ఈ రోజు విడుదలైన క్యూఎస్ ఇండియా యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2020 లో ఐఐటిలు ఆధిక్యాన్ని చాటాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) బొంబాయి అగ్ర స్థానంలో నిలవగా.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి) బెంగళూరు, ఐఐటి ఢిల్లీ 2, 3 ర్యాంకులు దక్కించుకున్నాయి. మద్రాసు, ఖరగ్పూర్ ఐఐటిలు 4,5 స్థానాల్లో నిలిచాయి. క్యూఎస్ ఇండియా యూనివర్శిటీ ర్యాంకింగ్స్ రెండవ ఎడిషన్‌లో 107 భారతీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ 7వ ర్యాంకుతో, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ 8వ ర్యాంకుతో టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి.
2019-10-22ప్రభుత్వంలో కార్పొరేషన్ విలీనం మినహా మిగిలిన డిమాండ్లను పరిశీలించేందుకు తెలంగాణ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో ఒక కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టుకు నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో... ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్లో అధికారులతో సమీక్ష జరిపారు. కార్మికులు విలీనంపైనే పట్టబట్టబోమని హైకోర్టులో విచారణ సందర్భంగా చెప్పినట్టు ఈ సమావేశంలో అధికారులు చెప్పారు.
2019-10-22ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ ఫొటో ట్రెండింగ్ జాబితాలో చేరింది. దానికి కారణం ఆ ఫొటోలో ఆయన... అమెరికా చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన విదేశాంగ మంత్రి ‘హెన్రీ కిసింజర్’తో కలసి ఉండటమే. 1971 యుద్ధంలో పాకిస్తాన్ కోసం నేవీని ఇండియాపైకి పంపడమే కాకుండా, ‘‘ఇండియన్స్ బాస్టర్డ్స్’’ అని నిందించిన పెద్ద ‘‘యుద్ధ నేరస్తుడు’’. జెపి మోర్గాన్ అంతర్జాతీయ కౌన్సిల్ సమావేశం ఢిల్లీలో జరిగిన సందర్భంగా మోదీ కిసింజర్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ లను కలుసుకున్నారు.
2019-10-22టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) దేశవ్యాప్తంగా ‘టాప్ టాలెంట్’ను ఆకర్షించడానికి ‘హాట్ ఆఫర్’ ఇస్తోంది. ఈ ఐటి దిగ్గజం గత ఏడాది నేషనల్ క్వాలిఫయర్ పరీక్షను ప్రారంభించింది. ఇప్పుడు ఆ క్వాలిఫయర్ పరీక్షకు హాజరైన టాపర్లకు మరో పరీక్ష పెట్టనుంది. ఆ టెస్టులోనూ నెగ్గితే వారిని ‘‘హాట్ టాలెంట్’’గా పరిగణించి రెట్టింపు శాలరీని ఇవ్వనున్నట్టు సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, హెచ్.ఆర్. గ్లోబల్ హెడ్ మిలింద్ లక్కడ్ చెప్పారు. ఇప్పటికే పని చేస్తున్న ఉద్యోగులకు కూడా అదే ‘ఆఫర్’ను వర్తింపజేయనున్నట్టు తెలిపారు.
2019-10-22 Read Moreసోషల్ మీడియా ప్రొఫైల్స్ ను ‘ఆధార్’తో అనుసంధానానించే అంశంపై వివిధ హైకోర్టులలో పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులనూ సుప్రీంకోర్టు తనకు బదిలీ చేసుకుంది. వివిధ హైకోర్టులలో పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులను సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలని ‘ఫేస్‌బుక్’ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈ ఉత్తర్వు వెలువడింది. అదే సమయంలో... సోషల్ మీడియా దుర్వినియోగాన్ని నిరోధించడంపై జనవరిలో తనకు నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
2019-10-22అమరావతి అభివృద్ధి అయితే తన పేరే చెబుతారన్న దుగ్ధతో చంపేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. 33 వేల ఎకరాలు సమీకరించడం ఒక ప్రజాస్వామ్య దేశంలో ఎలా సాధ్యమైందంటూ అంతర్జాతీయంగా అధ్యయనాలు జరుగుతున్నాయన్న బాబు, అలాంటి బంగారు గుడ్లు పెట్టే బాతును మీ చేతికి ఇస్తే చంపేస్తారా? అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. అప్పట్లో రాజశేఖరరెడ్డి కూడా ఇదే పని చేసి ఉంటే హైదరాబాద్ అభివృద్ధి కొనసాగేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
2019-10-22తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటును ధర్మాడి సత్యం బృందం మంగళవారం బయటకు తీసింది. కనిపించకుండా పోయిన 12 మందిలో ఏడుగురి మృతదేహాలు ఆ బోటులోనే ఉన్నట్టు గుర్తించారు. ప్రమాదం జరిగిన సెప్టెంబర్ 15వ తేదీన బోటులో 77 మంది ఉండగా 26 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 39 మంది మృతదేహాలు దొరికాయి. మిగిలినవారు బోటులోనే చిక్కుకొని చనిపోయి ఉంటారని భావించారు. ఈరోజు ఏడుగురి మృతదేహాలు దొరికాయి. మరో ఐదుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది.
2019-10-22సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని రూ. 55,548.87 కోట్లుగా ఆమోదించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో అమిత్ షాను కలసిన సిఎం... భూసేకరణ, పునరావాస కార్యక్రమాలకే రూ. 33 వేల కోట్లు ఖర్చవుతాయని వివరించారు. అందులో రూ. 16 వేల కోట్లను ఈ ఏడాదే విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుపై ఇప్పటికే ఖర్చు చేసిన రూ. 5,073 కోట్లను విడుదల చేయాలని కూడా జగన్ కోరారు.
2019-10-22విభజనతో తలెత్తిన సమస్యలు ప్రత్యేక కేటగిరి హోదా ద్వారానే పరిష్కారమవుతాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు విన్నవించారు. మంగళవారం అమిత్ షాను కలసిన సిఎం జగన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి వినతిపత్రం సమర్పించారు. అందులోని వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో 76.2 శాతంగా ఉండే పరిశ్రమలు, సేవారంగాల వాటా విభజన తర్వాత 68.2 శాతానికి పడిపోయిందని జగన్ కేంద్ర మంత్రికి నివేదించారు.
2019-10-22ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఎట్టకేలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘అపాయింట్ మెంట్’ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం అపాయింట్ మెంట్ లభించని నేపథ్యంలో సిఎం జగన్ మరోసారి ఢిల్లీ వెళ్లి నిన్నంతా వేచి చూశారు. మంగళవారం అమిత్ షా పుట్టిన రోజు సందర్భంగా ఆయనను కలిసే అవకాశం వచ్చింది. శుభాకాంక్షలు తెలిపిన జగన్ తో కొద్ది నిమిషాలే అమిత్ షా మాట్లాడారని, అప్పుడే సిఎం ఓ వినతి పత్రాన్ని సమర్పించారని వార్తలు వచ్చాయి. అయితే, అమిత్ షాతో 45 నిమిషాల సేపు సిఎం చర్చించారని ఏపీ ప్రభుత్వం తెలిపింది.
2019-10-22