అమిత్ షా కేంద్ర మంత్రివర్గంలో చేరతారని భావిస్తున్న తరుణంలో బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు ఉంటారన్న చర్చ మొదలైంది. అయితే, పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని అమిత్ షా భావిస్తున్నట్టు బుధవారం వార్తలు వచ్చాయి. మంత్రివర్గంలో అమిత్ షా చేరితే ముఖ్యమైన హోం, ఆర్థిక, రక్షణ శాఖల్లో ఏదో ఒకటి ఆయనకు కేటాయించే అవకాశం ఉందంటున్నారు. ఆయన మంత్రివర్గంలో చేరతారా.. లేక బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతారా? లేక రెండు బాధ్యతలూ చేపడతారా? అన్నది తేలాల్సి ఉంది.
2019-05-30 Read Moreవైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మతంనుంచి తిరిగి హిందూ మతంలోకి మారారని, స్వరూపానంద ఈ ‘ఘర్ వాపసీ’ కార్యక్రమాన్ని జరిపించారని సోషల్ మీడియాలో ఓ వీడియో, ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. ఇది నిజం కాదు. 2016 ఆగస్టు 10న జగన్ ఛానల్ ‘సాక్షి’ అప్ లోడ్ చేసిన వీడియోను ఇప్పుడు షేర్ చేస్తున్నారు. అప్పట్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం జగన్ రిషికేేష్ లో హోమం నిర్వహించారని ‘సాక్షి’ పేర్కొంది. అప్పటి ఫొటోలు శారదా పీఠం వెబ్ సైట్లో ఉన్నాయి.
2019-05-28‘అక్షయపాత్ర’ సహ వ్యవస్థాపకుడు మోహన్ దాస్ పాయ్ వైఎస్ జగన్ బావ, క్రైస్తవ మత బోధకుడు అనిల్ పైన చేసిన ఓ రీట్వీట్ కలకలం రేపింది. అనిల్ దెయ్యాల్ని వదిలిస్తున్నట్టుగా ఉన్న ఓ మతప్రచార వీడియోను పాయ్ రీట్వీట్ చేశారు. ఏపీలో ఇలాంటి మోసగాళ్ళు ఉన్నారు చూడండంటూ...మూఢనమ్మకాల్ని పెంచుతున్నవారిని ఎందుకు ప్రాసిక్యూట్ చేయడంలేదని ప్రశ్నించారు. ఇలాంటి మోసగాళ్ల నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలని వైఎస్ జగన్ కు సూచించారు.
2019-05-29 Read Moreవైఎస్ జగన్ పదవీ ప్రమాణ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హాజరు కాబోవడంలేదు. పార్టీ తరపున మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ రేపు జగన్ నివాసంలో ఆయనను కలసి శుభాకాంక్షలు తెలపనున్నారు. రాజ్ భవన్ వంటి వేదికలపై కార్యక్రమం ఏర్పాటు చేస్తే చంద్రబాబు హాజరు కావడం హూందాగా ఉండేదని, కానీ బహిరంగ వేదికపై ప్రమాణం చేస్తున్నందున వెళ్ళడం సరి కాదని పార్టీ నేతలు వారించినట్టు సమాచారం.
2019-05-29గురువారం జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీ స్వీకార ప్రమాణోత్సవానికి యుపిఎ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరు కానున్నట్టు సమాచారం. రేపు రాష్ట్రపతి భవన్ లోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లో మోదీ ప్రమాణ కార్యక్రమం జరుగుతుంది. ఎన్నికల ప్రచారంలో పరుషమైన పదజాలంతో మోదీ మరణించిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపైనా విమర్శలు చేయగా.. ఆయన కుమార్తె ప్రియాంకాగాంధీ ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే.
2019-05-29 Read More‘‘నువ్వు మారవు బాబూ’’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ తన పదవీ ప్రమాణ కార్యక్రమానికి హూందాగా చంద్రబాబును ఆహ్వానిస్తే... దానికి వేరే కథ అల్లి వార్త రాయించుకున్నారని మండిపడ్డారు. బుధవారం విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లతో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు ఫోన్ చేసినప్పుడు తాను ప్రక్కనే ఉన్నానని, ‘‘మీరు అనుభవజ్ఞులు, మీ సలహాలు అవసరం’’ అనే మాటలను జగన్ వాడలేదని స్పష్టం చేశారు.
2019-05-29 Read Moreరెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఒక్కొక్కరి తలపై రూ. 1.1 లక్షల చొప్పున అప్పుల భారం ఉందని ఆయన నెల్లూరులో మీడియాతో చెప్పారు. వైఎస్ జగన్ రాష్ట్ర ఆర్థిక స్థితిని గాడిలో పెడతారని ఆనం విశ్వాసం వ్యక్తం చేశారు. 2004లో కూడా చంద్రబాబు ఓటమిపాలైన నాటికి రాష్ట్రం సంక్షోభంలో ఉందన్నారు.
2019-05-29 Read Moreఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గురువారం పదవీ స్వీకార ప్రమాణం చేయనున్న వైఎస్ జగన్, బుధవారం వివిధ ప్రాంతాల్లో వివిధ విశ్వాసాలకు సంబంధించిన ఆలయాల్లో ప్రార్ధనలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం, కడప అమీన్ పీర్ దర్గా, పులివెందుల సి.ఎస్.ఐ. చర్చిలలో జగన్ ప్రార్ధనలు చేశారు. అనంతరం కడప జిల్లాలోనే ఇడుపులపాయలోని తండ్రి రాజశేఖరరెడ్డి సమాధి వద్దకు వెళ్ళి నివాళులు అర్పించారు.
2019-05-29ఆర్థికాభివృద్ధి మందగించిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వైట్ కాలర్ నేరాలు పెరిగినట్టు డేటా కంపెనీ ‘రెఫినిటివ్’ సర్వేలో తేలింది. ఈ నేరాలతో.. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీలకు ఏకంగా 1.45 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 1,01,50,000 కోట్లు) నష్టం వాటిల్లినట్టు సర్వే వెల్లడించింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో 75 శాతం గత ఏడాది తాము ఆర్థిక నేరాలతో నష్టపోయినట్టు పేర్కొన్నాయి. కిందటి సంవత్సరం కంటే నేరాలు 49 శాతం పెరిగాయి.
2019-05-29 Read Moreమ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఉక్రెయిన్ టెన్నిస్ క్రీడాకారిణి హెలెన్ ప్లోస్కినాను జీవితకాలం నిషేధిస్తూ టెన్నిస్ ఇంటెగ్రిటీ యూనిట్ (టిఐయు) నిర్ణయం తీసుకుంది. ఆమెకు 20 వేల డాలర్ల ఫైన్ కూడా విధించింది. 22 సంవత్సరాల ఫ్లోస్కినా మహిళా సింగిల్స్ విభాగంలో 821వ స్థానంలో ఉంది. ఆమె మరో క్రీడాకారిణిని కూడా మ్యాచ్ ఫిక్సర్లకు పరిచయం చేసినట్టు టిఐయు దర్యాప్తులో తేలింది.
2019-05-29 Read More