శాసన మండలి రద్దుకు పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (పిడిఎఫ్) వ్యతిరేకమని ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు స్పష్టం చేశారు. ఛైర్మన్ పోడియంను మంత్రులే చుట్టుముట్టడం అనాగరికమని, దాడి ఎవరు చేసినా తప్పేనని ఆయన విమర్శించారు. శాసన మండలి ఏర్పాటయ్యాక గత 13 సంవత్సరాల్లో అనేక ఉపయోగకరమైన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందని లక్ష్మణరావు గుర్తు చేశారు. మండలిలో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల తర్వాత ఎక్కువ మంది ఎమ్మెల్సీలు పిడిఎఫ్ నుంచే ఉన్నారు.
2020-01-24‘‘మీకు కోపం వచ్చినప్పుడు తీసేయడానికి ఇదేం చీమిడి కాదు’’ అని పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (పిడిఎఫ్) ఎమ్మెల్సీ వి. బాలసుబ్రహ్మణ్యం ముఖ్యమంత్రిని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. చట్టాలను శాసన మండలి అడ్డుకుంటోందన్న సిఎం వాదనను ఆయన తోసిపుచ్చారు. శాసన మండలికి 20 బిల్లులు వచ్చాయని, ఆంగ్ల మాధ్యమం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని పేర్కొన్నారు. మెజారిటీ కోసం ఏడాది ఆగే ఓపిక లేక అసహనంతో రద్దు చేస్తామంటున్నారని విమర్శించారు.
2020-01-24అమరావతి ప్రాంతంలో ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’కు సంబంధించి మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి. నారాయణ, తాడికొండ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ బెల్లంకొండ నరసింహారావులపై సిఐడి అధికారులు కేసులు నమోదు చేశారు. ఐపిసి 320, 506, 120బి సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కూడా కేసులు నమోదయ్యాయి. తన 99 సెంట్ల అసైన్డ్ భూమిని నరసింహారావు బలవంతంగా రాయించుకున్నారని వెంకటపాలెం మహిళ పోతురాజు బుజ్జి ఫిర్యాదు చేశారు.
2020-01-23కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచాలని ఐదేళ్ళ క్రితం 14వ ఆర్థిక సంఘం సూచించింది. ఆమేరకు పెంచిన కేంద్ర ప్రభుత్వం, గ్రాంట్లలో కోత విధించింది. మొత్తంగా చూస్తే కేంద్రం నుంచి బదలాయింపులు పెద్దగా పెరగలేదు. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం పన్నుల్లో వాటాను 42 శాతం నుంచి తగ్గించాలని సిఫారసు చేసినట్టు సమాచారం. కేంద్రానికి ఆర్థిక ఇబ్బందులను తగ్గించడంకోసం రాష్ట్రాలకు కోత విధించింది. అయితే, ఫలితాల ఆధారిత ప్రోత్సాహకాలను నిర్ణయించిందట!
2020-01-23వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు కొందరు తమ పదవులు పోయినా పర్లేదని ముఖ్యమంత్రి నిర్ణయాలకు మద్ధతు పలుకుతున్నారు. మొన్న శాసనసభలో రాజధాని తరలింపు (వికేంద్రీకరణ) బిల్లుకు మద్ధతు తెలిపిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి.. తన రాజకీయ భవిష్యత్తు ఏమైనా పర్లేదని వ్యాఖ్యానించారు. గురువారం మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్.. శాసన మండలిని రద్దు చేయాలని సిఎంకు సూచించారు. బోస్ మండలి సభ్యుడిగా మంత్రివర్గంలో ఉన్నారు.
2020-01-23శాసన మండలి సూచించిన సవరణలను తిరస్కరిస్తూ ఆంగ్ల మాధ్యమం బిల్లుకు శాసనసభ మరోసారి ఆమోద ముద్ర వేసింది. తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేయకుండా.. రెంటిలో ఇష్టం వచ్చింది ఎంచుకునే అవకాశం తల్లిదండ్రులకు ఇవ్వాలని శాసన మండలి సవరణ సూచించింది. అయితే, ఇలా ఇస్తే నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు నష్టపోతారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం శాసనసభలో చెప్పారు.
2020-01-23ఏపీ ‘మూడు రాజధానుల’ బిల్లును ఓ పెద్ద తప్పుగా ‘ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్’ వ్యాఖ్యానించింది. ఈ నిర్ణయంతో కొన్ని పదుల వేల కోట్ల పెట్టుబడులకు ప్రమాదం ఉందని శుక్రవారం సంపాదకీయంలో పేర్కొంది. శ్రీక్రిష్ణ కమిటీ, బిసిజి నివేదికలు వికేంద్రీకరణకు సూచించాయని, అయితే.. సమాన అభివృద్ధి ప్రయోజనాలను ఈ తుగ్లక్ తరహా నిర్ణయం దూరం చేస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. విశాఖ నుంచి అధికారులు కోర్టుకు హాజరు కావాలంటే 700 కి.మీ. ప్రయాణించాలని ఎత్తిచూపింది.
2020-01-24 Read Moreసమాచార మార్పిడిలో గోప్యతను పెంచడానికి భారత ప్రభుత్వం సెల్ ఫోన్ల కోసం సొంత మెసేజింగ్ వ్యవస్థను తయారు చేస్తోంది. గవర్నమెంట్ ఇన్స్టెంట్ మెసేజింగ్ సర్వీస్ (జి.ఐ.ఎం.ఎస్- జిమ్స్) పేరిట రూపొందుతున్న వ్యవస్థపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రయోగాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలకు తోడు కోరుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ‘జిమ్స్’ను ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు.
2020-01-24భారతీయ మహిళా రాజకీయ నేతలపై సగటున రోజుకు 113 వేధింపుల సందేశాలు ‘ఆన్ లైన్’లో వస్తున్నట్టు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అధ్యయనం వెల్లడించింది. ఆన్ లైన్ భూతాలు (ట్రాల్స్) గ్యాంగ్ రేప్ బెదిరింపుల నుంచి ముస్లిం వ్యతిరేక వేధింపుల వరకు వివిధ రకాల నేరాలకు పాల్పడుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో 95 మంది మహిళా రాజకీయ నేతలకు వచ్చిన 1,14,716 ట్వీట్లను ఆమ్నెస్టీ విశ్లేషించింది. ప్రతి 7 ట్వీట్లలో ఒకటి వేధింపులకు సంబంధించినదేనని తేల్చింది.
2020-01-23బుధవారం అసెంబ్లీలో ప్రతిపక్ష టీడీపీ సభ్యులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని సిఎం మండిపడన కొద్దిసేపటికే... మండలిలో మంత్రులు బెంచీ, కుర్చీలు ఎక్కారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఛైర్మన్ పోడియం ముందు కుర్చీ ఎక్కితే... టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఏకంగా సిబ్బంది రాసుకునే బెంచి ఎక్కి నిల్చున్నారు. రాజధాని తరలింపునకు ఉద్ధేశించిన ‘వికేంద్రీకరణ’ బిల్లును మండలి దాటించేందుకు మంత్రులు ఛైర్మన్ షరీఫ్ పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెట్టారు.
2020-01-23