‘కరోనా’ వైరస్ వేగవంతమైన విస్తరణ దశలోకి ఇండియా ప్రవేశించింది. గత 24 గంటల్లో దేశంలో 1035 కొత్త కేసులు, 40 మరణాలు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం వెల్లడించింది. గురువారం 787 కేసులు నమోదు కాగా శుక్రవారం మరింతగా పెరిగాయి. పరీక్షలు పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య పెరగడం.. ప్రభుత్వాలు మరింతమందిని పరీక్షించవలసిన అవసరాన్ని స్పష్టం చేస్తోంది. శుక్రవారం నాటికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం 7600 మందికి వైరస్ సోకగా 258 మంది మరణించారు.
2020-04-11కరోనా వైరస్ మారణహోమంలో లక్ష మందికి పైగా బలయ్యారు. శనివారం ఉదయానికి (భారత కాలమానం) ప్రపంచవ్యాప్తంగా 16,96,139 మందికి వైరస్ సోకగా 1,02,669 మంది చనిపోయారు. అత్యధికంగా అమెరికాలో 5,00,399 కేసులు నమోదు కాగా 18,693 మంది మరణించారు. మరణాల్లో (18,849) ఇటలీ మొదటి స్థానంలో ఉండగా.. ఈరోజు అమెరికా అధిగమించనుంది. ‘కరోనా’ కరాళ నృత్యానికి కేంద్ర బిందువైన చైనాలో కట్టడి చేశాక.. యూరప్, అమెరికా ఖండాల్లో వైరస్ విజృంభించింది. కేసుల సంఖ్యలో స్పెయిన్ (1,58,273), ఇటలీ (1,47,577), ఫ్రాన్స్ (1,25,931), జర్మనీ (1,22,171) చైనా కంటే ముందున్నాయి.
2020-04-11తన అభీష్ఠానికి వ్యతిరేకంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేసినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ కు విశ్వరూపం చూపించారు. ప్రభుత్వం ప్రత్యక్షంగా ఎస్ఇసిని తొలగించే అవకాశం లేకపోవడంతో పరోక్షంగా వేటు వేశారు. ఎస్ఇసి పదవీ కాలాన్ని 5 నుంచి 3 సంవత్సరాలకు కుదిస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. పంచాయతీరాజ్ చట్టాన్ని ఆర్డినెన్సుతో సవరించి.. రమేష్ కుమార్ పదవీ కాలం ముగిసిందంటూ వెంటనే జీవో (ఎంఎస్ 617) జారీ చేశారు. ఆర్డినెన్సుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు.
2020-04-10‘కరచాలనం’తో పలకరింపు మానవజాతి సహజ లక్షణాల్లో ఒకటిగా మారిపోయింది. ‘కరోనా’ వైరస్ దెబ్బకు ఇప్పుడు చేయి కలపడం కాదు కదా.. ఎదురెదురుగా నిలబడటానికే భయపడుతున్నారు. ‘కరోనా’ పోయినా ఇకపై ‘కరచాలనం’ కష్టమేనంటున్నారు అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథొనీ ఫౌసి. కరచాలనం చేయకపోవడం కేవలం ‘కరోనా’నే కాకుండా ఇతర ఫ్లూల వ్యాప్తినీ తగ్గిస్తుందని ‘వాల్ స్ట్రీట్ జర్నల్’తో మాట్లాడుతూ ఫౌసి చెప్పారు. ‘‘మనం మళ్ళీ ఎప్పటికైనా కరచాలనం చేయగలమని నేను అనుకోవడంలేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
2020-04-10ఓ అంతు పట్టని న్యూమోనియా ‘వుహాన్’ సముద్రజీవుల మార్కెట్ చుట్టూ వ్యాపిస్తున్నట్టు చైనా ప్రభుత్వ వెబ్ సైట్ ఒకటి 2019 డిసెంబరు 31న వెల్లడించింది. ఆరోజుకి పేరు లేని వైరస్ ముందుగా చైనాను.. తర్వాత ప్రపంచాన్ని చుట్టేసింది. 100 రోజుల్లో 182 దేశాల్లో 15 లక్షల మందికి సోకి దాదాపు 90 వేల మందిని బలి తీసుకుంది ఈ మహా మహమ్మారి (కరోనా). ప్రపంచ యుద్ధాలతో ప్రభావితం కాని దేశాలు సైతం ఈ వైరస్ పేరు వింటే వణికిపోతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, పెంచుకున్న ఆయుష్షును తుంచుతున్న ఈ మహమ్మారి అంతు చూసే ఔషధం ఇంతవరకు లేకపోవడమే విషాదం.
