ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిన్న ఆత్మహత్యకు ప్రయత్నించిన ఖమ్మం డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆదివారం మరణించారు. శనివారం కిరోసిన్ పోసుకొని నిప్పింటించుకున్న శ్రీనివాసరెడ్డి శరీరం 90 శాతం కాలిపోవడంతో హైదరాబాద్ కంచన్ బాగ్ డి.ఆర్.డి.ఒ. ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ మృతితో ఆసుపత్రి వద్ద భద్రతను పెంచారు. శ్రీనివాసరెడ్డి మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు.
2019-10-13 Read Moreగత 2000 సంవత్సరాల్లో అధిక కాలం ఇండియా, చైనా ప్రపంచ ఆర్థిక శక్తులుగా ఫరిఢవిల్లాయని, మళ్లీ రెండు దేశాలూ ఆ స్థితికి ఎదుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా శనివారం తమిళనాడులోని కోవలం బీచ్ రిసార్టులో ఇరు దేశాల అధినేతలూ చర్చలు జరిపారు. ఈ అనధికార శిఖరాగ్ర సమావేశం (చెన్నై కనెక్ట్)తో చైనా-ఇండియా సంబంధాల్లో కొత్త యుగం మొదలవుతుందని మోదీ పేర్కొన్నారు.
2019-10-12 Read Moreఅక్టోబర్ 2 సెలవు రోజున మూడు బాలీవుడ్ సినిమాలు రూ. 120 కోట్లు వసూలు చేయడం ‘‘బలమైన ఆర్థికవ్యవస్థ’’కు నిదర్శనమని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆర్థిక మాంద్యం సూచనలను తోసిపుచ్చడానికి ఆయన సినిమా కలెక్షన్లను ప్రస్తావించారు. ఆర్థిక మాంద్యం ప్రభావం ఇండియా, బ్రెజిల్ దేశాలపై ఎక్కువగా ఉందని ఐఎంఎఫ్ పేర్కొన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ వాదన వినిపించారు. 2017లో అత్యధిక నిరుద్యోగ రేటు 45 సంవత్సరాల గరిష్ఠానికి చేరిందన్న ఎన్ఎస్ఎస్ఒ నివేదికను కూడా రవిశంకర్ ప్రసాద్ తప్పుపట్టారు.
2019-10-12 Read Moreపారిశ్రామిక ఉత్పత్తి 81 నెలల కనిష్టానికి పడిపోయింది. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపి) ఆగస్టులో మైనస్ 1.1 శాతం నమోదైంది. గత ఏడాది ఆగస్టులో 4.8 శాతం వృద్ధి నమోదు కాగా ఈసారి రివర్స్ అయింది. జాతీయ గణాంక సంస్థ శుక్రవారం వెల్లడించిన వివరాలు ఆర్థిక వ్యవస్థపై ఆందోళనను మరింత పెంచాయి. ప్రధానంగా తయారీ రంగంలోని 23 గ్రూపుల్లో 15 తిరోగమనంలో పయనించాయి. వాహనాల తయారీ పరిశ్రమ ఏకంగా 23.1 శాతం తిరోగమించింది. మెషినరీ & ఎక్విప్ మెంట్ రంగం 21.7 శాతం క్షీణించింది.
2019-10-12 Read Moreకెన్యా రన్నర్ ఎలియుడ్ కిప్‌చోగే 2 గంటల్లోపు మారథాన్‌ను పూర్తి చేసిన మొదటి వ్యక్తిగా చరిత్రకెక్కాడు. శనివారం ఆస్ట్రియాలోని వియన్నాలో జరిగిన ఇనియోస్ ఛాలెంజ్‌లో 1:59:40 లో కిప్‌చోజ్ 26.2 మైళ్ల దూరం పరిగెత్తాడు. "నేను మంచి అనుభూతి చెందుతున్నాను. 1954 లో రోజర్ బన్నిస్టర్ తరువాత మరో 65 సంవత్సరాలు పట్టింది. నేను మొదటి వ్యక్తిని. నేను చాలా మందికి స్ఫూర్తినివ్వాలనుకుంటున్నాను, ఏ మానవుడూ పరిమితం కాదని" కిప్చోజ్ మారథాన్ తర్వాత చెప్పారు.
