ప్రపంచ వ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్య గత ఏడాదికంటే కొంత తగ్గినా ఉన్న ఆయుధాలను అన్ని దేశాలూ ఆధునీకరిస్తున్నట్టు స్టాక్ హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధాన సంస్థ (సిప్రి) తెలిపింది. అమెరికా, రష్యా, యుకె, ఫ్రాన్స్, చైనా, ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయిల్, ఉత్తర కొరియాల వద్ద 2019 ప్రారంభంలో 13,865 అణ్వాయుధాలు ఉన్నట్టు సోమవారం వెల్లడైన ‘సిప్రి’ ఇయర్ బుక్ 2019లో పేర్కొన్నారు. ప్రస్తుతం 3,750 అణ్వాయుధాలను మోహరించగా, వాటిలో 2000 ప్రయోగించడానికి పూర్తి సన్నద్ధతతో ఉన్నాయని పేర్కొంది.
2019-06-17 Read Moreసోమవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 17-జూలై 26 మధ్య లోక్ సభ 30 రోజులు, రాజ్యసభ 27 రోజులు సమావేశం కానున్నాయి. 17వ లోక్ సభ మొదటి సమావేశాల్లో ముందుగా కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తర్వాత స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటాయి. 2019-20 సంవత్సరానికి పూర్తి బడ్జెట్ ను జూలై 5న నూతన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. రాజ్యసభకు ఇవి 249వ సమావేశాలు.
2019-06-17సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ‘ఒకే దేశం-ఒకేసారి ఎన్నికలు’ నినాదాన్ని బీజేపీ మళ్లీ తెరపైకి తెచ్చింది. ఇదే ప్రధాన ఎజెండాగా ఈ నెల 19వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. భారత స్వాతంత్రానికి 2022లో 75 వసంతాలు నిండుతున్నందున చేయవలసిన ఉత్సవాలు, మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు తదితర అంశాలు కూడా ఎజెండాలో ఉన్నాయి.
2019-06-16మన్మథుడు సినిమా విడుదలైన 17 సంవత్సరాల తర్వాత దానికి సీక్వెల్ రాబోతోంది. ఆగస్టు 9వ తేదీన ధియేటర్లకు రానున్న ఈ సినిమా టీజర్ గురువారం విడుదలైంది. తొలి భాగంలో ఓ సాఫ్ట్ కేరక్టర్ తో అమ్మాయిలకు దూరంగా ఉన్న మన్మథుడు రెండో భాగంలో మాత్రం ఘాటైన డైలాగులతో సార్ధక నామధేయుడుగా కనిపించనున్నట్టు టీజర్ చెబుతోంది. 60వ ఏట వయసు కాస్త తగ్గించి చూపించడానికి నాగార్జున అదనపు కసరత్తు చేశారు. అయితే, సినిమా సబ్జెక్టుపై ట్విట్టర్లో మిశ్రమ స్పందన వచ్చింది.
2019-06-13ఆక్రమిత గోలన్ హైట్స్ ప్రాంతంలో ఇజ్రాయిల్ పౌరులు నివాసాలు ఏర్పరచుకున్న ప్రాంతానికి ఆ దేశం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు పెట్టింది. ఆ ప్రాంతంపై ఇజ్రాయిల్ సార్వభౌమాధికారాన్ని అమెరికా గుర్తించినందుకు ప్రతిగా ‘ట్రంప్ హైట్స్’ అని నామకరణం చేసింది. ట్రంప్ ను ‘గొప్ప స్నేహితుడు’గా వర్ణించిన ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ.. ఆదివారం ఈ నివాస ప్రాంతాన్ని ప్రారంభించారు. ఒకప్పుడు సిరియాలో భాగమైన ‘గోలన్ హైట్స్’ను 1967లో జరిగిన యుద్దంలో ఇజ్రాయిల్ ఆక్రమించింది.
2019-06-17 Read Moreబాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘‘సాహో’’. ఈ మూవీ టీజర్ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో గురువారం విడుదలైంది. భారీ పోరాట సన్నివేశాలు, గ్రాఫిక్స్ సమ్మిళితమై ఉన్న టీజర్ సామాజిక మాథ్యమాల్లో సంచలనంగా మారింది. యువి క్రియేషన్స్ నిర్మాణంలో సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సాహో’ను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నట్టు ఇదివరకే ప్రకటించారు. ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ నటించింది.
2019-06-13ప్రపంచ కప్ 2019లో ఇండియా దాయాది పాకిస్తాన్ జట్టును చిత్తు చేసింది. ఆదివారం యుకెలోని మాంచెస్టర్ వేదికగా జరిగిన పోటీలో 89 పరుగుల భారీ తేడాతో ఇండియా విజయం సాధించింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా 50 ఓవర్లలో ఇండియా 336 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఆడే సమయంలో వర్షం కురవడంతో ఇన్నింగ్స్ ను 40 ఓవర్లకు, లక్ష్యాన్ని 302 పరుగులకు కుదించారు. అయితే, నిర్దేశిత ఓవర్లలో పాకిస్తాన్ 6 వికెట్ల నష్టానికి కేవలం 212 పరుగులు చేయగలిగింది.
2019-06-16ఇండియా ఇచ్చిన భారీ లక్ష్యం (337)తో రంగంలోకి దిగిన పాకిస్తాన్ జట్టు ఆరంభంలోనే ఒడిదుడుకులకు లోనైంది. ఐదో ఓవర్లో ఐదో బంతికి ఇంజమామ్ ఉల్ హక్ ఔటయ్యాడు. ఇప్పటికి పాకిస్తాన్ స్కోరు కేవలం 13 పరుగులు. మాంచెస్టర్ వేదికగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్తాన్ తరఫున ఓపెనర్లుగా ఇంజమామ్ ఉల్ హక్, ఫక్తర్ జమాన్ రంగంలోకి దిగారు. హక్ 18 బంతులు ఆడి 7 పరుగులుకే పెవిలియన్ దారి పట్టాడు.
2019-06-16అతి వేగంగా 11 వేల పరుగులు చేసిన ఆటగాడిగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. కోహ్లీ 222 ఇన్నింగ్స్ లో ఈ మైలు రాయిని అధిగమించగా అతని వేగానికి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. సచిన్ టెండూల్కర్ 276 ఇన్సింగ్స్, రికీ పాంటింగ్ 286, గంగూలీ 288, కల్లిస్ 293 ఇన్సింగ్స్ ఆడి 11 వేల పరుగులు సాధించారు. 11 వేల పరుగులకోసం సచిన్ 55 మ్యాచులు అదనంగా ఆడాల్సి వచ్చింది. వేగంగా 10 వేల పరుగులు సాధించిన రికార్డు కూడా కోహ్లీ పేరిటే ఉంది.
2019-06-16వర్షం ఆగింది.. పరుగుల వర్షం కురిసింది! పాకిస్తాన్ జట్టుతో మాంచెస్టర్ వేదికగా జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ పోటీలో ఇండియా బ్యాట్స్ మెన్ చెలరేగిపోయారు. రోహిత్ శర్మ ఆసాధారణ సెంచరీతో 50 ఓవర్లకు ఇండియా 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ కెప్టెన్ భారీ మూల్యాన్నే చెల్లించారు. ఫలితంగా ఛేజింగ్ లో భారీ లక్ష్యాన్ని ఎదుర్కోవలసి వస్తోంది. ప్రపంచ కప్ 2019లో అత్యంత ఆసక్తికరమైన పోటీ మరింత రసవత్తరంగా మారింది.
2019-06-16