‘‘హిందు’’ అనే పదాన్ని మొదట ఉచ్ఛరించింది భారతీయులు కాదని, మొఘలులు లేదా వారికంటే ముందు వచ్చిన విదేశీ పాలకులని మక్కల్ నీతి మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ ఉద్ఘాటించారు. బ్రిటిష్ వారు ఆ పదాన్ని ఆమోదించారని పేర్కొన్నారు. నాథురాంగాడ్సే భారత దేశపు తొలి తీవ్రవాది (హిందువు) అన్న తన వ్యాఖ్యపై వివాదం కొనసాగుతుండగానే చరిత్రలో ఇంకాస్త వెనక్కు వెళ్ళారు కమల్!. ‘‘12 మంది ఆళ్వార్లు, నాయన్మార్లు ‘హిందు’ అని ఎక్కడా ప్రస్తావించలేదు’’ అని స్పష్టం చేశారు.
2019-05-17గాంధీ హంతకుడిని దేశభక్తుడని పొగిడిన బీజేపీ భోపాల్ అభ్యర్ధి ‘‘ప్రగ్యాఠాకూర్ గెలిస్తే... ఆమెను స్వాగతిస్తారా లేక బహిష్కరిస్తారా?’’... ఐదేళ్ళ పదవీకాలంలో తొలిసారి ఒక ప్రెస్ కాన్ఫరెన్సులో కనిపించిన ప్రధానమంత్రి మోదీని ఓ విలేకరి అడిగిన ప్రశ్న ఇది. అయితే, ఆయన దీనికి సమాధానం చెప్పలేదు. ప్రగ్యాకు షోకాజ్ నోటీసు ఇచ్చామని, ఆమె సమాధానాన్ని బట్టి పార్టీ క్రమశిక్షణా కమిటీ నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బదులిచ్చారు.
2019-05-17నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక దాదాపు ఐదేళ్ళకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల ఏడో దశ ప్రచారం ముగిసిన నేపథ్యంలో శుక్రవారం పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మోదీ పాల్గొన్నారు. అమిత్ షా, మోదీ మాట్లాడిన తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నల్లో ఒక్కదానికీ ప్రధానమంత్రి బదులివ్వలేదు. సమావేశం నిర్వహించిన అమిత్ షా మాత్రమే జవాబులిచ్చారు. ఒక ప్రధానమంత్రి తన పదవీ కాలం మొత్తంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించకపోవడం ఇదే తొలిసారి.
2019-05-17 Read Moreలోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయేకు 177 సీట్లు మాత్రమే వస్తాయని, యుపిఎకు 141, ఇతర పార్టీలకు 224 వస్తాయని ఇండియా టుడే ‘‘ఎగ్జిట్ పోల్’’ తేల్చినట్టు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే, ఇండియా టుడే యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్ (ఎ.ఎఫ్.డబ్ల్యు.ఎ) ఇది తప్పుడు వార్త అని కొట్టిపారేసింది. అలాంటి పోల్ చేయలేదని ఇండియా టుడే టీవీ సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ (19వ తేదీ) ముగిసేవరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల చేయడానికే వీల్లేదు.
2019-05-17 Read Moreన్యూయార్క్ మేయర్ బిల్ డి బ్లాసియో అమెరికా అధ్యక్ష పీఠం రేసులోకి దిగారు. డెమాక్రాటిక్ పార్టీ తరపున అభ్యర్ధుల రేసులో తాను ఉంటానని గురువారం ఆయన ప్రకటించారు. అమెరికాలోని అతి పెద్ద నగరానికి రెండుసార్లు మేయర్ గా పని చేసిన బిల్, ‘‘పని చేసే ప్రజలే ముందు’’ అనే భావనతో ప్రచార వీడియోను విడుదల చేశారు. ‘‘ప్రపంచంలో చాలా ధనం ఉంది. ఈ దేశంలో చాలా ధనం ఉంది. అయితే, అది తప్పుడువ్యక్తుల చేతుల్లో ఉంది’’ అని బిల్ పేర్కొన్నారు.
