అమెరికా నుండి ఆంక్షల బెదిరింపు ఉన్నప్పటికీ రష్యా నుండి క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసే హక్కును విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సమర్థించారు. అమెరికా పర్యటనలో ఉన్న జైశంకర్, ఆ దేశ మంత్రి మైక్ పాంపీని కలవడానికి ముందు ఈ అంశంపై విలేకరులతో మాట్లాడారు. "మేము ఏం కొనుగోలు చేస్తాం, ఎవరినుంచి కొనుగోలు చేస్తాం అన్నది మా సార్వభౌమ హక్కు. అమెరికా నుంచి ఏం కొనాలో ఏం కొనగూడదో మరో దేశం చెబితే మాకు ఇష్టం ఉండదు. అలాగే రష్యా నుంచి ఏం కొనాలో, కొనగూడదో మరే దేశం చెప్పినా మాకు ఇష్టం ఉండదు’’ అని జైశంకర్ ఉద్ఘాటించారు.
2019-10-01 Read Moreకేంద్రం ప్రభుత్వ ఆర్థిక, కార్మిక విధానాలకు నిరసనగా 10 కేంద్ర కార్మిక సంఘాలు, సమాఖ్యలు జనవరి 8న జాతీయ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆ రోజు 20 కోట్లకు పైగా కార్మికులు సమ్మె చేయనున్నట్లు యూనియన్లు సోమవారం తెలిపాయి. మోడీ ప్రభుత్వ విధానాలను "కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, దేశ వ్యతిరేక" విధానాలుగా ఆయా సంఘాలు పేర్కొన్నాయి. ఆర్థిక మందగమనం ప్రతికూల ప్రభావాలను అసంఘటిత, వ్యవస్థీకృత రంగాలలోని కార్మికులు పెద్ద ఎత్తున అనుభవిస్తున్నారని సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
2019-10-01 Read Moreఅత్యాచారం కేసులో అరెస్టయ్యాక లక్నోలోని ఆసుపత్రిలో చేరిన కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్ ఈ రోజు సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. 73 ఏళ్ల ఈ నిందితుడి బెయిల్ పిటిషన్ ఈ రోజే తిరస్కరణకు గురైంది. అయితే, ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత రాత్రి ఎక్కడ గడుపుతారనేదానిపై స్పష్టత లేదు. సెప్టెంబర్ 20 న అరెస్టు అయిన మూడు రోజులకే అధిక రక్తపోటు, ఛాతీ నొప్పి వంటి ఫిర్యాదులతో ఆయన ఆసుపత్రిలో చేరారు. లక్నోలోని ఎస్జిపిజిఐ ఆసుపత్రిలోని కార్డియాలజీ వార్డులో 8 రోజులు గడిపిన తరువాత ఈరోజు విడుదలయ్యారు.
2019-09-30 Read Moreతెలంగాణ తెలుగుదేశం యువజన విభాగం అధ్యక్షుడు వీరేందర్ గౌడ్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన అక్టోబర్ 3వ తేదీన బిజెపిలో చేరనున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడే ఈ వీరేందర్ గౌడ్. తెలంగాణలో టీడీపీ బలహీనపడటంతో ఆ పార్టీ నేతలు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారు.
2019-09-30ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ నివసించినా భారత అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని ఐఐటి-మద్రాసు గ్రాడ్యుయేషన్ విద్యార్థులను ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. వారి పని, ఆవిష్కరణ, పరిశోధన ఇతర భారతీయులకు ఎలా సహాయపడతాయో ఆలోచించాలని సూచించారు. సోమవారం ఐఐటి-మద్రాస్ క్యాంపస్‌లో జరిగిన 56 వ కాన్వొకేషన్ వేడుకలో మాట్లాడిన ప్రధాని "ఇది మీ సామాజిక బాధ్యత మాత్రమే కాదు, ఇది అపారమైన వ్యాపార భావాన్ని కూడా కలిగిస్తుంది" అని చెప్పారు.
