హాజీపూర్ వరుస హత్యల కేసు విచారణ రేపటికి వాయిదా పడింది. శ్రావణి హత్య కేసులో ఫోక్సో కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. నిందితుడు శ్రీనివాసరెడ్డి ఉరిశిక్షకు అన్ని విధాలా అర్హుడని బాధితుల తరపు లాయర్ వాదించారు. చిన్నపిల్లలతో అమానుషంగా ప్రవర్తించినవారిపై జాలి, దయ చూపించాల్సిన అవసరం లేదని, సుప్రీంకోర్టు కూడా ఇలాంటి కేసుల్లో ఉరిశిక్ష విధించాలనే చెప్పిందని న్యాయవాది అన్నారు. రేపు మనీషా, కల్పన కేసులో కోర్టు వాదనలు విననుంది.
2020-01-06అమరావతి రైతుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సోమవారం వెలగపూడి గ్రామానికి చెందిన కారుమంచి గోపాలరావు గుండె పోటుతో మరణించారు. రాజధాని తరలింపు వార్తల ఒత్తిడికి తోడు... తన మనవడిని పోలీసులు అరెస్టు చేయడం గోపాలరావును కలవరపెట్టినట్టు చెబుతున్నారు. ప్రస్తుత పాలనా కేంద్రమైన ఏపీ సచివాలయం వెలగపూడి గ్రామ పరిధిలోనే ఉంది. ఇప్పటికే అమరావతి ప్రాంతంలో ఇద్దరు రైతులు ఒత్తిడికి లోనై మరణించారు.
2020-01-06సముద్ర మార్గంలో హెరాయిన్ తెస్తున్న ఐదుగురు పాకిస్తానీయులను ఇండియన్ కోస్టు గార్డు, గుజరాత్ ఎ.టి.ఎస్. పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 35 కేజీల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ‘‘అల్ జమ్ జమ్’’ పేరిట ఉన్న బోటును గమనించిన కోస్టు గార్డులు, పోలీసులు గుజరాత్ లోని జఖావుకు సమీపంలో దాడి చేశారు. ఈ సంయుక్త ఆపరేషన్ కు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది.
2020-01-06తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. విచారణ పూర్తయ్యేవరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్లో నిబంధనలు పాటించలేదని ఆరోపిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
2020-01-06ముఖ్యమంత్రి నివాసం ఉన్న తాడేపల్లి, సమీపంలోని మంగళగిరి, తన సొంత నియోజకవర్గంలోని పులివెందుల మున్సిపాలిటీలలో అభివృద్ధి కార్యక్రమాలకోసం ప్రత్యేక అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ మున్సిపాలిటీలలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేసి ఈసారి ప్రతిపాదనలతో రావాలని ఆదేశించారు. కచ్చితంగా ఫలితాలు చూపించాలని స్పష్టం చేశారు.
2020-01-06రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీలలో 19,769 కిలోమీటర్ల పొడవున భూగర్భ మురుగునీటి వ్యవస్థ నిర్మాణానికి రూ. 23,037 కోట్లు ఖర్చవుతుందని అధికారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నివేదించారు. సోమవారం పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై సిఎం సమీక్ష నిర్వహించారు. లక్షకు పైగా జనాభా ఉన్న 34 మున్సిపాలిటీల వరకు తీసుకుంటే... భూగర్భ డ్రైనేజీకి రూ. 11,181 కోట్లు అవసరమని ఈ సందర్భంగా అధికారులు చెప్పారు.
2020-01-06జేఎన్ యూ హింసాకాండకు పాల్పడింది ఆరెస్సెస్, ఏబీవీపీ గూండాలేనని వర్శిటీ విద్యార్ధి సంఘం అధ్యక్షురాలు ఐషే ఘోష్ చెప్పారు. ఆరెస్సెస్ అనుబంధ ప్రొఫెసర్లు, ఏబీవీపీ నాయకులు నాలుగు రోజుల నుంచి యూనివర్శిటీలో హింసను ప్రేరేపించారని ఆమె ఆరోపించారు. వర్శిటీ వైస్ ఛాన్సలర్ జగదీశ్ కుమార్ ను వెంటనే తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు.
2020-01-06విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లోని పలు పార్లమెంటు నియోజకవర్గాలకు, వాటి పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్చార్జిలను నియమిస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం లోక్ సభ నియోజకవర్గానికి వి.వి. లక్ష్మీనారాయణ (సీబీఐ మాజీ జెడి), కాకినాడకు పంతం నానాజీ, అమలాపురానికి డిఎంఆర్ శేఖర్, రాజమండ్రికి కందుల దుర్గేష్, గుంటూరుకు బోనబోయిన శ్రీనివాస యాదవ్ నియమితులయ్యారు.
2020-01-06అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలకు ఇరాన్ భారీగా వెల కట్టింది. ఇరాన్ జనాభాలో ఒక్కొక్కరికీ ఒక్కో డాలర్ చొప్పున లెక్కించి 80 మిలియన్ డాలర్లను (సుమారు రూ. 575 కోట్లు) ప్రకటించింది. ట్రంప్ ను హతమార్చినవారికి ఈ బహుమతి మొత్తం దక్కుతుందని ఇరాన్ ప్రకటించినట్టు మిర్రర్ వెబ్ సైట్ సోమవారం రాసింది. ట్రంప్ ఆదేశాల మేరకు ఇరాన్ టాప్ మిలిటరీ కమాండర్ ఖాసిం సొలేమానీని హతమార్చిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
2020-01-06 Read Moreపాకిస్థాన్ జైలు నుంచి విడుదలయిన తెలుగు మత్స్యకారులు స్వదేశానికి చేరుకున్నారు. వాఘా సరిహద్దు దగ్గర పాక్ రేంజర్స్ జాలర్లను భారత సరిహద్దు భద్రతా సిబ్బందికి అప్పగించాయి. ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, అధికారులు మత్స్యకారులకు స్వాగతం పలికారు. జాలర్లు 2018 నవంబర్ లో పొరపాటున పాక్ జలాల్లో ప్రవేశించారు. దీంతో పాకిస్థాన్ వారిని అరెస్టు చేసి లాండి జైల్లో ఉంచింది. భారత విదేశాంగ జోక్యంతో మత్స్యకారులను పాకిస్థాన్ విడుదల చేసింది.
2020-01-06