వైఎస్ వివేకానందరెడ్డి హత్యేనని కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ నిర్ధారించారు. ఆయనకు తలపై మూడు గాయాలు, ఇతర శరీర భాగాలపై మరో రెండు గాయాలు ఉన్నట్టు చెప్పారు. ఏదో ఒక పదునైన ఆయుధంతో దాడి చేశారని పేర్కొన్నారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం ఎస్పీ హత్యను నిర్ధారించారు. రాత్రి 11.30, ఉదయం 5.30 గంటల మధ్య నేరం జరిగి ఉంటుందని ఎస్సీ పేర్కొన్నారు. ఈ నిర్ధారణ తర్వాత ‘అనుమానాస్పద మరణం’ కేసును హత్యకేసుగా మార్చారు.
2019-03-15ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించారు. కడప జిల్లా పులివెందులలోని నివాసంలో వివేకా శుక్రవారం తెల్లవారుజామున రక్త గాయాలతో పడి ఉన్నట్టు ఆయన పిఎ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివేకా ముఖం, తల, చేతులకు రక్త గాయాలు ఉన్నాయి. దీంతో పోలీసులు ‘అనుమానాస్పద మరణం’గా కేసు నమోదు చేశారు. వివేకానందరెడ్డిపై ఎవరో దాడి చేసి హత్య చేసి ఉంటారనే అనుమానాన్ని ఆయన సమీప బంధువు, మాజీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి వ్యక్తం చేశారు.
2019-03-15కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, ఆమె భర్త కృష్ణయ్య తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి వచ్చిన ఆ దంపతులు గురువారం అర్ధరాత్రి తర్వాత పసుపు కండువాలు కప్పుకొన్నారు. మరో మూడు రోజుల్లో ఎన్నికల నోటిపికేషన్ వెలువడనుండటంతో చేరికలు ఊపందుకున్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన ఈ కేంద్ర మాజీ మంత్రి తిరుపతి లోక్ సభ స్థానం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు.
2019-03-15తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్ధుల తొలి జాబితాలో కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. 126 సీట్లలో 25.40 శాతం (32 సీట్లు) ఆ వర్గానికి చెందిన అభ్యర్ధులకే దక్కాయి. తర్వాత స్థానాల్లో రెడ్డి సామాజికవర్గానికి 21 సీట్లు (16.67 శాతం), కాపులకు 13 సీట్లు (10.32 శాతం) లభించాయి. ఈ మూడు వర్గాలకు కలిపి 52.40 శాతం సీట్లు కేటాయించగా... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు అగ్రవర్ణాల్లోని ఇతర కులాలు అన్నిటికీ కలిపి మిగిలిన 47.6 శాతం సీట్లు కేటాయించారు.
2019-03-14ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంనుంచి పోటీ చేయడం ఖాయమైంది. గురువారం రాత్రి చంద్రబాబు ప్రకటించిన 126 మంది అసెంబ్లీ అభ్యర్ధుల జాబితాలో లోకేష్ పేరు ఉంది. చంద్రబాబు మళ్ళీ కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు. లోకేష్ పేరు ముందే ఖరారు చేయడంతో.. జాబితా ప్రకటనకు ముందే ఆయన గురువారం సాయంత్రం మంగళగిరి నేతలను కలసి మద్ధతు కోరారు.
2019-03-142019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకోసం అధికార తెలుగుదేశం పార్టీ 126 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో అభ్యర్ధుల పేర్లు ఖరారు చేసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం రాత్రి 11.00 గంటల తర్వాత జాబితాను ప్రకటించారు. టీడీపీ జాబితాలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు చంద్రబాబు చెప్పారు. మంత్రులు కెఇ క్రిష్ణమూర్తి, పరిటాల సునీతల స్థానాల్లో వారి కుమారులకు సీట్లు ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. 150 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్టు చంద్రబాబు చెప్పారు.
2019-03-14అమెరికా రక్షణ కేటాయింపులను 5 శాతం పెంచడానికి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. దీంతో 2020 ఆర్థిక సంవత్సరంలో (2019 అక్టోబర్ నుంచి 2020 సెప్టెంబర్ వరకు) రక్షణ బడ్జెట్ 750 బిలియన్ డాలర్లకు చేరనుంది. దౌత్యానికి 23 శాతం తగ్గించి వివాదాస్పద సరిహద్దు గోడ నిర్మాణానికి నిధులు కేటాయించే ప్రతిపాదనలపై కాంగ్రెస్ లో వ్యతిరేకత రావచ్చు. ఒకవేళ ట్రంప్ ప్రతిపాదనలు యధాతథంగా ఆమోదం పొందితే... పెంటగాన్ కు 718 బిలియన్ డాలర్లు, అణ్వాయుధ ఇంథనంకోసం 32 బిలియన్ డాలర్లు వెచ్చిస్తారు.
2019-03-14 Read Moreజనసేన పార్టీ తొలి జాబితాలో నాలుగు లోక్ సభ స్థానాలకు, 32 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం రాత్రి ప్రకటించారు. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ (తెనాలి), టీడీపీ నుంచి చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు (ప్రత్తిపాడు), పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ (గుంటూరు వెస్ట్), బీజేపీ నుంచి చేరిన ఆకుల సత్యనారాయణ (రాజమండ్రి లోక్ సభ) పేర్లు తొలి జాబితాలో ఉన్నాయి. జాబితాలోని 8 మంది పార్టీకి పూర్తిగా కొత్తవారని, వారి దరఖాస్తులను పరిశీలించి అవకాశం కల్పించామని పార్టీ ప్రకటనలో తెలిపారు.
2019-03-14 Read Moreఉమ్మడి ఆస్తుల్లో వాటా కింద తెలంగాణ నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయలు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. కార్పొరేషన్లు, భూములు, సచివాలయం తదితర ఆస్తులను న్యాయంగా పంపిణీ చేస్తే అంత మొత్తం వస్తాయని తమ అధికారులు లెక్క కట్టారని పేర్కొన్నారు. ఆస్తుల్లో న్యాయబద్ధంగా రావలసిన వాటాను ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం, రాజధానికి రూ. 500 కోట్లు ఇద్దామనుకున్నామంటూ అవమానకరంగా వ్యవహరించిందని చంద్రబాబు విమర్శించారు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం కూడా ఆవైపే ఉందన్నారు.
2019-03-14‘‘మాట్లాడితే మాది ధనిక రాష్ట్రం అటారు. ఎక్కడినుంచి వచ్చింది ధనిక రాష్ట్రం. మీరు కష్టపడి సంపాదించారా? నేను కష్టపడ్డాను. సమైఖ్య రాష్ట్రంలో అందరూ శ్రమపడ్డారు. ఒక్క మాట ఎప్పుడైనా చెప్పారా? తెలంగాణను ధనిక రాష్ట్రంగా చేసిందెవరు? మనం చేశాం’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. బుధవారం అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ సిఎం కేసీఆర్ పై మండిపడ్డారు. తాను ప్రపంచమంతా తిరిగి హైదరాబాదుకు కంపెనీలను రప్పించానని, అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్పారు.
2019-03-14