భారత దేశ జీడీపీ వృద్ధి రేటును 2011-12 నుంచి 2016-17 వరకు అతిగా అంచనా వేశారని ప్రధాని నరేంద్ర మోదీ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ నిర్ధారించారు. అధికారిక అంచనాల్లో వృద్ధి రేటు సుమారు 7 శాతం ఉండగా వాస్తవ జీడీపీ వృద్ధి 4.5 శాతమేనని అరవింద్ 17 ఆర్థిక సూచీల ఆధారంగా లెక్కగట్టారు. వాస్తవ వృద్ధి కంటే 2.5 శాతం అదనంగా అధికారిక అంచనాలున్నాయని ఆయన ఇటీవల హార్వర్డ్ యూనివర్శిటీ ప్రచురించిన పరిశోధనా పత్రంలో నిర్ధారించారు.
2019-06-11 Read Moreఅమెరికా మరోసారి ఉలిక్కిపడింది. న్యూయార్క్ నగరంలోని మిడ్ టౌన్ మన్హట్టన్ ప్రాంతంలో ఓ ఆకాశహర్మ్యంపై హెలికాప్టర్ కూలిన ఘటన సోమవారం కలకలం రేపింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.00 గంటలకు జరిగిన ఈ ఘటనలో పైలట్ మరణించారు. నియంత్రిత గగనతలంలో జరిగిన ఘటన 2001 సెప్టెంబర్ 11 నాటి భయానక ఉగ్రవాద దాడిని అమెరికన్లకు గుర్తు చేసింది. అయితే, ఈ హెలికాప్టర్ కూలడంలో ఉగ్రవాద చర్య ఏమీ లేదని వెంటనే అధికారులు తేల్చేశారు.
2019-06-11 Read Moreరష్యా ఎస్-400 మిసైళ్లను కొంటానన్నందుకు టర్కీపై మండిపడుతోంది అమెరికా. ఎఫ్-35 యుద్ధ విమానాలను టర్కీకి అమ్మే ప్రతిపాదనను విరమించుకొంది. తాజాగా ఎఫ్-35 జాయింట్ స్ట్రైక్ ఫైటర్లపై శిక్షణ తీసుకుంటున్న టర్కీ పైలట్లను ఉన్నపళంగా నిలిపివేసింది. ఆరిజోనాలో ఉన్న ల్యూక్ ఎయిర్ ఫోర్స్ స్థావరంలో ఇకపైన టర్కీ పైలట్లకు శిక్షణ ఇవ్వబోవడంలేదని అమెరికా స్పష్టం చేసింది.
2019-06-11 Read Moreఅమితాబ్ బచ్చన్ ట్విట్టర్ అకౌంట్ (@SrBachchan) సోమవారం రాత్రి హ్యాకింగ్ కు గురైంది. ఆయన ట్విట్టర్ ప్రొఫైల్ ఫొటో మారిపోయి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఫొటో ప్రత్యక్షమైంది. ‘అయ్యిల్దిజ్ టిమ్ టర్కిష్ సైబర్ ఆర్మీ’ పేరిట హ్యాకర్లు ఓ పోస్టు పెట్టారు. టర్కిష్ ఫుట్ బాల్ ఆటగాళ్ల పట్ల ఐస్ ల్యాండ్ రిపబ్లిక్ ప్రవర్తనను వారు ఖండించారు. ముంబై పోలీసులు ఈ హ్యాకింగ్ విషయమై దర్యాప్తు చేపట్టారు.
2019-06-11 Read Moreఅమెరికా విదేశాంగ శాఖ మంత్రి (సెక్రటరీ ఆఫ్ స్టేట్) మైక్ పాంపెయొ ఈ నెల చివరి వారంలో (24న) ఇండియాకు రానున్నారు. అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో... ఇండో పసిఫిక్ ప్రాంతంపై చర్చకోసం ఆయన న్యూఢిల్లీ వస్తున్నట్టు సమాచారం. నరేంద్ర మోదీ నేతృత్వంలో రెండోసారి ప్రభుత్వం ఏర్పడ్డాక రక్షణ రంగంలో సహకారం పెంచుకోవచ్చని అమెరికా భావిస్తోంది. అదే సమయంలో ట్రంప్ విధానాల కారణంగా వాణిజ్య రంగంలో సంబంధాలు దెబ్బ తింటున్నాయి.
