2016 నోట్ల రద్దు నిర్ణయం ప్రభావం రాజస్థాన్, పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, పట్టణ గుజరాత్, మహారాష్ట్రలతో పాటు దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాలపై ఎక్కువగా ఉన్నట్టు అమెరికా నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్.బి.ఇ.ఆర్) తేల్చింది. నగదు కొరతతో దేశవ్యాప్తంగా ఆ ఏడాది అక్టోబర్-డిసెంబర్ కాలంలో ఆర్థిక కార్యకలాపాలు 3 శాతం లేదా అంతకంటే ఎక్కువే తగ్గాయని ఈ సంస్థ తన తాజా అధ్యయనంలో పేర్కొంది. తర్వాత అనేక త్రైమాసికాల పాటు బ్యాంకు రుణాల డిమాండ్ తగ్గినట్టు ఎన్.బి.ఇ.ఆర్. తెలిపింది.
2019-10-07 Read Moreప్రధాని నరేంద్ర మోదీ 2016లో చేపట్టిన నోట్ల రద్దు తర్వాత జాతీయ ఆర్థిక కార్యకలాపాలు, ఉద్యోగాల్లో 2 నుంచి 3 శాతం క్షీణత నమోదైనట్టు అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక పరిశోధనా సంస్థ తేల్చింది. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్.బి.ఇ.ఆర్) తాజా అధ్యయనం ఫలితాలు సోమవారం వెల్లడయ్యాయి. నోట్ల రద్దుపై జిల్లాల స్థాయిలో చేపట్టిన తొలి అధ్యయనం ఇదే. ఇప్పటిదాకా జాతీయ స్థాయిలో స్థూలంగా జరిగిన అధ్యయనాలు నోట్ల రద్దు ప్రభావాన్ని తక్కువగా అంచనా వేశాయని ఎన్.బి.ఇ.ఆర్ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు.
2019-10-07 Read More‘ఆక్సిజన్ లభ్యతను కణాలు ఎలా గుర్తిస్తాయి... ఎలా గ్రహిస్తాయి?’ అనే అంశంపై పరిశోధన చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు 2019 నోబెల్ మెడిసిన్ బహుమతి దక్కింది. అమెరికాకు చెందిన విలియం జి. కైలిన్ జూనియర్, గ్రెగ్ ఎల్. సెమెన్జా, బ్రిటన్ శాస్త్రవేత్త పీటర్ జె. రాట్క్లిఫ్ లకు సోమవారం ఈ అవార్డును ప్రకటించారు. అవార్డు నగదు 9.13 లక్షల డాలర్లను ముగ్గురికీ సమంగా పంచుతారు. కణాల మెటాబాలిజంను ఆక్సిజన్ లభ్యత ఎలా ప్రభావితం చేస్తుందో అర్ధం చేసుకోవడానికి వీరి పరిశోధన దోహదపడుతుంది.
2019-10-07 Read Moreఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ హరిచందన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. హైకోర్టు న్యాయవాదులు, అధికారులు, అనధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
2019-10-07దసరా సమయంలో సమ్మెకు దిగడం తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేసిన తీవ్రమైన తప్పిదమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తాను లొంగబోనని, సమ్మెకు దిగినవారిలో గడువులోపు విధుల్లో చేరనివారిని తిరిగి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వారి స్థానంలో కొత్తగా నియమాకాలు చేపట్టాలని ఆదేశించిన కేసీఆర్, ‘కొత్తగా చేరే సిబ్బంది యూనియన్లలో చేరబోమని ఒప్పంద పత్రంపైన సంతకం చేయాలి’ అని హుకుం జారీ చేశారు.