2019-09-30 Read Moreభారత వైమానిక దళం వెస్ట్రన్ ఫ్రంట్ పరిణామాలను పర్యవేక్షిస్తోందని, ప్రభుత్వం నిర్దేశిస్తే బాలకోట్ తరహా దాడులు చేయడానికి సిద్ధంగా ఉందని ఎయిర్ ఫోర్స్ కొత్త అధిపతి ఆర్.కె.ఎస్ భదౌరియా చెప్పారు. సోమవారం ఐఎఎఫ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఈ విషయం మాట్లాడారు. 26 రకాల విమానాలలో సుమారు 4,250 గంటల ఎగిరిన అనుభవం ఉన్న భదౌరియా, 36 రాఫెల్ జెట్ల సేకరణ కోసం జరిగిన వాణిజ్య చర్చలకు నాయకత్వం వహించారు. ఈ ఫ్రెంచ్ యుద్ధ విమానాలతో ఎయిర్ ఫోర్స్ సామర్ధ్యం మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు.
2019-09-30 Read Moreశివసేన అధినేతలైన థాకరేల కుటుంబం నుంచి తొలిసారిగా ఒకరు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే మనుమడు, ప్రస్తుత పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వోర్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. పార్లమెంటు ఎన్నికలు ముగియగానే ఆదిత్య చేపట్టిన ‘‘జన్ ఆశీర్వాద్ యాత్ర’’తో శివసేన ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రొజెక్ట్ చేస్తున్నదన్న చర్చ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఆదిత్య సోమవారం తన అభ్యర్ధిత్వాన్ని స్వయంగా ప్రకటించడం గమనార్హం.
2019-09-30 Read Moreప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ నిజమైన జిడిపి వృద్ధి రేటు 5.2 శాతానికి పరిమితమయ్యే అవకాశం ఉందని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ తెలిపింది. వ్యాపార విశ్వాసంలో క్షీణత, అణగారిన డిమాండ్, ఆర్థిక రంగంలో ఆందోళనలు పెట్టుబడులను దెబ్బతీస్తున్నట్టు పేర్కొంది. ‘‘వినియోగదారుల, వ్యాపారుల విశ్వాసం తక్కువగా ఉంది. జూలైలో కార్ల అమ్మకాలు 30 శాతం పడిపోయాయి. ఆర్థిక రంగంలో సమస్యల వల్ల రుణాల వృద్ధి రేటు కుంటుపడింది’’ అని ఇఐయు తన తాజా నివేదికలో తెలిపింది.
2019-09-30 Read Moreప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణం బడ్జెట్లో నిర్దేశించుకున్న ప్రకారం రూ. 7.1 లక్షల కోట్ల పరిధిలోనే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది. సెప్టెంబరు 30 వరకు గడచిన ఆరు నెలల్లో కేంద్ర ప్రభుత్వం రూ. 4.42 లక్షల కోట్ల (62 శాతం) మేరకు రుణాలు తీసుకుంది. బడ్జెట్ లక్ష్యంలో మిగిలిన రూ .2.68 లక్షల కోట్లు వచ్చే ఆరు నెలల్లో తీసుకుంటామని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తెలిపారు. కార్పొరేట్ పన్ను తగ్గించిన కారణంగా ప్రభుత్వానికి తగ్గనున్న రూ. 1.45 లక్షల కోట్ల ఆదాయంపై స్పష్టత రావలసి ఉంది.
2019-09-30 Read Moreఆగస్టు చివరి నాటికి (ఐదు నెలల్లో) దేశ ఆర్థిక లోటు రూ .5.54 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది 2019-20 బడ్జెట్ అంచనాలో 78.7 శాతంగా ఉంది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సిజిఎ) సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఆగస్టు 31 నాటికి ఆర్థిక లోటు లేదా వ్యయం, ఆదాయాల మధ్య అంతరం రూ .5,53,840 కోట్లు. 2018-19 బడ్జెట్ అంచనా (బీఈ) లో ఆగస్టు చివరికి నమోదైన లోటు 86.5 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటును రూ. 7.03 లక్షల కోట్లుగా ప్రభుత్వం నిర్దేశించుకుంది.
2019-09-30 Read More