2019-06-11 Read Moreకాశ్మీర్ లోని కథువాలో ఓ మైనారిటీ మైనర్ బాలిక సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఆలయ పూజారి సహా ముగ్గురికి జీవిత ఖైదు విధించింది పఠాన్ కోట్ న్యాయస్థానం. మరో ముగ్గురు నిందితులకు ఐదేళ్ళ కారాగారవాసం విధించింది. కాశ్మీర్ రణ్ బీర్ పీనల్ కోడ్ లోని వివిధ సెక్షన్ల ప్రకారం నిందితులకు శిక్ష విధించింది. పూజారి సహా ఏడుగురు నిందితులు మైనర్ బాలికను కిడ్నాప్ చేసి దేవాలయంలోనే అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
2019-06-10కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఏపీ గవర్నరుగా నియమితులయ్యారా? సోమవారం వెబ్ సైట్లు, సామాజిక మాథ్యమాల్లో అవుననే వార్త హోరెత్తింది. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ అభినందనలు తెలపడంతో ఇది నిజమేననే భావన అంతటా కలిగింది. అయితే, ఇది తప్పని స్వయంగా సుష్మా స్వరాజ్ ఖండించారు. ‘‘మంత్రిగా తప్పుకొన్న సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుగారిని కలిశాను. నన్ను ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా నియమించడానికి ట్విట్టర్ కు ఇది చాలు!!’’ అని సుష్మ ట్వీట్ చేశారు.
2019-06-10భారత ప్రధాని నరేంద్ర మోదీ విమానం తమ గగనతలంపై ప్రయాణించడానికి పాకిస్తాన్ సమ్మతించింది. దీంతో కిర్గిజిస్తాన్ రాజధానిలో ఈ నెల 13, 14 తేదీల్లో జరిగే షాంగై సహకార సంస్థ (ఎస్.సి.ఒ) సదస్సుకు మోదీ దగ్గరి దారినుంచే వెళ్ళనున్నారు. ఫిబ్రవరి 26న భారత యుద్ధ విమానాలు పాకిస్తాన్ లోని బాలాకోట్ జెఇఎం స్థావరంపై దాడి చేసిన తర్వాత ఆ దేశం పలు విమాన రూట్లను మూసేసింది. ఈ నేపథ్యంలో.. ఎస్.సి.ఒ సదస్సుకు హాజరయ్యే మోదీ విమానాన్ని అనుమతించాలని ఇండియా విజ్ఞప్తి చేసింది.
2019-06-10 Read Moreతెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టు పొందిన ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు, కన్సల్టెన్సీలను రద్దు చేయాలని కొత్త మంత్రివర్గం నిర్ణయించింది. ప్రభుత్వ విభాగాల్లో తాత్కాలిక ప్రాతిపదికపై సిబ్బందిని ఈ ఏజెన్సీల ద్వారా నియమించే సంగతి తెలిసిందే. లాభాపేక్ష లేని సంస్థలకు ఔట్ సోర్సింగ్ బాధ్యతలు అప్పగించి ఉద్యోగులకే లబ్ది చేకూరేలా చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది.
2019-06-10ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర రైతు కమిషన్ ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయించింది. సోమవారం వెలగపూడి సచివాలయంలో జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నారు. సిఎం అధ్యక్షతన ఏర్పాటయ్యే ఈ కమిషన్ వ్యవసాయ పురోగతి, రైతు సంక్షేమం, ధరల స్థిరీకరణ వంటి అంశాలను పర్యవేక్షిస్తుంది. రైతు సంఘం నాయకులు, నిపుణులు సభ్యులుగా ఉంటారు. ఈ సీజన్ లో ధాన్యానికి కనీస మద్ధతు ధర రావడంలేదన్న ఆరోపణలను సిఎం ప్రస్తావించారు.
2019-06-10