2020-04-09తమిళనాడుకు ‘తబ్లిఘి జమాత్’ దెబ్బ అసాధారణంగా తగిలింది. రాష్ట్రంలో ‘కరోనా’ పాజిటివ్ కేసుల్లో 91.49 శాతానికి మూలం నిజాముద్దీన్ ఆధ్యాత్మిక సమావేశాలేనని ఆ రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. గురువారం వరకు రాష్ట్రంలో 834 పాజిటివ్ కేసులు నమోదైతే.. వాటిలో 763 (91.49%)కి మూలం ఒక్కటేనని తమిళనాడు ప్రభుత్వ ఆరోగ్య శాఖ కార్యదర్శి బీలా రాజేష్ చెప్పారు. అధికారికంగా ‘తబ్లిఘి’ పేరు చెప్పకుండానే ఆమె వివరాలు వెల్లడించారు. గురువారం కొత్తగా 96 మందికి వైరస్ పాజిటివ్ తేలగా వారిలో 84 మంది (87.5%)కి ‘ఒకే మూలం’ నుంచి వైరస్ వ్యాపించిందని ఆమె చెప్పారు.
2020-04-09దేశంలో ‘కరోనా’ వైరస్ సృష్టించిన ప్రస్తుత పరిస్థితి ‘జాతీయ ఎమర్జెన్సీ’ వంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మరిన్ని కఠిన నిర్ణయాలు తప్పవని ఆయన సంకేతాలిచ్చారు. 21 రోజుల ‘లాక్ డౌన్’ వచ్చే వారం (14న) ముగుస్తున్నందున.. మోడీ బుధవారం వివిధ పార్లమెంటరీ పార్టీల నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాను ముఖ్యమంత్రులతో మాట్లాడుతూనే ఉన్నానని, వారితో పాటు జిల్లా కలెక్టర్లలోనూ ‘లాక్ డౌన్’ ఒక్కసారిగా ఎత్తివేయవద్దనే విషయంలో ఏకాభిప్రాయం ఉందని మోడీ చెప్పారు. ఆంతరంగిక సమావేశంలో ప్రధాని మాట్లాడిన అంశాల ఆడియో క్లిప్ ను ఆయన కార్యాలయమే లీక్ చేసింది.
2020-04-08ప్రపంచం మొత్తంలో అమెరికాను.. అమెరికాలో న్యూయార్క్ రాష్ట్రాన్ని.. ‘కరోనా’ ఎక్కువగా కలవరపెట్టింది. న్యూయార్క్ రాష్ట్రం వైరస్ కేసుల సంఖ్యలో మిగిలిన అన్ని దేశాలనూ దాటిపోయింది. బుధవారం వరకు ఈ ఒక్క రాష్ట్రంలోనే 1,49,316 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. స్పెయిన్ లో 1,46,690, ఇటలీలో 1,39,422 నమోదయ్యాయి. అమెరికా మొత్తంలో వైరస్ కేసులు 4,17,000 దాటగా 14,100 మంది మరణించారు. న్యూయార్క్ రాష్ట్రంలో 24 గంటల్లోనే 779 మంది మరణించారు. తాజా సమాచారం ప్రకారం అమెరికాలో ‘కరోనా’ కేసులు 4,29,052కి, మరణాలు 14,695కి పెరిగాయి.
2020-04-09‘కరోనా’పై పోరాటంకోసం ప్రపంచం మొత్తం నుంచి వ్యక్తిగత రక్షణ పరికరాలు, మందులను దిగుమతి చేసుకుంటున్న అమెరికాకు.. వియత్నాం నుంచి 4,50,000 సూట్లు దిగుమతి అయ్యాయి. బుధవారం ఉదయం (అమెరికా కాలమానం) డాలస్ విమానాశ్రయంలో ఈ మొత్తం దిగినట్టు డొనాల్డ్ ట్రంప్ కొద్దిసేపటి క్రితం స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. అయితే, క్రెడిట్ మొత్తాన్ని తమ కంపెనీలకే ఇచ్చుకున్నారు ట్రంప్. రెండు ‘గ్రేట్ అమెరికన్ కంపెనీలు’ డ్యూపాంట్, ఫెడ్ ఎక్స్, వియత్నాంలోని మిత్రుల భాగస్వామ్యంతో ఇది సాధ్యమైందన్న ట్రంప్.. థ్యాంక్స్ మాత్రం తమ కంపెనీలకే చెప్పారు.
2020-04-09‘కరోనా’ మహమ్మారికి వణుకుతున్న మహారాష్ట్ర ‘లాక్ డౌన్’ విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. దిగ్బంధపు నిబంధనలను ఉల్లంఘించి ‘మార్నింగ్ వాక్’ చేస్తున్న 12 మందిని నవీ ముంబైలో పోలీసులు అరెస్టు చేయడం దీనికి నిదర్శనం. బుధవారం నవీ ముంబై లోని వివిధ ప్రాంతాల్లో వాకింగ్ చేస్తూ కనిపించిన ఈ 12 మందినీ అరెస్టు చేసి తర్వాాత బెయిలుపై విడుదల చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు సెక్షన్ 188 కింద ఆ డజను మందిపై కేసు నమోదు చేశారు. ‘కరోనా’ దెబ్బకు కాలినడక కూడా నేరమైపోయింది!.
2020-04-08