షల ఇళ్ళను నిర్మించాలని జగన్మోహన్ రెడ్డి తొలి కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. మొదటి సంవత్సరం స్థలాల ఎంపిక జరుగుతుందని, తర్వాత నాలుగు సంవత్సరాల్లో ఇళ్ళ నిర్మాణం ఉంటుందని సిఎం చెప్పారు. ఇళ్ళ నిర్మాణంకోసం భూములు కొనుగోలు చేస్తామని, ప్రతి ఏటా ఉగాది రోజున పంపిణీ చేపడతామని తెలిపారు. రిజిస్ట్రేషన్ ఇంటి ఇల్లాలి పేరు మీదే చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
2019-06-10వ్యవసాయ రంగంపై జగన్మోహన్ రెడ్డి తొలి మంత్రివర్గ సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరిట వడ్డీ రహిత రుణాలు రైతులకు అందిస్తామని చెప్పారు. 2014-18 కాలంలో బకాయి ఉన్న రూ. 2000 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని వెంటనే రైతులకు ఇవ్వాలని, ప్రకృతి వైపరీత్యాల నిధికి రూ. 2000 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ. 3000 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. పంటల బీమా పథకంలో 100 శాతం ప్రీమియం ఇకపైన ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు.
2019-06-10పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, పీపుల్స్ పార్టీ కో ఛైర్మన్ అసిఫ్ అలి జర్దారీని నకిలీ బ్యాంకు ఖాతాల కుంభకోణం కేసులో నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఎబి) సోమవారం అరెస్టు చేసింది. అంతకు కొద్ది గంటల ముందే... ఆయన బెయిలు కొనసాగింపునకు చేసిన విన్నపాన్ని ఇస్లామాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. జర్దారీ ప్రస్తుతం పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సభ్యుడిగా ఉన్నారు. హైకోర్టు ఉత్తర్వును సుప్రీంకోర్టులో సవాలు చేయనున్నట్టు జర్దారీ లాయర్ తెలిపారు.
2019-06-10 Read Moreఏ మంత్రిపైనైనా అవినీతి ఆరోపణలు వస్తే తక్షణమే తొలగిస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. జగన్ సిఎం అయ్యాక తొలి మంత్రివర్గ సమావేశం సోమవారం సచివాలయంలో జరిగింది. తన ప్రభుత్వంలో మంత్రులు డమ్మీలు కారని, అలాగని పదవికి రెండున్నరేళ్ళు గ్యారంటీ కూడా లేదని జగన్ తేల్చి చెప్పారు. అవినీతి మరక అంటితే ఏ క్షణమైనా తొలగించేలా నిర్ణయాన్ని ప్రకటించారు. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటుపై చర్చ సందర్భంగా జగన్ ఈ హెచ్చరిక చేశారు.
2019-06-10ఇంటర్నెట్ కంపెనీ ‘గూగుల్’కు గత ఏడాది వార్తల ద్వారా వచ్చిన ఆదాయం 4.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 33 వేల కోట్లు). అమెరికా మొత్తం వార్తా సంస్థల డిజిటల్ అడ్వర్టైజ్ మెంట్ ఆదాయానికి (5.1 బిలియన్ డాలర్లు) ఇది దాదాపు సమానం. గూగుల్ న్యూస్, న్యూస్ సెర్చ్ ద్వారా అంత పెద్ద మొత్తంలో సంస్థకు వాణిజ్య ప్రకటనల ఆదాయం వస్తున్నట్టు అమెరికాలోని ‘న్యూస్ మీడియా అలియెన్స్’ కొత్త రిపోర్టులో పేర్కొంది. వివిధ వార్తా సంస్థలు, జర్నలిస్టులు రాసే వార్తల ద్వారా ‘గూగుల్’కు ఆదాయం వస్తుంటే ఆయా సంస్థలు, వ్యక్తులు ఆమేరకు నష్టపోతున్నారు.
