ఏపీకి కీలకమైన పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 89వ సారి వర్చువల్ రివ్వూ చేశారు. సోమవారం మంత్రివర్గ సమావేశం అనంతరం చేపట్టిన ఈ సమీక్షలో.. ఇప్పటికి ప్రాజెక్టు నిర్మాణం 66.36 శాతం పూర్తయినట్టు అధికారులు తెలిపారు. కాంక్రీట్ పనులు 65.30 శాతం, తవ్వకం పనులు 82.60 శతం, కుడి ప్రధాన కాలువ 90.29 శాతం, ఎడమ ప్రధాన కాలువ 68.74 శాతం పూర్తయినట్టు వివరించారు. ఎగువ కాఫర్ డ్యామ్ పనులు 25.73 శాతం, దిగువ కాఫర్ డ్యామ్ పనులు 10.17 శాతం పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.
2019-02-25 Read More‘‘శాంతికి ఓ అవకాశం ఇవ్వండి’’ అని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో కొద్ది రోజుల క్రితం జరిగిన ఉగ్రవాద ఆత్మహుతి దాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఇమ్రాన్ ‘‘పఠాన్ కొడుకు’’ అయితే ఉగ్రవాద దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని మోదీ చేసిన సవాలుకు పాకిస్తాన్ ప్రధాని స్పందించారు. చర్య తీసుకోవడానికి అవసరమైన సమాచారం ఇస్తే వెంటనే స్పందిస్తానని ఇమ్రాన్ చెప్పారు.
2019-02-25 Read Moreవచ్చే లోక్ సభ ఎన్నికల్లో యూపీలో కలసి పోటీ చేయనున్నట్టు ఇంతకు ముందే ప్రకటించిన సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ... తాజాగా తమ పొత్తును ఇతర రాష్ట్రాలకు విస్తరించాయి. మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి. సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్ లోని 29 లోక్ సభ సీట్లలో మూడు చోట్ల, ఉత్తరాఖండ్ లోని 5 సీట్లలో ఒకచోట ఎస్పీ పోటీ చేస్తుంది. మిగిలిన అన్ని సీట్లలోనూ బీఎస్పీ పోటీ చేయనుంది. యూపీలోని 80 సీట్లలో ఎస్పీ 37, బీఎస్పీ 38 సీట్లలో పోటీ చేయడానికి ఇదివరకే ఒప్పందం కుదిరింది. మిగిలిన సీట్లను మిత్రపక్షాలకు కేటాయించారు.
2019-02-25 Read More50 ఏళ్లపాటు 5 ఎయిర్ పోర్టుల నిర్వహణ కాంట్రాక్టును దక్కించుకోవడానికి అదానీ గ్రూపు ‘అసాధారణ’ రేట్లను కోట్ చేసింది. ఉదాహరణకు అదానీ సొంత రాష్ట్రంలోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకోసం జీఎంఆర్ ఒక్కో ప్రయాణీకుడికి రూ. 85 చొప్పున ప్రభుత్వానికి ఆఫర్ చేయగా, అదానీ ఏకంగా రూ. 177 కోట్ చేశారు. రెండో బిడ్డర్ కంటే అదానీ రెట్టింపు ఆఫర్ చేయడం గమనార్హం. లక్నో ఎయిర్ పోర్టుకు అదానీ రూ. 171 కోట్ చేస్తే రెండో స్థానంలో నిలిచిన ఎఎంపి కేపిటల్స్ రూ. 139 కోట్ చేసింది.
2019-02-25 Read Moreఎయిర్ పోర్టుల ప్రైవేటీకరణలో భాగంగా సోమవారం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేలంలో అదానీ గ్రూపు 5 ఎయిర్ పోర్టులను దక్కించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుతోపాటు జైపూర్, మంగళూరు, త్రివేండ్రం, లక్నో ఎయిర్ పోర్టులు అదానీ గ్రూపు పరమయ్యాయి. వచ్చే 50 సంవత్సరాలపాటు ఎయిర్ పోర్టుల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది. మొత్తం ఆరు ఎయిర్ పోర్టులకు టెండర్లు పిలిస్తే అదానీ గ్రూపు 5 ఎయిర్ పోర్టులకు అతి పెద్ద బిడ్డర్ గా నలిచింది.