2019-10-12 Read Moreభారత కుబేరుల్లో ముఖేష్ అంబానీ నెంబర్ 1 స్థానం ఈసారీ పదిలం. ఫోర్బ్స్ మ్యాగజైన్ 2019 జాబితాలో విశేషం ఏమంటే... ప్రధాని మోదీకి సన్నిహితుడు గౌతమ్ అదానీ 2వ స్థానానికి ఎగబాకటం! 51.4 బిలియన్ డాలర్ల సంపదతో అంబానీ తొలి స్థానంలో ఉంటే అదానీ $15.7 బిలియన్లతో 2వ స్థానంలోకి వచ్చారు. హిందుజా సోదరులు ($15.6 బిలియన్), పల్లోంజీ మిస్త్రీ ($15 బి), ఉదయ్ కోటక్ ($14.8 బి), శివ్ నాడార్ ($14.4 బి), రాధాక్రిష్ణ దమాని ($14.3 బి), గోద్రెజ్ కుటుంబం ($12 బి), లక్ష్మీ మిట్టల్ ($10.5 బి), కుమారమంగళం బిర్లా ($9.6 బి) టాప్ 10లో ఉన్నారు.
2019-10-11 Read Moreఆటో సెక్టార్ కష్టాలు కొనసాగుతున్నాయి. ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు సెప్టెంబరులో 23.7 శాతం పడిపోయాయి. పాసెంజర్ కార్ల అమ్మకాలు ఏకంగా 33.4 శాతం పతనమయ్యాయి. అమ్మకాలు పడిపోవడం వరుసగా ఇది 11వ నెల. శుక్రవారం వెల్లడైన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) గణాంకాల ప్రకారం సెప్టెంబరులో మొత్తం ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు 2,23,317. అందులో కార్లు 1,31,281. క్షీణత సుదీర్ఘ కాలం కొనసాగడంతో పరిశ్రమలు ఉత్పత్తిని, తద్వారా ఉద్యోగాలను తగ్గిస్తున్నాయి.
2019-10-11 Read Moreసరిహద్దు దేశం ఎరిత్రియాతో శాంతి స్థాపన ప్రయత్నాలకు గాను ఇథియోపియా ప్రధాని అబి అహ్మద్ 2019 నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు. నార్వేజియన్ నోబెల్ కమిటీ శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించింది. 1998 నుండి 2000 వరకు సరిహద్దు యుద్ధంలో పోరాడిన దీర్ఘకాల శత్రువులు ఇథియోపియా, ఎరిత్రియా మధ్య 2018 జూలైలో సంబంధాలు పున:ప్రారంభమయ్యాయి. ఆ కృషిలో భాగమైన అబి అహ్మద్ నోబెల్ బహుమతిని డిసెంబర్ 10వ తేదీన ఓస్లోలో అందుకోనున్నారు.
2019-10-11 Read Moreచైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ శుక్రవారం మధ్యాహ్నం చెన్నై చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి పళనిస్వామి ‘జి’కి రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. జిన్ పింగ్ చెన్నైలో అడుగు పెట్టగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘‘వెల్ కం టు ఇండియా’’ అంటూ ట్విట్టర్లో ఆహ్వానం పలికారు. కొద్ది గంటల ముందుగా మోదీ చెన్నై చేరుకొని అక్కడినుంచి మామల్లాపురం వెళ్ళారు. ‘జి’తో తన అనధికార సమావేశంతో ఇండియా-చైనా సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నట్టు మోదీ చైనా భాషలో ఓ ట్వీట్ చేశారు.
2019-10-11 Read Moreపుణెలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచు రెండో రోజు (శుక్రవారం) భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లీ డబుల్ సెంచురీ చేశాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 7వ డబుల్. 150కి పైగా పరుగులు చేయడం ఇది 9వ సారి. ఈ విషయంలో ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్ మన్ రికార్డు (8 సార్లు 150)ను కోహ్లీ బద్దలు కొట్టాడు. డబుల్ సెంచరీలలో రికీపాంటింగ్, సచిన్ టెండూల్కర్ లను అధిగమించి వాలీ హమ్మద్ (ఇంగ్లండ్), మహేల జయవర్ధనే (శ్రీలంక) సరసన నిలిచాడు. టెస్టుల్లో 7000 పరుగుల మైలురాయిని కూడా ఇక్కడే అధిగమించారు.
2019-10-11 Read More