2019-06-10నటుడు, దర్శకుడు, రచయిత గిరీష్ కర్నాడ్ (81) సోమవారం మరణించారు. రంగస్థలం నుంచి సినిమా వరకు ప్రత్యేక ముద్ర వేసిన ఈ బహుముఖ ప్రజ్ఞాశాలిని పద్మభూషణ్, జ్ఞానపీఠ్ అవార్డులు వరించాయి. దేశంలోనే పేరెన్నికగన్న మేధావుల్లో ఒకరైన గిరీష్ కర్నాడ్ 1938లో జన్మించారు. 1961లో ఆక్స్ఫర్డ్ మగ్దలెన్ కళాశాలలో చదువుతుండగానే తొలి నాటకం రాశారు. 1970లో కన్నడ సినిమా ‘సంస్కార’తో వెండితెరపై తొలిసారి కనిపించారు. ఆ తర్వాత సంవత్సరమే వంశవృక్షం సినిమాకు దర్శకత్వం వహించారు. ఇటీవల ఏక్తా టైగర్ సినిమా వరకు నటించారు.
2019-06-10జమ్మూ కాశ్మీర్ లోని కథువాలో ఎనిమిదేళ్ళ బాలికను అమానుషంగా చెరిచి చంపిన కేసులో ఆరుగురికి శిక్ష ఖరారైంది. ఈ కేసుపై పఠాన్ కోట్ ప్రత్యేక కోర్టు నిగూఢంగా చేపట్టిన విచారణ జూన్ 3న ముగిసింది. ఏడుగురు నిందితుల్లో ఒక మైనర్ ను వదిలేసి ఆరుగురికి సోమవారం శిక్ష ఖరారు చేశారు. ఓ మైనారిటీ సంచార తెగను తమ ప్రాంతంనుంచి తరిమేసే లక్ష్యంతో నిందితులు నీచమైన నేరానికి పాల్పడ్డారు. ఆ తెగకు చెందిన బాలికను గత ఏడాది జనవరిలో కిడ్నాప్ చేసి గుడిలో బంధించి మత్తులో ముంచి సామూహికంగా అత్యాచారం చేశారు. ఆ తర్వాత చంపేశారు.
2019-06-10 Read Moreతెలంగాణ ఎంసెట్ 2019 పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులు సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగంలో తాడేపల్లిగూడెంకు చెందిన కురిశేటి రవిశ్రీతేజ మొదటి ర్యాంకు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ లోనూ ఇతనికే మొదటి ర్యాంకు రావడం మరింత విశేషం. ఐదో ర్యాంకర్ జి. భానుదత్త, 8వ ర్యాంకర్ గౌరిపెద్ది హితేంద్ర కశ్యప్ కూడా ఏపీ విద్యార్ధులే. టాప్ 10లో మరికొందరు కూడా ఏపీ నేపథ్యం ఉన్నవారే. అటు అగ్రి-ఫార్మసీ విభాగంలోనూ టాప్ 10లో ఐదుగురు ఏపీ విద్యార్ధులే!
2019-06-09ఏపీ నూతన మంత్రివర్గం తొలి సమావేశం సోమవారం ఉదయం జరగనుంది. సామాజిక పింఛను మొత్తాన్ని రూ. 2,250కు, ఆశా వర్కర్ల వేతనాలను రూ. 10,000కు పెంచుతూ ఇప్పటికే ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. రైతు భరోసా పథకం కింద తొలి విడతగా అక్టోబర్లో రూ. 12,500, ఆర్టీసీ విలీనం, ఉద్యోగులకు మధ్యంతర భృతి, మున్సిపల్ కార్మికులకు, హోంగార్డులకు వేతనాలు పెంచడం, కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం రద్దు వంటి ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించనుంది.
2019-06-10మూడేళ్ళ నుంచే పిల్లలను పాఠశాల విద్యలో భాగం చేయాలని జాతీయ విద్యా విధానం 2019 ముసాయిదా సూచించింది. 1వ తరగతికి ముందు అవసరమైన మూడేళ్ళ ‘ప్రీ స్కూలు’ను కూడా పాఠశాల విద్యా వ్యవస్థ పరిధిలోకి తేవాలని కోరింది. విద్యా హక్కును ఒకటో తరగతి (ఆరేళ్ళ వయసు)నుంచి కాకుండా ప్రీ స్కూలు (మూడేళ్ల) నుంచే అమలు చేయాలన్నది ఆ సూచన సారాంశం. దీంతో.. ప్రైవేటు నర్సరీ స్కూళ్ళు, అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న ‘ప్రీ స్కూలు’ విద్యను పాఠశాల విద్యతో సమ్మిళితం చేసే అవకాశం ఉంది.
2019-06-10