2019-05-16 Read More1970లలో పసిఫిక్ మహాసముద్రంలోని మార్షల్ దీవుల్లో పెద్ద ఎత్తున అణుపరీక్షలు నిర్వహించిన అమెరికా ఆ వ్యర్ధాలను ఓ భారీ కాంక్రీటు కట్టడంతో కప్పిపెట్టింది. ఆ కాంక్రీటు డోమ్ నుంచి రేడియోథార్మిక పదార్ధం పసిఫిక్ మహాసముద్రంలోకి లీకవుతోందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఫిజీలో విద్యార్ధులతో మాట్లాడిన గుటెర్రెస్, దశాబ్దాలనాటి అణు పరీక్షలు ఇప్పటికీ పసిఫిక్ ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో నీరు విషతుల్యమైందని చెప్పారు.
2019-05-16 Read Moreబెంగాలీ బహుముఖ ప్రజ్ఞాశాలి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ‘‘భారీ విగ్రహం’’ పంచలోహాలతో తయారు చేయించి ప్రతిష్ఠిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రకటించారు. మంగళవారం కోల్ కత నగరంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీ సందర్భంగా హింస చెలరేగి కొంతమంది దుండగులు విద్యాసాగర్ కళాశాలవద్ద విగ్రహాన్ని కూల్చివేసిన సంగతి తెలిసిందే. గురువారం ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని ప్రస్తావించిన మోదీ, విగ్రహ కూల్చివేత తృణమూల్ కాంగ్రెస్ గూండాల పనేనని ఆరోపించారు.
2019-05-16 Read Moreజాతిపిత మహాత్మా గాంధీని చంపిన నాథురాం గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించి మరో వివాదాన్ని లేపారు భోపాల్ బీజేపీ లోక్ సభ అభ్యర్ధి ప్రగ్యా ఠాకూర్. స్వతంత్ర భారత తొలి ‘తీవ్రవాది’ నాథురాంగాడ్సే అని సినీ నటుడు కమల్ హాసన్ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రగ్యాఠాకూర్ స్పందించారు. నాథురాం గాడ్సే దేశభక్తుడుగా వ్యవహరించారని, ఇకపైనా దేశభక్తుడిగానే గుర్తింపు పొందుతారని ప్రగ్యా పేర్కొన్నారు. ప్రగ్యా ఠాకూర్ 2008 మాలెగావ్ బాంబు పేలుళ్ళ ఘటనలో నిందితురాలు.
2019-05-16 Read Moreబోఫోర్స్ లంచాల కేసులో తదుపరి విచారణకు అనుమతి కోరుతూ ఢిల్లీ కోర్టులో గత ఏడాది దరఖాస్తు దాఖలు చేసిన సీబీఐ, తాజాగా దాన్ని వెనక్కు తీసుకుంది. 64 కోట్ల బోఫోర్స్ కుంభకోణంలో కొత్త ఆధారాలు లభించాయని 2018 ఫిబ్రవరి 1వ తేదీన దాఖలు చేసిన దరఖాస్తులో పేర్కొంది. సీబీఐకి తమ అనుమతి ఎందుకు అవసరమైందని ఢిల్లీ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు గత డిసెంబర్ 4న ప్రశ్నించింది. గురువారం దరఖాస్తు ఉపసంహరించుకోవడానికి కారణాలు సీబీఐకే తెలియాలని మేజిస్ట్రేట్ నవీన్ కుమార్ కాశ్యప్ వ్యాఖ్యానించారు.
2019-05-16 Read Moreచైనా సంస్థలపై ఇతర దేశాలు ఏకపక్షంగా ఆంక్షలు విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఆ దేశ వాణిజ్య శాఖ అధికార ప్రతినిధి గావో ఫెంగ్ గురువారం స్పష్టం చేశారు. చైనా టెలికం దిగ్గజం ‘హవావీ’ని అమెరికా బ్లాక్ లిస్టులో చేర్చిన నేపథ్యంలో చైనా స్పందించింది. చైనాతో వాణిజ్యాన్ని మరింతగా ప్రభావితం చేసే చర్యలను అమెరికా నివారించాలని ఫెంగ్ సూచించారు.
2019-05-16 Read More