2019-10-07 Read Moreభారత్, బంగ్లాదేశ్ తాజాగా ఏడు ఒప్పందాలు కుదుర్చుకుని మూడు ప్రాజెక్టులను ప్రారంభించాయి. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పలు అంశాలపై చర్చించారు. త్రిపుర రాష్ట్రానికి బంగ్లాదేశ్ భూభాగం ద్వారా ఆ దేశ ట్రక్కులు ఉపయోగించి ఎల్‌పిజి (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) సరఫరా చేయడానికి ఒప్పందం కుదిరింది. నీటి వనరులు, యువత వ్యవహారాలు, సంస్కృతి, విద్య, తీరప్రాంత నిఘా రంగాలలో సహకారంకోసం ఇతర ఒప్పందాలు కుదిరాయి.
2019-10-05 Read Moreనరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి శుక్రవారం ఢిల్లీలో కలిశారు. ఏకంగా 22 అంశాలపై విజ్ఞాపన పత్రాలను ప్రధానికి అందించారు. విభజన హామీ మేరకు వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు ఓ సంవత్సరానికి పెండింగ్ లో ఉన్నాయన్న కేసీఆర్, నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు మిషన్ కాకతీయ పథకానికి రూ. 5,000 కోట్లు, ‘మిషన్ భగీరథ’కు రూ. 19,205 కోట్లు ఇవ్వాలని ప్రధానిని కోరారు. * పూర్తి జాబితాకోసం ఎడమకు స్వైప్ చేయండి *
2019-10-04 Read Moreటీవీ9 వ్యవస్థాపక సీఈవో రవిప్రకాష్ హైదరాబాద్ పోలీసుల అదుపులో ఉన్నారు. సీఈవోగా ఉన్న సమయంలోనే రవిప్రకాష్... సంస్థ నుంచి రూ. 18 కోట్లకు పైగా నిధులను బోర్డు డైరెక్టర్ల అనుమతి లేకుండా చెక్కులతో డ్రా చేసుకున్నారన్నది తాజా అభియోగం. కొత్త యాజమాన్యం ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఆయనపైన చీటింగ్ కేసు నమోదు చేశారు. గతంలో పలు కేసులు పెట్టి అరెస్టు చేయడానికి ప్రయత్నించగా రవిప్రకాష్ అజ్ఞాతంలోకి వెళ్లారు. తర్వాత బెయిలు తెచ్చుకున్నారు. ఇప్పుడు కొత్త ఆరోపణ ముందుకొచ్చింది.
2019-10-05 Read Moreతన తీర్పులలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నారని ఆరోపిస్తూ థాయ్‌లాండ్ న్యాయమూర్తి ఒకరు కోర్టులోనే ఆత్మహత్యాయత్నం చేశారు. యాలా ప్రావిన్షియల్ కోర్టు సీనియర్ న్యాయమూర్తి ఖానకార్న్ పియాంచన శుక్రవారం మధ్యాహ్నం ఓ హియరింగ్ తర్వాత కోర్టు హాలులోనే తన తుపాకిని బయటకు తీసి పొట్టలో కాల్చుకున్నారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా, సర్జరీ చేసిన డాక్టర్లు ప్రాణానికి ప్రమాదం లేదని చెప్పారు. ఆత్మహత్యా ప్రయత్నానికి ముందు ఆ జడ్జి 25 పేజీల ప్రకటనను ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేశారు.
2019-10-05 Read Moreజాతీయ పౌర రిజిస్ట్రీ (ఎన్.ఆర్.సి). అస్సాంలో సవరణ అత్యంత వివాదాస్పదమైంది. ఇప్పుడా ఎన్‌ఆర్‌సిని కర్ణాటకలో అమలు చేయాలనే ఉద్దేశ్యంతో అధ్యయనం చేస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మై ధృవీకరించారు. బెంగళూరుకు 40 కి.మీ. దూరంలో సొండెకొప్పలో ఒక ‘డిటెన్షన్ సెంటర్’ను నిర్మించారు కూడా..! 10 అడుగుల ఎత్తైన గోడలు, ముళ్ల కంచెలు, రెండు వాచ్ టవర్లతో కనిపిస్తున్న ఈ నిర్మాణం అనధికారికంగా నివశిస్తున్న విదేశీయులను నిర్బంధించడానికేనని ఓ అధికారి తెలిపారు.
2019-10-04 Read More