కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్. జైపాల్ రెడ్డి (77) కన్నుమూశారు. తీవ్ర జ్వరంతో ఈ నెల 20న గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో చేరిన ఆయన ఆదివారం వేకువజామున తుది శ్వాస విడిచారు. జైపాల్ రెడ్డి విద్యార్ధి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా గళం విప్పినవారిలో ఆయనొకరు. 1980లో మెదక్ లోక్ సభ స్థానంలో ఇందిరాగాంధీపైనే పోటీ చేసి ఓడిపోయారు. తర్వాతి పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీలోనే చేరారు.
2019-07-28 Read Moreకర్నాటకలో అధికార కూటమిపై తిరుగుబాటు చేసిన రెబల్ ఎమ్మెల్యేలంతా అనర్హతకు గురయ్యారు. మూడు రోజుల క్రితం ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన స్పీకర్ రమేష్ కుమార్, ఆదివారం మిగిలిన 14 మందిపైనా చర్య తీసుకున్నారు. వారిలో 11 మంది కాంగ్రెస్, ముగ్గురు జెడిఎస్ సభ్యులు. ఈ చర్యతో కర్నాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 208కి తగ్గిపోయింది. సోమవారం విశ్వాస పరీక్ష ఎదుర్కొంటున్న యెడియూరప్పకు మెజారిటీకి అవసరమైన (105) సంఖ్య ఉంది.
2019-07-28 Read Moreఆర్థికంగా వెనకబడిన వర్గాలకు విద్యా ఉద్యోగాల్లో కల్పించిన 10 శాతం రిజర్వేషన్లో.. గత ప్రభుత్వం కాపులకు కేటాయించిన 5 శాతం కోటాను ప్రస్తుత ప్రభుత్వం ఉపసంహరించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు మినహా మిగిలిన వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన అందరికీ ఆ 10 శాతం రిజర్వేషన్ వర్తించేలా జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం 5 శాతాన్ని కాపులకు కేటాయించి, మిగిలిన వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడినవారికి మిగిలిన 5 శాతం వర్తించేలా చట్టం చేసింది.
2019-07-27దేశంలో గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి పనులకు అడ్డుగా ఉన్నాయని ఏకంగా కోటీ తొమ్మిది లక్షల (1,09,75,844) చెట్లను నరికేశారు! అది కూడా అడవులను సంరక్షించాల్సిన అటవీ శాఖ అనుమతి తీసుకునే...!! ఈ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వమే శుక్రవారం లోక్ సభలో వెల్లడించింది. ప్రభుత్వం అనుమతించిన మేరకు జరిగిన ప్రకృతి విధ్వంసమే ఈ స్థాయిలో ఉంటే.. ఏ అనుమతులూ లేకుండా జరిగే కొట్టివేతలు, అగ్ని ప్రమాదాల్లో జరుగుతున్న వినాశనం ఏ స్థాయిలో ఉన్నాయో?!
2019-07-26ఐదేళ్ళ క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘‘మార్ఫింగ్ ఫొటో’’ను ఫేస్ బుక్ లో పోస్టు చేశాడనే కారణంతో ఉత్తరప్రదేశ్ లో ఓ వ్యక్తిని దేశద్రోహం నేరారోపణపై ఇప్పుడు అరెస్టు చేశారు. మీరట్ జిల్లాలో ఫహమ్ అజీమ్ సిద్ధిఖీ అనే వ్యక్తిపై పోలీసులు ఐటి చట్టం 2000, ఐపిసిలోని 124ఎ (దేశద్రోహం) కింద కేసు నమోదు చేశారు. ఈ గురువారం అరెస్టు చేసి జైలుకు పంపారు. అతనికి నేర చరిత్ర ఉందని, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని మీరట్ ఎస్పీ అవినాష్ పాండే తెలిపారు.
2019-07-27 Read Moreఎలక్ట్రిక్ వాహనాలపై పన్నును 12 శాతం నుంచి 5 శాతానికి, ఇవి ఛార్జర్లపై 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఆగస్టు 1వ తేదీనుంచి అమల్లోకి రానుంది. కౌన్సిల్ 36వ సమావేశం శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. స్థానిక సంస్థలు అద్దెకు తీసుకునే ఎలక్ట్రిక్ బస్సులను జీఎస్టీ నుంచి మినహాయించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
2019-07-27 Read Moreజమ్మూ-కాశ్మీర్ విషయంలో కేంద్ర హోం శాఖ శుక్రవారం ఓ అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రానికి అదనంగా 100 కంపెనీల (సుమారు 10 వేల మంది) పారామిలిటరీ బలగాలను పంపడానికి ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని బట్టి కాశ్మీర్లో కేంద్రం సరికొత్త చర్యలేవో తీసుకోబోతోందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే అమరనాథ్ యాత్రకోసం 40 వేల అదనపు పారామిలిటరీ సిబ్బంది కాశ్మీర్లో ఉన్నారు. మరిన్ని బలగాల నిర్ణయంతో.. ఆర్టికల్ 35ఎ తొలగింపుపై ఊహాగానాలు మొదలయ్యాయి.
2019-07-26 Read More2019 రెండో త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో అమెరికా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2.1 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 3.1 శాతంగా నమోదైంది. అమెరికా ప్రభుత్వ విభాగం బ్యూరో ఆఫ్ ఎకనామిక్ అనాలసిస్ (బిఇఎ) శుక్రవారం తాజా గణాంకాలను వెల్లడించింది. పెట్టుబడుల పతనం జీడీపీపై ప్రభావం చూపించిందని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. రెండో త్రైమాసికంలో ఈ మాత్రపు వృద్ధికి ప్రధానంగా దోహదం చేసింది వినియోగమే.
2019-07-26 Read Moreశ్రీలంక దిగ్గజ బౌలర్ లసిత్ మలింగ్ వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. బంగ్లాదేశ్ జట్టుతో శ్రీలంక ఆడే మూడు మ్యాచుల సిరీస్ లో మొదటిదే తనకు చివరిదని శుక్రవారం వెల్లడించాడు. జూలై 26, 28, 31 తేదీల్లో జరిగే ఈ పోటీలకోసం మలింగ పేరును 22వ స్థానంలో పేర్కొన్నారు. ఈ ఫాస్ట్ బౌలర్ 219 అంతర్జాతీయ వన్డేలలో 335 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు తీసిన శ్రీలంక బౌలర్లలో మూడో స్థానంలో నిలిచాడు. టెస్టు క్రికెట్ నుంచి మలింగ 2011లోనే తప్పుకొన్నాడు.
2019-07-26 Read Moreవైద్యంకోసం గంజాయిని అనుమతించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ప్రశాంత్ శర్మ అనే న్యాయ విద్యార్ధి ఈ ‘పిల్’ దాఖలు చేశారు. వైద్యంలో గంజాయి, దాని అనుబంధ ఉత్పత్తులు ఉపయోగించేలా 1985 నార్కోటిక్స్ చట్టానికి సవరణలకోసం పిటిషనర్ విన్నవించారు. అయితే, ఈ ప్రయోజనంకోసం గంజాయికి చట్టబద్ధత కల్పించే పని కేవలం చట్టసభల ద్వారా చేయవలిస ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
2019-07-26 Read More