రశీదులు లేకుండా బంగారాన్ని కొనుగోలు చేసినవారి కోసం ఓ సరికొత్త "క్షమాభిక్ష" పథకాన్ని కేంద్రం త్వరలో ప్రకటించబోతున్నట్టు సమాచారం. నల్ల ధనాన్ని చాలా మంది పెద్ద మొత్తంలో బంగారం రూపంలో దాచుకున్నట్టు చెబుతున్న ప్రభుత్వం, అలాంటి బంగారం నిల్వల విలువపై 30% పన్ను వసూలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. విద్యా సుంకంతో కలిపి పన్ను మొత్తం 33% కావచ్చు. నల్ల ధనాన్ని బంగారంపై పెట్టుబడిగా పెట్టిన వాళ్లు ఈ పథకం ద్వారా పునీతులు కావాలని కేంద్రం సూచిస్తోంది.
2019-10-31 Read Moreట్విట్టర్లో రాజకీయ ప్రకటనలను నిషేధిస్తున్నట్టు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాక్ డోర్సే బుధవారం ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కొత్త విధానం నవంబర్ 22 నుంచి అమల్లోకి వస్తుంది. ట్విట్టర్ తన రాజకీయ వాణిజ్య ప్రకటనల విధానాన్ని కొన్ని వారాల్లో ప్రచురించనుంది.
2019-10-31ప్రపంచంలోనే అతిపెద్ద నీటి నియంత్రణ ప్రాజెక్టు, అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం.. త్రీ గోర్జెస్ ప్రాజెక్టు. సెంట్రల్ చైనా లోని హుబీ ప్రావిన్స్ లో నిర్మించిన ఈ డ్యాం ఇప్పుడు పూర్తి స్థాయి నీటి మట్టంతో కళకళలాడుతోంది. రిజర్వాయర్ వెనుక భాగంలో కొండల మధ్యగా సాగుతున్న పడవలను పై చిత్రంలో చూడవచ్చు. త్రీ గోర్జెస్ ప్రాజెక్టులో.. జల రవాణా అభివృద్ధి కూడా ఓ ముఖ్యమైన లక్ష్యం.
2019-10-31జమ్మూ - కాశ్మీర్ రాష్ట్రానికి ఉన్న స్వయం ప్రతిపత్తిని ఉపసంహరించి.. పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను కూడా తొలగించి.. రాష్ట్రాన్ని రెండుగా విభజించిన కేంద్ర ప్రభుత్వం, నేటి నుంచి నేరుగా పరిపాలన సాగించనుంది. అసెంబ్లీ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ - కాశ్మీర్, అసెంబ్లీ రహిత కేంద్ర పాలిత ప్రాంతంగా లడక్ నేటి నుంచి ఉనికిలోకి వచ్చాయి. కాశ్మీర్ అసెంబ్లీ ముందే రద్దయినా లోక్ సభతో పాటు ఎన్నికలు నిర్వహించకుండా వ్యూహాత్మకంగా ఎన్నికల తర్వాత ఆర్టికల్ 370ని రద్దు చేసి ఏకంగా కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం వివాదాస్పదమైంది.
2019-10-312019లో ప్రపంచ ఐటీ వ్యయంలో పెరుగుదల కేవలం 0.4 శాతమేనని గార్టనర్ సంస్థ అంచనా వేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ప్రపంచ వ్యాప్తంగా చేసే వ్యయం ఈ ఏడాది 3.7 ట్రిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. 2018తో పోలిస్తే పెరిగింది కేవలం 0.4%. ఇప్పటి వరకు ఇదే అతి తక్కువ వృద్ధి రేటు. అయితే, 2019 మందగమనం తర్వాత 2020లో వ్యయం 3.7% పెరుగుతుందని గార్టనర్ అంచనా వేసింది.
2019-10-31ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం జరగదని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో తమలో కసి పెరిగిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని చెప్పారు. ఆర్టీసీ విలీనం విషయంలో ‘ఏపీలో ఏ మన్నూ జరగలేద’ని గత వారం కేసీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో ఏపీ ప్రభుత్వం విలీన ప్రక్రియపై ఓ కమిటీని అదే రోజు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ‘‘వ్యవస్థలన్నీ ప్రైవేటుపరం అవుతున్న తరుణంలో ఒక కార్పొరేషన్ ను ప్రభుత్వంలో విలీనం చేయడం గొప్ప నిర్ణయం, మొండి నిర్ణయం. కేసీఆర్ వ్యాఖ్యలు మాలో కసిని పెంచాయి’’ అని నాని చెప్పారు.
2019-10-30ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసే మీడియా సంస్థలపై కేసులు పెట్టేందుకు సంబంధిత శాఖల అధికారులకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. ప్రభుత్వం, అధికారుల ప్రతిష్ఠకు భంగం కలిగించే ఉద్ధేశంతో పత్రికలు, టీవీ ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై స్పందించాలని నిర్దేశించింది. ఈమేరకు జీవో ఆర్.టి. నెం. 2430ని ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి టి. విజయకుమార్ రెడ్డి (ఐ&పిఆర్) జారీ చేశారు. 2007లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జారీ చేసిన జీవో ఆర్.టి. నెం. 938ను ఇందులో ప్రస్తావించారు.
2019-10-30ప్రతిపక్షాల ఆరోపణలను తేలిగ్గా తీసుకోవద్దని, ధాటిగా బదులివ్వాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహచర మంత్రులకు సూచించారు. బుధవారం అమరావతి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం నుంచి అధికారులు నిష్క్రమించిన తర్వాత రాజకీయ అంశాలపై చర్చించారు. ప్రతి మంగళ, బుధవారాల్లో మంత్రులు సచివాలయంలో ఉండాలని సిఎం స్పష్టం చేశారు. ఇన్ఛార్జి మంత్రులు తమకు కేటాయించిన జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని జగన్ సూచించారు.
2019-10-30వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గజదొంగల్లా, పందికొక్కుల్లా ఇసుకను దోచుకుంటున్నారంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇసుక సంక్షోభంతో నిర్మాణ రంగం నిలిచిపోయి కార్మికులు కొందరు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో, ప్రభుత్వ విధానానికి నిరసనగా లోకేష్ బుధవారం గుంటూరులో ఒక రోజు దీక్ష చేపట్టారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా గత ప్రభుత్వం అని తమపైనే విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
2019-10-30రాష్ట్ర ప్రభుత్వ ఇసుక విధానానికి నిరసనగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన దీక్షను మంత్రి శ్రీకాంత్ రెడ్డి ఎగతాళి చేశారు. బుధవారం మంత్రివర్గ సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడుతూ... మాజీ సీఎం చంద్రబాబును ఉద్ధేశించి ‘‘గతంలో నీ కొడుకు ఎలా దోచుకున్నాడో.. ఆయన శరీరం చూస్తేనే తెలుస్తుంది. ఈరోజు డైటింగ్ కార్యక్రమంలా దీక్ష పెట్టాడు’’ అని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో కూడా టీడీపీ పార్లమెంటు సభ్యులు నలుగురు ‘హోదా రాదు... ఆరోగ్యంకోసం దీక్షలో కూర్చుందాం’ అన్నారని గుర్తు చేశారు.
2019-10-30