2019-02-25 Read Moreతెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అసెంబ్లీ ఆమోదం పొందింది. ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చకు సోమవారంనాడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సమాధానమిచ్చారు. బిల్లు పాసైన అనంతరం అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి హోదాలో ముఖ్యమంత్రే ప్రవేశపెట్టారు.
2019-02-25 Read Moreనిర్మాణంలో ఉన్న ఇళ్ళపై పన్ను రేటును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ ఆదివారం నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నిర్ణయం అమల్లోకి వచ్చాక ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ వర్తించదు. అఫర్డబుల్ హౌసింగ్ పై ఇంతకు ముందున్న 8 శాతం పన్ను రేటు 1 శాతానికి తగ్గనుంది. ఈ నిర్వచనం కిందకు వచ్చే ఇండ్ల నిర్మాణ వ్యయ పరిమితిని రూ. 45 లక్షల వరకు పెంచారు. పన్ను రేట్లలో మార్పులు ఏప్రిల్ 1వ తేదీనుంచి అమలు కానున్నాయి.
2019-02-24 Read More‘ప్రతిపాదిత’ హైస్పీడ్ రైలు కారిడార్లలో హైదరాబాద్ నగరం పేరు లేకపోవడంపట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు (కేటీఆర్) ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రస్తావించిన కేటీఆర్, కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ను ఉద్దేశించి ఆదివారంనాడు ఒక ట్వీట్ చేశారు. ‘‘10 కారిడార్ల ప్రతిపాదనపై వచ్చిన వార్తలో పూర్తిగా నిజం ఉందని అనుకోవడంలేదు. అదే నిజమైతే...దేశంలోని ఐదో అతి పెద్ద మెట్రో నగరాన్ని వదిలేయడంలోని లాజిక్ అర్ధం కావడంలేదు. ఈ విషయంలో క్లారిఫై చేయండి’’ అని పీయూష్ గోయల్ ను కోరారు.
2019-02-24 Read More2019 ఎన్నికల నేపథ్యంలో ఇటీవల బడ్జెట్ సందర్భంగా ప్రకటించిన ‘‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’’ ఆదివారంనాడు ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. గోరఖ్ పూర్ పట్టణంలో ఈ నూతన పథకానికి శ్రీకారం చుట్టారు. ఏడాదికి రూ. 6000 రైతులకు అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకంలో, తొలి ఇన్స్టాల్ మెంట్ కింద రూ. 2000 ఇప్పుడు అకౌంట్లకు బదిలీ కానున్నాయి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక రైతులకోసం చేపట్టిన అతిపెద్ద పథకం ఇదేనని ప్రధాని మోదీ చెప్పారు.
2019-02-24 Read More‘రెడ్డి’ అంటే ఒక కులానికి సూచిక కాదని, రెడ్డి అంటే రక్షకుడని అర్ధమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. రాయలసమలో రాజకీయ యాత్ర మొదలుపెట్టిన పవన్ ఆదివారం కర్నూలులో రోడ్ షో నిర్వహించారు. అనంతరం కొండారెడ్డి బురుజు వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ... రాయలసీమలో రౌడీయిజం, రాష్ట్ర రాజకీయాల్లో కుటుంబ ఆధిపత్యం పోవాలని ఆకాంక్షించారు. తాను ఒక కులాన్నో..ప్రాంతాన్నో నమ్ముకొని రాజకీయాల్లోకి రాలేదన్నారు. కులాల గోడలు బద్ధలు కొడతానని ఉద్ఘాటించారు.
2019-02-24 Read More