ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలు పాకిస్తాన్ పార్లమెంటులో చర్చకు వచ్చాయన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపణలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఖండించారు. పాకిస్తాన్ భూభాగంపై దాడితో కర్నాటకలో బీజేపీకి 22 లోక్ సభ సీట్లు వస్తాయన్న ఎడ్యూరప్ప మాటలపైనే అక్కడ ప్రస్తావించారని, వచ్చే ఎన్నికలకోసమే మోదీ దాడులు చేస్తారన్న చర్చ జరిగిందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని రెండేళ్ల క్రితమే బీజేపీ నేతలు తనతో అన్నారని పవన్ కళ్యాణ్ చెప్పి విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఎన్నికలకోసం దేశ భద్రతను పణంగా పెట్టవద్దని ప్రధానికి హితవు పలికారు.
2019-03-01సౌదీ అరేబియా యువరాజు వస్తే అసాధారణంగా ఎయిర్ పోర్టుకు వెళ్ళి మరీ స్వాగతం చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ కస్టడీనుంచి విడుదలైన ఐఎఎఫ్ పైలట్ అభినందన్ ను స్వాగతించడానికి వాఘా సరిహద్దుకు ఎందుకు వెళ్ళలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ‘ఇదేనా మీ దేశభక్తి? వాఘా వెళ్లకుండా నన్ను విమర్శించడానికి విశాఖ వస్తారా?’ అని మండిపడ్డారు. ప్రధాని మోదీ శుక్రవారం విశాఖ సభలో తనపైన, మహాకూటమి నేతలపైనా చేసిన ఆరోపణలకు ఏపీ సీఎం ఘాటుగా బదులిచ్చారు. దేశంకోసం ప్రాణాలివ్వడానికి ఐదు కోట్ల ఆంధ్రులూ సిద్ధమన్న చంద్రబాబు, దేశభక్తిని రాజకీయాలకు ముడిపెట్టవద్దని ప్రధానికి హితవు పలికారు.
2019-03-01యు టర్న్ నేతలు గత ఐదేళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదంటూ చంద్రబాబు పాలనపై ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. సిఎం వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రధాని ఆరోపించారు. విశాఖపట్నం సభలో చంద్రబాబు పేరెత్తకుండానే... సిఎం, రాష్ట్ర నేతలు, యు టర్న్ నేతలు, ‘కొడుకులకోసం’ అంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర నేతలు ప్రజల కోసం రాత్రీ పగలు కష్టపడినట్టుగా చెప్పుకుంటున్నారని, కానీ వాస్తవంలో తమ కుమారుల ప్రగతికోసమే పని చేశారని మోదీ వ్యాఖ్యానించారు.
2019-03-01భావ సారూప్యత లేని పార్టీల కూటమికి మద్ధతివ్వడం అంటే.. కేంద్రంలో బలహీన ప్రభుత్వాన్ని కోరుకోవడమేనని, అదే జరిగితే పాకిస్తాన్ బలపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. విశాఖపట్నం కేంద్రంగా నూతన రైల్వే జోన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన మోదీ, ఈ సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ప్రపంచమంతా పాకిస్తాన్ నుంచి సమాధానాలు కోరుతున్న సమయంలో, ఇండియాలోని కొంతమంది భద్రతా దళాల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేలా ప్రకటనలు చేస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
2019-03-01ఫిబ్రవరి 27న పాకిస్తాన్, ఇండియా యుద్ధ విమానాల ఘర్షణ సమయంలో సరిహద్దులు దాటిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ రెండు రోజుల తర్వాత విడుదలయ్యారు. శుక్రవారం సాయంత్రం ఆయనను పాకిస్తాన్ ఆర్మీ అధికారులు వాఘా సరిహద్దు ద్వారం వద్ద భారత అధికారులకు అప్పగించారు. బుధవారం పాకిస్తాన్ ఆర్మీ కస్టడీలోకి వెళ్లిన అభినందన్ ను ‘శాంతి సంకేతం’గా విడుదల చేయనున్నట్టు గురువారం ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పార్లమెంటులో ప్రకటించిన సంగతి తెలిసిందే.
