టెన్నిస్ ప్రపంచ్ నెంబర్ 2 ఆటగాడు రఫేల్ నాదల్ ఆదివారం సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 12వ సారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సొంతం చేసుకున్న ఏకైక వ్యక్తిగా నాదల్ ఖ్యాతి గడించాడు. మొత్తంగా చూస్తే.. ఇది నాదల్ సాధించిన 18వ గ్రాండ్ స్లామ్ టైటిల్. 33 సంవత్సరాల నాదల్ మరో రెండు టైటిళ్ళు సాధిస్తే రోజర్ ఫెదరర్ రికార్డును సమం చేస్తాడు. ఆదివారం ఆస్ట్రేలియా ఆటగాడు డొమినిక్ థీమ్ తో జరిగిన టైటిల్ పోరులో 6-3, 5-7, 6-1, 6-1 స్కోరుతో నాదల్ విజయం సాధించాడు.
2019-06-09 Read Moreఆస్ట్రేలియాపై విజయం ఇండియాకు చాలా కీలకం. ఆదివారం లండన్ వేదికగా జరిగిన పోటీతో కలిపి ప్రపంచ్ కప్ లో ఇప్పటివరకు రెండు జట్లు 12సార్లు తలపడ్డాయి. ఆస్ట్రేలియా 8సార్లు గెలిస్తే ఇండియాకు ఇది నాలుగో విజయం. అస్ట్రేలియాలో రెండుసార్లు పోటీ పడితే రెండు సార్లూ ఆతిథ్య జట్టే విజయం సాధించింది. ఇండియాలో నాలుగు పోటీలు జరిగితే రెండేసి విజయాలు నమోదయ్యాయి. తటస్థ వేదికలపైన ఆరుసార్లు పోటీ పడితే ఆస్ట్రేలియా నాలుగు, ఇండియా రెండు గెలిచాయి.
2019-06-09కెప్టెన్ విరాట్ కోహ్లీ, మరో ప్రధాన బ్యాట్స్ మన్ శిఖర్ ధావన్ విజృంభణతో ఇండియా జట్టు ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. శిఖర్ ధావన్ 16 ఫోర్లతో 109 బంతుల్లో 117 పరుగులు చేసి విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. కోహ్లీ 77 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. దీంతో ఇండియా 50 ఓవర్లలో 7.04 రన్ రేటుతో 353 పరుగులు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని ఆస్ట్రేలియాకు భారీ ఛేజింగ్ లక్ష్యాన్ని నిర్దేశించడం ఫలితాన్నిచ్చింది.
2019-06-09క్రికెట్ ప్రపంచ కప్ 2019లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన పోటీలో ఇండియా ఘన విజయం సాధించింది. ఉత్కంఠభరితమైన పోటీలో 36 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 352 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేజింగ్ లో వెనుకబడిన ఆస్ట్రేలియా 316 పరుగులకు ఆలౌటైంది. లండన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ప్రపంచ కప్ 2019లో 14వది.
2019-06-09ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘన విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సుపరిపాలన అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆదివారం తిరుమల దేవాలయాన్ని సందర్శించిన మోదీ, ఈ సందర్భంగా బీజేపీ బహిరంగ సభలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని మోదీ మరోసారి చెప్పారు. ఎన్నికల్లో గెలవడంతోపాటు ప్రజల మనసులు గెలవాలని మోదీ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
2019-06-09మోదీ లోక్ సభ ఎన్నికల ప్రచారం.. అసత్యాలు, విద్వేషం, విషంతో నిండిపోయిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వాయనాడ్ నియోజకవర్గం (కేరళ)లో శనివారం ఓ సభలో కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. జాతీయ స్థాయిలో తాము వైషమ్యాలతో పోరాడుతున్నామని రాహుల్ పేర్కొన్నారు. మోదీ అసత్యాలకు, విద్వేషానికి ప్రతినిధి అయితే... కాంగ్రెస్ నిజానికి, ప్రేమకు నిలబడుతుందని ఉద్ఘాటించారు.
2019-06-08ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, పుష్ఫశ్రీవాణి పాముల, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్, పినిపె విశ్వరూప్, ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), పేర్ని వెంకట్రామయ్య (నాని), వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణరావు, బాలినేని శ్రీనివాసరెడ్డి, పి. అనిల్ కుమార్, ఆదిమూలపు సురేష్, మేకపాటి గౌతమ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కె. నారాయణ స్వామి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరి జయరాం, ఎస్.బి. అంజాద్ భాషా, ఎం. శంకరనారాయణ.
2019-06-08ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. ముగ్గురు మహిళలు సహా 25 మంది ఒకేసారి శనివారం మధ్యాహ్నం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. వెలగపూడిలోని సచివాలయం ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ కొత్త మంత్రుల చేత ప్రమాణం చేయించారు. మే 23న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వారం రోజులకు మే 30న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గ కూర్పునకు 9 రోజుల వ్యవధి తీసుకున్న జగన్, ఒకేసారి 25 మందితో తన బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
2019-06-08నైరుతి రుతుపవనాల ప్రభావం దేశంపై ప్రారంభమైంది. ఈ ఏడాది వారం రోజులు ఆలస్యంగా శనివారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించాయి. రెండు రోజులపాటు మంచి వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ధ్రోణి రుతుపవనాల సాధారణ పురోగమనాన్ని తాత్కాలికంగా అడ్డుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. సాధారణంగా జూన్ 1నే రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈసారి 6వ తేదీన ప్రవేశిస్తాని వాతావరణ శాఖ గత నెల 15న అంచనా వేసింది.
2019-06-08 Read Moreఅంగారక గ్రహంపైన ఎగరగలమా? సుదీర్ఘ కాలంగా ఉన్న ప్రశ్నకు సమాధానమే ‘నాసా మార్స్ హెలికాప్టర్’. వచ్చే వేసవిలో అరుణ గ్రహంపైకి ‘మార్స్ 2020 రోవర్’తోపాటే ఒక మినీహెలికాప్టర్ ను పంపడానికి ‘నాసా’ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఒక శూన్యగదిలో మార్స్ వాతావరణాన్ని సృష్టించారు. భూ వాతావరణ సాంద్రతలో కేవలం 1 శాతం, భూమి గురుత్వాకర్షణ శక్తిలో 40 శాతం ఉండేలా చూసి హెలికాప్టర్ ప్రయోగం చేపట్టారు. 2021 ఫిబ్రవరిలో అంగారక గ్రహంపైన అడుగు పెట్టాక ఈ హెలికాప్టర్ రోవర్ నుంచి విడిపోతుంది.
2019-06-07