క్రికెట్ ప్రపంచ కప్ 2019లో శనివారం జరిగిన రెండో మ్యాచులో వెస్టిండీస్ జట్టుపై న్యూజీలాండ్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియాను అధిగమించి నెంబర్ 1 స్థానానికి చేరింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ జట్టు 291 పరుగులు సాధించింది. అందులో సగానికి పైగా (148) ఒక్క ప్లేయర్ (విలియంసన్) కొట్టినవే కావడం విశేషం. వెస్టిండీస్ జట్టులో క్రిస్ గేల్ (87), హెత్మ్యేర్ (53) మెరిసినా వారి నిష్క్రమణతో మ్యాచ్ న్యూజీలాండ్ వైపు మొగ్గింది.
2019-06-23ఇరాన్‌పై సరికొత్త ఆంక్షలు విధించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ప్రకటించారు. అవి సోమవారం అమల్లోకి వస్తాయని ఆయన వెల్లడించారు. అమెరికా నిఘా డ్రోన్ ను ఇరాన్ కూల్చివేసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. ఒబామా భయానక ప్రణాళిక ప్రకారం కొద్ది సంవత్సరాల్లోనే ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసుకునేదంటూ ట్రంప్ శనివారం ఒక ట్వీట్ చేశారు. ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండటానికి వీల్లేదని ఆయన ఉద్ఘాటించారు.
2019-06-22 Read Moreప్రపంచ క్రికెట్లో పసికూనగా భావించే ఆఫ్ఘనిస్తాన్ జట్టు శనివారం టీమ్ ఇండియాకు చెమటలు పట్టించింది. ఇండియాను 224 పరుగులకే కట్టడి చేశాక బ్యాటింగ్ లో చివరిదాకా పోరాడి కేవలం 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. 49.5 ఓవర్లలో ఆలౌట్ అయిన ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ళు 213 పరుగులు నమోదు చేశారు. ఇండియా బౌలర్లలో మహ్మద్ షమీ రాణించి నాలుగు వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ తొలి వికెట్ తీసిన షమీ, మళ్లీ 50వ ఓవర్లో హ్యాట్రిక్ సాధించి ఆటను ముగించాడు.
2019-06-22 Read Moreసంబంధం లేని ‘కస్టోడియల్ డెత్’ కేసులో తన భర్తను ‘రాజకీయ ప్రతీకారేచ్ఛ’తో ఇరికించారని మాజీ ఐపిఎస్ అధికారి సంజీవ్ భట్ భార్య శ్వేత చెప్పారు. 1990 మత కలహాల సమయంలో జాంజోధ్ పూర్ పోలీసులు అరెస్టు చేసిన 133 మందిలో ఏ ఒక్కరినీ భట్ ఇంటరాగేట్ చేయలేదని ఆమె స్పష్టం చేశారు. 2002 గుజరాత్ మారణకాండపై నరేంద్ర మోదీని తప్పుపట్టిన భట్, మరో కేసులో ఇదివరకే డిస్మిస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే.. 29 ఏళ్లనాటి కేసులో గుజరాత్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది.
2019-06-22 Read Moreఅమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ‘స్పష్టమైన వివక్ష’ చూపిస్తోందని బిజెపి ధ్వజమెత్తింది. అమెరికా నిన్న విడుదల చేసిన ‘అంతర్జాతీయ మత స్వేచ్ఛ రిపోర్టు 2018‘పై శనివారం బిజెపి స్పందించింది. మైనారిటీలపై హింసను ప్రోత్సహిస్తున్నారంటూ భారత ప్రభుత్వాన్ని, బిజెపి నేతలను ఆ నివేదిక వేలెత్తి చూపించింది. విద్వేష ప్రసంగాలను, గోరక్షక దళాల పేరిట జరుగుతున్న హింసను నివేదికలో ప్రస్తావించారు.
2019-06-22 Read Moreముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ ఎంపీ వై.వి. సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ముహూర్తం ప్రకారం శనివారం ఉదయం 11.47 గంటలకు బాధ్యతలు స్వీకరించిన సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులతో కలసి వెంకటేశ్వరుని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన సూత్రానికి వెళ్లి భోజనం చేశారు.
2019-06-22క్రికెట్ ప్రపంచ కప్ 2019లో ఆఫ్ఘనిస్తాన్ తొలి విజయాన్ని ఇండియాపై నమోదు చేస్తుందా? 50 ఓవర్లలో 224 పరుగులు మాత్రమే చేయగలిగిన ఇండియా జట్టును చూస్తే ఇప్పుడు అందరిలోనూ అదే ఆసక్తి. శనివారం ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోటీలో.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా 4.5 రన్ రేటును కూడా నమోదు చేయలేకపోయింది. దాయాది పాకిస్తాన్ సహా దిగ్గజాల దుమ్ము దులిపిన కోహ్లీ బృందం పసి కూనల ఎదుట కూలబడింది.
2019-06-22మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ప్రక్కన ఉన్న ‘ప్రజావేదిక’ నుంచి ఆయన సామాగ్రిని బయటపడవేయించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈ వేదికను తనకు కేటాయించాలని చంద్రబాబు లేఖ రాసినా స్పందించకుండా, ఇలాంటి హేయమైన చర్యలకు ఒడిగట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వికృతానందం పొందుతోందని టీడీపీ ఓ ప్రకటనలో విమర్శించింది. గతంలో వైఎస్ మరణించాక ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ఆరు నెలలపాటు జగన్ ఖాళీ చేయలేదని గుర్తు చేసింది.
2019-06-22పోలవరం ప్రాజెక్టు పనుల్లో అక్రమాలపై నిగ్గు తేల్చాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ నిపుణుల కమిటీని ఆదేశించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన..‘సాక్షి’ వార్తా కథనంలోని అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉండగా అవినీతివల్ల పరిస్థితి మరింత దిగజారిందని వ్యాఖ్యానించారు. పోలవరం సహా ప్రధాన ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగుకు ఉన్న అవకాశాల్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
2019-06-22పార్టీ ఫిరాయించిన నలుగురు తెలుగుదేశం సభ్యులను రాజ్యసభ సచివాలయం బీజేపీ జాబితాలో చేర్చింది. తమను బీజేపీలో విలీనం చేయాలంటూ సుజనా చౌదరి, సిఎం రమేష్, గరికపాటి రామ్మోహన్ రావు, టీజీ వెంకటేష్ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ ఇచ్చిన 24 గంటల్లోనే విలీన ప్రక్రియ పూర్తయింది. దీంతో బీజేపీ సభ్యుల సంఖ్య 75కు పెరిగితే టీడీపీ సభ్యుల సంఖ్య 2కు తగ్గింది. టీడీపీకి కనకమేడల రవీంద్రకుమార్, తోట సీతారామలక్ష్మి మాత్రమే మిగిలారు.
2019-06-21