వస్తున్నది అమెరికా అధ్యక్షుడు.. సందర్శిస్తున్నది మన ప్రధాని మోడీ సొంత రాష్ట్రాన్ని.. మరి అంతా సుందర నందనవనంగా కన్పించొద్దూ..! అందుకే.. ట్రంప్, మోడీ 24న చేపట్టే ‘రోడ్ షో’ మార్గంలో మురికివాడలు కనిపించకుండా పెద్ద గోడను నిర్మిస్తోంది అహ్మదాబాద్ కార్పొరేషన్. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇందిరా బ్రిడ్జి వరకు.. మూడు కిలోమీటర్ల మార్గంలో ఏకంగా 600 మీటర్ల పొడవున, 6 నుంచి 7 అడుగుల ఎత్తున గోడ కడుతున్నారు. మురికివాడకు ముసుగేసే ఈ కార్యక్రమం పేరు ‘సుందరీకరణ’.
2020-02-13 Read Moreతనను చట్ట విరుద్ధంగా సస్పెండ్ చేశారంటూ ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఎ.బి. వెంకటేశ్వరరావు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (సిఎటి)ని ఆశ్రయించారు. రాజకీయ ఒత్తిళ్లతో జరిగిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయగా, అధికారికంగా గురువారమే ఏబీకి సమాచారం చేరింది. ఆయన వెంటనే ట్రిబ్యునల్ లో పిటషన్ దాఖలు చేశారు. గత మే 31 నుంచి తనకు వేతనం కూడా చెల్లించడంలేదని ఏబీ ట్రిబ్యునల్ కు నివేదించారు.
2020-02-13అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల ఇండియా పర్యటనకు సిద్ధమవుతున్న వేళ.. ఆ దేశ సెనెటర్లు నలుగురు కాశ్మీర్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. సెనెటర్లు క్రిస్ వాన్ హాలెన్, టాడ్ యంగ్, రిచర్డ్ జె. డర్బిన్, లిండ్సే ఒ. గ్రహమ్ ఉమ్మడిగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపీకి బుధవారం లేఖ రాశారు. 370 అధికరణ రద్దు చేశాక మానవ హక్కుల స్థితి, ఇండియాలో మత స్వేచ్ఛపై అంచనాకు రావాలని కోరారు. అత్యంత సుదీర్ఘ కాలం ఇంటర్నెట్ ను నిలిపివేసిన ప్రజాస్వామ్య దేశం ఇండియానేనని వారు ఎత్తి చూపారు.
2020-02-13 Read Moreలక్నో కోర్టు ఆవరణలో ఓ లాయర్ లక్ష్యంగా విసిరిన నాటు బాంబు తాకిడికి ఇద్దరు గాయపడ్డారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి కిలోమీటరు దూరంలో జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి సమీపంలో ఈ దాడి జరిగింది. సంజీవ్ లోధి అనే న్యాయవాదిపై బాంబు విసిరారు. ఆయన మరో లాయర్ జీతు యాదవ్ దీనికి బాధ్యుడని ఆరోపించారు. ఈ ఘటన తర్వాత మరో మూడు బాంబులను పోలీసులు కనుగొన్నారు.
2020-02-13వంట గ్యాస్ ధరను భారీగా పెంచడంపై యూపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా నిరసన తెలిపారు. కొంతమంది ఏకంగా ఎల్.పి.జి. సిలిండర్లను వీపుపై మోసుకుంటూ అసెంబ్లీకి వచ్చారు. గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ప్రసంగాన్ని ప్రారంభించగానే... ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీ హాలు మధ్యలోకి వచ్చి నిరసన నినాదాలు ప్రారంభించారు. వారిలో కొందరు సిఎఎ, ఎన్.ఆర్.సి. వ్యతిరేక ప్లకార్డులు ప్రదర్శించారు. సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలు నిరసనల్లో పాల్గొన్నారు.
