కేరళ, కర్నాటక, మహారాష్ట్రలలో భారీ వర్షాలు, వరదల కారణంగా 109 మంది మరణించినట్టు సమాచారం. మూడు రాష్ట్రాల్లో రక్షణ, సహాయక చర్యలకోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ 53 విపత్తు సహాయ బృందాలను పంపింది. 2005లో కురిసిన వర్షపాతానికి రెట్టింపు కంటే ఎక్కువ రావడంవల్ల వరదలు సంభవించాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. కర్నాటకలో 45 ఏళ్లలో ఇదే పెద్ద ఉత్పాతమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యెడియూరప్ప వ్యాఖ్యానించారు.
2019-08-10 Read Moreకాంగ్రెస్ కొత్త సారథి ఎంపిక ఈ రాత్రి 9 గంటలకల్లా పూర్తవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగం ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ’ కొత్త సారథి ఎంపికకోసం శనివారం సమావేశమైంది. పార్టీ రాష్ట్ర కమిటీల నేతలు, 5 జోనల్ కమిటీల బాధ్యుల చర్చల అనంతరం ఎంపిక జరుగుతుంది. 2019 ఎన్నికల్లో పార్టీ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. శనివారం నాటి సమావేశ ప్రారంభంలో హాజరైన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ.. తర్వాత జరిగిన చర్చల్లో పాల్గొనలేదు.
2019-08-10 Read Moreభారత పార్లమెంటుకు కొత్త భవనం నిర్మించాలన్న ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉందని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. ప్రస్తుత భవనాన్నే ఆధునీకరించవచ్చని, అయితే కొత్త భవనం అవసరమన్న భావన ఎక్కువగా వ్యక్తమవుతోందని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. పార్లమెంటు భవనాన్ని ఆధునీకరించాలని.. ఇటీవల ఉభయ సభల అధిపతులు చెప్పారు. అయితే, ‘‘అతి పెద్ద ప్రజాస్వామ్యపు పార్లమెంటు భవనం అద్భుతంగా, ఆకర్షణీయంగా ఉండాలన్నది మా అందరి ఆకాంక్ష’’ అని ఓం బిర్లా శనివారం వ్యాఖ్యానించారు.
2019-08-10 Read Moreఇండియాతో వాణిజ్య సంబంధాలను అధికారికంగా నిలిపివేసింది పాకిస్తాన్. జమ్మూ -కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని (370వ అధికరణను) రద్దు చేసినందుకు ప్రతిగా.. పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ, పార్లమెంటు ఇదివరకే కొన్ని నిర్ణయాలను ప్రకటించాయి. వాటిని శనివారం పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదించింది. పాకిస్తాన్-ఆప్ఘనిస్తాన్ ట్రాన్సిట్ ఒప్పందం కింద వచ్చే దిగుమతులను సైతం నిలిపివేసినట్టు ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేక సమాచార సహాయకుడు ఫిర్దౌస్ ఆషిక్ అవాన్ చెప్పారు.
2019-08-10 Read Moreజమ్మూ-కాశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన 370 అధికరణంపై కేంద్ర ప్రభుత్వ చర్యలను నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్.సి.) ఎంపీలు మహ్మద్ అక్బర్ లోన్, జస్టిస్ (మాజీ) హస్నయిన్ మసూదీ శనివారం సుప్రీంకోర్టులో సవాలు చేశారు. కాశ్మీర్ ప్రజల ఆమోదం లేకుండా వారి హక్కులను హరించే చర్యలకు పార్లమెంటు ఆమోదం, తదనుగుణంగా జారీ అయిన రాష్ట్రపతి ఉత్తర్వులు ‘రాజ్యాంగవిరుద్ధం’ అని వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు. రాష్ట్ర విభజననూ ‘రాజ్యాంగ విరుద్ధం’గా ప్రకటించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.
2019-08-10 Read More86 శాతం అసెంబ్లీ సీట్లతో స్థిరమైన ప్రభుత్వం, కేంద్రం, పొరుగు రాష్ట్రాలతో సఖ్యత బలాలుగా సులభతరమైన అవినీతిరహిత పాలనను అందించగలమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. శుక్రవారం విజయవాడలో 30 దేశాల దౌత్యప్రతినిధులతో సమావేశమైన సిఎం, రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించాల్సిందిగా అభ్యర్ధించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పిపిఎల) రద్దు విషయంలో తొలుత కొంత ఆందోళన వ్యక్తమైనా తర్వాత పెట్టుబడిదారుల్లో నమ్మకం కలుగుతుందని జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
2019-08-10జమ్మూ-కాశ్మీర్ రాష్ట్ర విభజన చట్టానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రాన్ని రెండుగా విభజించి జమ్మూ-కాశ్మీర్ ప్రాంతాన్ని అసెంబ్లీ సహిత కేంద్రపాలిత ప్రాంతంగా, లడక్ ప్రాంతాన్ని అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. భారత తొలి హోం శాఖ మంత్రి, 565 సంస్థానాల విలీనంలో కీలక పాత్రధారిగా భావించే సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (అక్టోబర్ 31) నుంచి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉనికిలోకి వస్తాయి.
2019-08-09 Read Moreజాతీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు పడకేసింది. శుక్రవారం వెల్లడైన అధికారిక గణాంకాల ప్రకారం.. 2019 జూన్ నెలలో దేశంలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు కేవలం 2 శాతం. 2018లో ఇదే నెలలో వృద్ధి రేటు 7 శాతం. ఉప రంగాల వారీగా చూస్తే.. మైనింగ్, మాన్యుఫాక్చరింగ్ బాగా వెనుకబడ్డాయి. 2018 జూన్ నెలలో తయారీ రంం 6.9 శాతం వృద్ధిని నమోదు చేస్తే ఈ ఏడాది అది 1.2 శాతానికి పడిపోయింది. మైనింగ్ గత ఏడాది జూన్ నెలలో 6.5 శాతం వృద్ధిని నమోదు చేస్తే ఈసారి 1.6 శాతానికి పడిపోయింది.
2019-08-09 Read More‘యూరి-ద సర్జికల్ స్ట్రైక్’ ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకత్వం (పాటలు), ఉత్తమ సంగీత దర్శకత్వం (నేపథ్య సంగీతం), ఉత్తమ సౌండ్ డిజైన్ తదితర విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంగా తీసిన ఈ చిత్రానికి.. 2019 జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీ పట్టం కట్టింది. వివిధ భాషల్లోని 419 చిత్రాలు ఈ ఏడాది పోటీ పడగా గుజరాతీ చిత్రం ‘హెల్లారో’ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ గా అవార్డు దక్కించుకుంది.
2019-08-09 Read Moreయువ కథానాయిక కీర్తి సురేష్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డుకు ఎంపికయ్యారు. ‘మహానటి’లో నటనకు గాను ఆమె ఈ అవార్డు దక్కించుకున్నారు. జాతీయ చలనచిత్ర అవార్డులను జ్యూరీ శుక్రవారం ప్రకటించింది. ఉత్తమ నటుడు కేటగిరిలో ఇద్దరిని ఎంపిక చేశారు. అంధాధూన్ చిత్రంలో నటించిన ఆయుష్మాన్ ఖురానా, ‘యూరి-ద సర్జికల్ స్ట్రైక్’ హీరో విక్కీ కౌశల్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డు దక్కించుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా స్వానంద్ కిర్కిరే (చుంభక్), ఉత్తమ సహాయ నటిగా సురేఖ సిక్రి (బధాయి హో) ఎంపికయ్యారు.
2019-08-09