2019 ప్రథమార్దంలో ప్రపంచ వాణిజ్య పరిమాణం కేవలం 1 శాతం వృద్ధి చెందిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) తెలిపింది. 2012 నుంచి ఇదే బలహీనమైన స్థాయి అని మంగళవారం విడుదల చేసిన ద్వైవార్షిక ‘‘వరల్డ్ ఎకనామిక్ ఔట్ లుక్’’లో పేర్కొంది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం కారణంగా ప్రపంచ జీడీపీ వృద్ధి రేటు 0.8 శాతం తగ్గుతోందని అంచనా వేసింది. తయారీ రంగం, ప్రపంచ వాణిజ్యంలో క్షీణత మొత్తంగా ప్రపంచ జీడీపీపై ప్రభావం చూపుతోందని ఐఎంఎఫ్ పేర్కొంది.
2019-10-152019 కేలండర్ సంవత్సరంలో ప్రపంచ జీడీపీ వృద్ధి రేటు కేవలం 3 శాతమేనని ఐఎంఎఫ్ అంచనా వేసింది. అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం, అనేక దేశాల్లో పారిశ్రామిక ఉత్పత్తి తగ్గడం ఈ పరిస్థితికి కారణాలుగా పేర్కొంది. ఐఎంఎఫ్ తన ద్వివార్షిక ఎకనామిక్ ఔట్ లుక్ నివేదికను మంగళవారం విడుదల చేసింది. 2018లో ప్రపంచ జీడీపీ 3.6 శాతం వృద్ధి చెందగా ఈ ఏడాది మందగించి 2020లో మళ్ళీ కొంత పుంజుకుంటుందని ఆ నివేదికలో అంచనా వేసింది.
2019-10-15అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) భారత ఆర్థిక వృద్ధి అంచనాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6.1 శాతానికి తగ్గించింది. జూలైలో అంచనా 7 శాతం నుంచి బాగా తగ్గించింది. దేశీయ డిమాండ్ గత అంచనా కంటే చాలా బలహీనంగా ఉందని మంగళవారం విడుదల చేసిన "వరల్డ్ ఎకనామిక్ ఔట్ లుక్"లో పేర్కొంది. గత వారం ప్రపంచ బ్యాంకు కూడా.. 2019-20 భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాను 6.1%కి తగ్గించింది. 2020-21లో జిడిపి వృద్ధి అంచనాను ఐఎంఎఫ్ 7.2 శాతానికి తగ్గించింది.
2019-10-15 Read Moreతూర్పు గోదావరి జిల్లాలో ఆంధ్రజ్యోతి తొండంగి అర్భన్ విలేకరిగా పని చేస్తున్న కాతా సత్యనారాయణ మంగళవారం హత్యకు గురయ్యారు. తుని మండలం ఎస్ అన్నవరం వేంకటేశ్వర స్వామి గుడి సమీపంలో గుర్తు తెలియని దుండగులు కత్తితో నరికి పరారయ్యారు. సత్యనారాయణ ఇంటికి సమీపంలోనే ఈ హత్య జరిగింది.
2019-10-15అమెరికా కాన్సుల్ జనరల్ (హైదరాబాద్) జోయెల్ రీఫ్మాన్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించి అక్కడి అధికారులతో చర్చించారు. నగర పాలక సంస్థ చేపట్టిన కార్యకలాపాలను కమిషనర్ సృజన కాన్సుల్ జనరల్ బృందానికి వివరించారు.
2019-10-15ఒంగోలు ‘ట్రిపుల్ ఐటి’లో బొల్లికొండ లహరి అనే విద్యార్థిని మంగళవారం కళాశాల భవనంపైనుంచి దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. లహరి తుంటి ఎముక, వెన్ను, తలకు తీవ్ర గాయాలయ్యాయని ప్రాథమిక సమాచారం. సెలవులకు ఇంటికి వెళ్లి సోమవారమే తిరిగి వచ్చిన లహరి, ఇంతలోనే ఆత్మహత్యకు ప్రయత్నించడానికి కారణమేమిటో తెలియరాలేదు. కృష్ణ జిల్లా విస్సన్నపేటకు చెందిన లహరి ఒంగోలు ట్రిపుల్ ఐటిలో మొదటి సంవత్సరం చదువుతోంది.
2019-10-15వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆంధ్రప్రదేశ్ పోలీసు డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ ఉద్ఘాటించారు. కేసులో విచారణ సమర్థవంతంగా, సక్రమంగా జరుగుతోందన్నారు. మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో పాల్గొన్న డీజీపీ, రాజకీయ నాయకులు ఆరోపణలను తాము పట్టించుకోబోమని, పోలీసు శాఖ తన పని తాను చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావం బాగా తగ్గిందని అభిప్రాయపడ్డారు.
2019-10-15విద్యుత్ పంపిణీ సంస్థలకు ఇతర ప్రభుత్వ శాఖలే భారీగా బిల్లులు బకాయి పెట్టాయి. జలవనరుల శాఖ రూ. 2 వేల కోట్లు, పంచాయితీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి రూ. 500 కోట్లు బకాయి ఉన్నట్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రహ్మణ్యం వెల్లడించారు. భారీగా బకాయి పడ్డ శాఖల్లో పురపాలక, వైద్య-ఆరోగ్య విభాగాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు అందుబాటులో ఉన్న జనరల్ ఫండ్ నుంచి బకాయిలు చెల్లించాలని సీఎస్ పంచాయితీరాజ్-గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు.
2019-10-15పంజాబ్, మహారాష్ట్ర కోఆపరేటివ్ (పిఎంసి) బ్యాంకులో రూ. 90 లక్షలు డిపాజిట్ చేసిన 51 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ముంబై సబర్బన్ ఓషివారా నివాసి గులాటి జెట్ ఎయిర్‌వేస్ గ్రౌండింగ్ తరువాత ఉద్యోగం కోల్పోయారు. ఈ స్థితిలో గులాటికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కుటుంబం రూ. 90 లక్షల మేరకు డిపాజిట్ చేసిన పిఎంసి బ్యాంకుపై రిజర్వు బ్యాంకు ఆంక్షలు విధించింది. జీవిత కాలం కూడబెట్టిన రూ. 90 లక్షలను విత్ డ్రా చేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఒత్తిడికి గురైన గులాటికి గుండె పోటు వచ్చింది.
2019-10-15ఆర్టీసీ సమస్య యాజమాన్యం, కార్మికుల మధ్య మాత్రమే కాదని... అది ప్రజల సమస్యగా మారిందని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. సుమారు 4 వేల బస్సులు నడకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేసింది. ఈ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేసింది. సమ్మెపై దాఖలైన పిటిషన్ ను హైకోర్టు విచారణకు చేపట్టింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్న ప్రభుత్వాన్ని...‘మరి విద్యా సంస్థలకు సెలవులు ఎందుకు పొడిగించారు’ అని ప్రశ్నించింది.
2019-10-15