ప్రపంచ కప్ క్రికెట్ 2019 ఫైనల్ పోటీలో ఫలితాన్ని తేల్చడానికి నిర్వహించిన సూపర్ ఓవర్ సెషన్లో ఇంగ్లండ్ జట్టు 15 పరుగులు సాధించింది. బెన్ స్టోక్స్, బట్లర్ బ్యాటింగ్ కు దిగగా న్యూజీలాండ్ తరఫున జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ చేశాడు. రెండు బౌండరీలతో 6 బంతుల్లో 15 సాధించిన ఇంగ్లండ్ జట్టు న్యూజీలాండ్ జట్టుకు 16 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూజీలాండ్ నుంచి గుప్తిల్, నీషామ్ బ్యాటింగ్ కు దిగారు.
2019-07-14నరాలు తెగే ఉత్కంఠ నడుమ మూడుగంటలకు పైగా జరిగిన వింబుల్డన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్ పోటీలో డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ డి.జకోవిక్ విజయం సాధించాడు. మరో దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్ పైన 7-6, 1-6, 7-6, 4-6, 13-12 స్కోరుతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేశాడు. నాలుగు సెట్లలో చెరి రెండు గెలిచిన దిగ్గజాలు ఫలితం తేల్చుకోవడానికి ఆడిన ఐదో సెట్ గంటన్నరపాటు సాగింది. ఇంతకు ముందు జకోవిక్ 2011, 2014, 2015, 2018లలో వింబుల్డన్ టైటిల్ చేజిక్కించుకున్నాడు.
2019-07-14క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్.. రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ కప్ అందుకోవాలని ఆతిథ్య జట్టు విశ్వప్రయత్నాలు చేసింది. 2019 ప్రపంచకప్ ఫైనల్లో పోటీపడిన న్యూజీలాండ్, ఇంగ్లండ్ సమానంగా పరుగులు చేయడంతో మ్యాచ్ ‘టై’ అయింది. ఇక సూపర్ ఓవర్ తో ఫలితం తేలనుంది. తొలుత 50 ఓవర్లు బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు సాధించగా.. హోరాహోరీగా పోరాడి ఇంగ్లండ్ 50 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి అన్నే పరుగులు చేసింది.
2019-07-14వింబుల్డన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్ పోరు అసాధారణంగా మారింది. నాలుగు సెట్లలో రెండేసి ఖాతాలో వేసుకున్న రోజర్ ఫెదరర్, జకోవిక్ ఐదో సెట్లో పైచేయికోసం హోరా హోరీ పోరాడుతున్నారు. గేమ్ మొదలై గంటన్నర గడచినా ఫలితం తేలలేదు. ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ మొత్తం 56 నిమిషాల్లో తేలిపోగా, జకోవిక్-ఫెదరర్ మధ్య ఐదో సెట్ అంతకంటే చాలా ఎక్కువ సమయం పట్టడం విశేషం. అప్పటికి చెరో 11 పాయింట్లు సాధించి ఉత్కంఠను మరింత పెంచేశారు.
2019-07-14ప్రపంచ కప్ క్రికెట్ 2019 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ చరమాంకానికి చేరింది. మ్యాచ్ ముగియడానికి ఇంకా 18 బంతులే మిగిలి ఉన్నాయి. ఇంగ్లండ్ చేతిలో 4 వికెట్లు ఉండగా 34 పరుగులు చేయవలసి ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు మాత్రమే చేయగా..ఈజీ ఛేజింగ్ అనుకున్న ఇంగ్లండ్ ఆరంభంలోనే తడబడింది. 100 పరుగులకు నాలుగు వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడినా తర్వాత నిలదొక్కుకుంది. తర్వాత రెండు వికెట్లకు వందకు పైగా పరుగులు సాధించింది.
2019-07-14ఓవైపు క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్.. మరోవైపు వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ మెన్స్ ఫైనల్ మ్యాచ్. రోజర్ ఫెదరర్, జకోవిక్ మధ్య ఆదివారం జరుగుతున్న పోటీలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఫెదరర్-జకోవిక్ వరుస సెట్లలో 6-7, 6-1, 6-7, 6-4 స్కోరుతో చెరో రెండు సెట్లు గెలిచారు. దీంతో ఐదో సెట్లో విజయం ఎవరిదన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
2019-07-14బీజేపీకి పూర్వరూపమైన ‘జనసంఘ్’లో పని చేసిన ఓ గత తరం కార్యకర్తకు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాళ్ళు కడిగి మరీ పార్టీ సభ్యత్వం ఇచ్చారు. ఆదివారం విజయవాడ పర్యటనకు వచ్చిన శివరాజ్ గోడుబర్తి శ్రీనివాసరావు అనే జనసంఘ్ కార్యకర్త ఇంటికి వెళ్లారు. అక్కడ శ్రీనివాసరావు దంపతుల కాళ్ళు కడిగిన సింగ్, బీజేపీ సభ్యత్వ డ్రైవ్ లో భాగంగా జనంసంఘీయులకు సభ్యత్వం అందజేశారు.
2019-07-14క్రికెట్ ప్రపంచ కప్ 2019 ఫైనల్లో న్యూజీలాండ్ జట్టును తక్కువ స్కోరు (241)కే ఔట్ చేసిన ఉత్సాహం ఇంగ్లండ్ జట్టులో ఎక్కువసేపు నిలువలేదు. బ్యాటింగ్ ప్రారంభించిన కొద్దిసేపటికే వికెట్లు రాలడం ప్రారంభమైంది. 86 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 24 ఓవర్లలో అతి తక్కువ స్కోరుకే వికెట్లు పడిపోవడంతో ఇంగ్లండ్ జట్టులో ఆందోళన మొదలైంది.
2019-07-14వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం విజయవాడలో జరిగిన బీజేపీ కృష్ణా జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలకు భవిష్యత్తు లేదని, తెలుగుదేశం పార్టీ కూడా కాంగ్రెస్ లా మారి తన మిత్రులను బిజెపికి వదిలేసిందని శివరాజ్ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్రంలో సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా బలం పుంజుకుంటోందని చెప్పారు.
2019-07-14కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ సిఎంగా ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు చేసిన ‘ధర్మపోరాట’ దీక్షలను కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తప్పు పట్టారు. ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలో చేరిన చౌదరి ఆదివారం విజయవాడ వచ్చారు. అప్పటి తమ నేత చేసినవి ’అధర్మ పోరాట’ దీక్షలు అని విమర్శించారు. స్వాతంత్రం వచ్చాక ఒక రాష్ట్రానికి ఏ కేంద్ర ప్రభుత్వమూ చేయనంతగా.. గత నాలుగేళ్ళలో కేంద్రం సాయం చేసిందని సుజనా ఉద్ఘాటించారు.
2019-07-14