2020-02-13రాజకీయ, వ్యక్తిగత, రాష్ట్ర సంబంధ అంశాల జమిలి ఎజెండాతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలవనున్నారు. సీబీఐ, ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలన్న జగన్ విన్నపాలను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. శాసన మండలి రద్దు నిర్ణయం ప్రతిష్ఠాత్మకంగా మారింది. వీటితోపాటు రాష్ట్ర విభజన హామీలు కూడా కేంద్ర హోం శాఖకు సంబంధించినవే. ఢిల్లీలో బీజేపీ ఘోర పరాజయం తర్వాత అమిత్‌షా అపాయింట్ మెంట్ దొరికడం గమనార్హం.
2020-02-13‘‘గెలుపు గుర్రాలకే టికెట్లు’’... ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్ధులను ఫిల్టర్ చేయడానికి ఉపయోగించే తారక మంత్రం ఇది. ఆ విషయంపై సుప్రీంకోర్టు ఏమందంటే..‘‘నేర చరిత్ర ఉన్న అభ్యర్ధిని ఎంపిక చేయడానికి గెలువు అవకాశం ఒక్కటే కారణం కాకూడదు.. అభ్యర్ధుల ఎంపిక వారి ప్రతిభ, సాధించిన అంశాల ఆధారంగా జరగాలి. ఓ అభ్యర్ధిని ఎంపిక చేయడానికి గల కారణాలను ఆ పార్టీ ప్రచురించాలి’’. నేర చరితులపై గురువారం ఇచ్చిన తీర్పులో ఈ వ్యాఖ్యలు చేసింది.
2020-02-13పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్ధుల నేర చరిత్రను మీడియాలో ప్రచురించాలని సుప్రీంకోర్టు మరోసారి రాజకీయ పార్టీలను ఆదేశించింది. అభ్యర్ధులను ఎంపిక చేసిన 48 గంటల్లోగా లేదా నామినేషన్లు వేసిన రెండు వారాల్లోగా (ఏది ముందు అయితే ఆ తేదీన) స్థానిక వార్తా పత్రికలు, పార్టీల వెబ్ సైట్లు, సామాజిక మాథ్యమ పేజీల్లో వివరాలను ప్రచురించాలని స్పష్టం చేసింది. నేరం, విచారణ లేదా దర్యాప్తు దశ అనే సమాచారం ఇవ్వాలని ఆదేశించింది.
2020-02-13మంగళవారం రాత్రి వరకు చైనాలో ‘కరోనా వైరస్’ బారిన పడిన వారి సంఖ్య 44,653కు చేరింది. వారిలో 1,113 మంది మరణించగా 8,204 మంది విషమ పరిస్థితుల్లో ఉన్నారు. మంగళవారం కొత్త కేసులు 3,342 నమోదు కాగా ఒక్క రోజే 97 మంది చనిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 1,117కు చేరింది. కేసుల సంఖ్య 45,200. జపాన్ లో నిలిపి ఉంచిన క్రూయిజ్ ఓడలో వైరస్ సోకినవారి సంఖ్య 175కు పెరిగింది. ఆ ఓడలోని 3,700 మంది కొద్ది రోజులుగా ప్రపంచం నుంచి వేరుగా ఉంటున్నారు.
2020-02-12వారానికి ఐదు పని దినాల విధానాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రవేశపెడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుంచో రెండు రోజుల సెలవు విధానాన్ని అమలు చేస్తుండగా, 7 రాష్ట్ర ప్రభుత్వాలు ఆ బాట పట్టాయి. మహారాష్ట్రలో ఈ నెల 29 నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, పని రోజుల్లో 45 నిమిషాల చొప్పున అదనపు సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఫ్యాక్టరీ నిబంధనలు, పారిశ్రామిక వివాదాల చట్టం వర్తించే ప్రభుత్వ సంస్థల్లో ఈ విధానం ఉండదు.
2020-02-12