2019-03-01సామాజిక మాథ్యమ వేదిక ట్విట్టర్లో ఇప్పుడీ రెండు నినాదాలు మారుమోగుతున్నాయి. రెండు రోజుల క్రితం పాకిస్తాన్ కు పట్టుబడిన వింగ్ కమాండర్ గురువారం తిరిగి వస్తున్న సందర్భంగా సామాజిక మాథ్యమాల్లో స్వాగత సందేశాలు వెల్లువెత్తాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ వెనక్కు వెళ్లిపోవాలంటూ అదే స్థాయిలో డిమాండ్లు వెల్లువెత్తాయి. #WelcomeHomeAbhinandan, #GoBackModi హ్యాష్ ట్యాగ్ లు గురువారం ట్విట్టర్ ట్రెండింగ్ అంశాల్లో 1, 2 స్థానాల్లో నిలిచాయి.
2019-03-01కొన్ని పార్టీలు ‘మోదీ ద్వేషం’తో దేశాన్ని ద్వేషించడం ప్రారంభించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత.. భద్రతా దళాల త్యాగాలను బీజేపీ, మోదీ రాజకీయంగా వాడుకుంటున్నారని ప్రతిపక్షాలు విమర్శించిన నేపథ్యంలో మోదీ ఎదురు దాడికి దిగారు. శుక్రవారం వరుస ట్వీట్లతో మోదీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘భద్రతా దళాలకు దేశమంతా దన్నుగా నిలిస్తే..ఆ పార్టీలు మాత్రం అనుమానిస్తున్నాయి. ఉగ్రవాదంపై మన పోరాటానికి ప్రపంచమంతా మద్ధతు ఇస్తుంటే కొన్ని పార్టీలు మాత్రం ఈ పోరాటాన్ని అనుమానిస్తున్నాయి’ అని విమర్శించారు.
2019-03-01 Read Moreజైషే మహ్మద్ సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజర్ తమ దేశంలోనే ఉన్నట్టు పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషి అంగీకరించారు. అయితే, మసూద్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఇంటినుంచి బయటకు కూడా వెళ్లలేని స్థితిలో ఉన్నారని చెప్పుకొచ్చారు. పుల్వామాలో ఆత్మహుతి దాడి సహా భారత దేశంలో అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు జైషే మహ్మద్ కారణం. అయితే, ఆ సంస్థ చీఫ్ మసూద్ పాకిస్తాన్ లోనే ఉన్నట్టు ఇప్పటివరకు ఆ దేశం ఒప్పుకోలేదు. తాజాగా సిఎన్ఎన్ ఇంటర్వ్యూలో ఖురేషి ఈ మాట చెప్పారు.
2019-03-01జపాన్ యెన్ మినహాయిస్తే.. ఆసియా కరెన్సీలలో ఈ ఏడాది ఎక్కువగా బలహీనపడింది రూపాయే. ఇప్పుడే ఏముంది.. ముందుంది ముసళ్ల పండుగ అంటున్నారు కొందరు నిపుణులు. సెప్టెంబర్ నాటికి రూపాయి మరింత పతనమవుతుందని, డాలర్ విలువ రూ. 80కి పెరుగుతుందని రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా తాజాగా అంచనా వేసింది. నిన్ననే విడుదలైన ప్రభుత్వ డేటా ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీడీపీ కేవలం 6.6 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో రూపాయి విలువపై ఆర్.బి.సి. అంచనా ఆందోళన కలిగిస్తోంది.
2019-03-01ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ రోడ్ల నిర్మాణానికిగాను ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు (ఎఐఐబి) 45.5 కోట్ల డాలర్ల మేరకు రుణం ఇవ్వనుంది. ఈ రుణ ఒప్పందంపై గురువారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ, ఎఐఐబి అధికారులు సంతకాలు చేశారు. ప్రస్తుత మారకం విలువ ప్రకారమైతే ఎఐఐబి రుణ మొత్తం రూ. 3222 కోట్లు ఉంటుంది. 13 జిల్లాల్లో సుమారు 3,300 నివాస ప్రాంతాలను కలుపుతూ రోడ్లను నిర్మించడానికి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. మొత్తం ప్రాజెక్టు విలువ 66.6 కోట్ల డాలర్లు కాగా అందులో ఎఐఐబి రుణం 45.5 కోట్ల డాలర్లు. రాష్ట్ర ప్రభుత్వం వాటా 21.1 కోట్ల డాలర్లు.
2019-03-01