ఈశాన్య ఢిల్లీ మతోన్మాద దాడుల సమయంలో కాల్పులు జరిపి పోలీసుకు తుపాకి గురిపెట్టిన దుండగుడిని ఉత్తరప్రదేశ్ లో అరెస్టు చేశారు. అతనిని ఢిల్లీ తరలిస్తున్నట్టు మంగళవారం పోలీసులు వెల్లడించారు. ఎర్ర టీషర్టు, జీన్స్ ధరించిన ఆ దుండగుడిని షారుఖ్ (33)గా ఫిబ్రవరి 24నే పోలీసులు గుర్తించారు. ఢిల్లీ జఫ్రాబాద్ - మౌజ్ పూర్ రోడ్డుపై 24న నాటు తుపాకితో అతను వీరంగం వేయడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. అతను 8 రౌండ్లు కాల్పులు జరిపినట్టు రికార్డయింది.
2020-03-03 Read Moreగత ఏడాది ఫిబ్రవరిలో పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన బీకర దాడికి సంబంధించి.. తారిక్ అహ్మద్, ఇన్షా తారిక్ (26) అనే తండ్రీ కుమార్తెల ద్వయాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. కొద్ది రోజుల క్రితం అరెస్టైన జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాది షకీర్ బషీర్ (22) ఇచ్చిన సమాచారంతో తాజా అరెస్టులు జరిగాయి. ఈ నిందితులు సి.ఆర్.పి.ఎఫ్. కాన్వాయ్ కదలికలను గమనించి బాంబుల ట్రక్కు అక్కడికి రావడానికి సహకరించారని ఆరోపణ. దాడికి కుట్ర కూడా వీరి నివాసంలోనే జరిగినట్టు ఓ అధికారి చెప్పారు.
2020-03-03 Read Moreసిఎఎ, ఎన్.పి.ఆర్. లపై అసెంబ్లీలో తీర్మానం చేయాలంటూ ఒత్తిడి పెరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం స్పందించారు. 2010లో జాతీయ జనాభా రిజస్టర్ (ఎన్.పి.ఆర్) కోసం వినియోగించిన ప్రశ్నావళికే పరిమితం కావాలని కేంద్రాన్ని కోరనున్నట్టు వెల్లడించారు. ఈమేరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఓ తీర్మానాన్ని ప్రవేశపెడతామని కూడా జగన్ తెలిపారు. తాజా ఎన్.పి.ఆర్. ప్రశ్నావళిలోని కొన్ని అంశాలు మైనారిటీలలో అభద్రతా భావాన్ని కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
2020-03-03ఈ నెలాఖరులోపే ఎం.పి.టి.సి, జడ్.పి.టి.సి. ఎన్నికలు జరుగుతాయని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని పాటించాలని నిన్న హైకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో సిఎం మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రేపు సంబంధిత అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తారని జగన్ వెల్లడించారు. పంచాయతీరాజ్ చట్టానికి సవరణలతో జారీ చేసిన ఆర్డినెన్స్ ను పక్కాగా అమలు చేయాలని, ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని పూర్తిగా నిరోధించాలని అధికారులను ఆదేశించారు.
2020-03-03ఇండియా జీడీపీ వృద్ధి 2020, 2021 సంవత్సరాల్లో (గత అంచనా కంటే) తగ్గుతుందని ఒఇసిడి పేర్కొంది. 2020లో 5.1 శాతం, 2021లో 5.6 శాతం వృద్ధి రేటు ఉంటుందని తాజా నివేదికలో అంచనా వేసింది. నవంబరు నాటి అంచనాల కంటే ఇవి వరుసగా 1.1 శాతం, 0.8 శాతం తక్కువ. 2021లో ఇండియా కంటే చైనా వృద్ధి రేటు (6.4) అధికంగా ఉంటుందని అంచనా వేసింది. నవంబర్ నాటి అంచనా కంటే చైనా వృద్ధి రేటును 0.9 శాతం పెంచి చూపింది. ‘కరోనా’ని నియంత్రిస్తేనే ఈ వృద్ధి సాధ్యం. వైరస్ మరింత వ్యాపిస్తే మాత్రం జీడీపీ వృద్ధి మరింత పడిపోతుంది.
2020-03-03ప్రపంచవ్యాప్తంగా ‘కరోనా వైరస్’తో మరణించినవారి సంఖ్య మూడు వేలు దాటింది. 67 దేశాలకు విస్తరించిన ఈ వైరస్ బాధితులు 89,527కు పెరిగారు. వారిలో 3,056 మంది చనిపోయారు. చైనాలో 80,174 మంది బాధితులకు గాను 2,915 మంది మరణించారు. ఇరాన్ లో 1,501 మందికి వైరస్ సోకగా 66 మంది, ఇటలీలో 1,689 మందికి గాను 35 మంది, దక్షిణ కొరియాలో 4,212 మందికి గాను 22 మంది మరణించారు. చైనాలో కొత్త కేసుల సంఖ్య (206) గణనీయంగా తగ్గిపోగా... ఇతర దేశాల్లో బాగా (1,598) పెరిగాయి.
2020-03-03గత వారం కుదేలైన అమెరికా అమెరికా స్టాక్ మార్కెట్ సోమవారం (మార్చి 2న) తిరిగి పుంజుకుంది. ‘డౌ’ ఒక్క రోజులో 1,294 పాయింట్లు (5.1 శాతం) పెరిగింది. పాయింట్లలో చూస్తే ఒక్క రోజులో ఇంత పెరగడం ఇదే మొదటిసారి. శాతంలో చూస్తే 2009 మార్చి తర్వాత ఇది తొలిసారి. ఎస్&పి సోమవారం 4.6 శాతం పెరిగింది. గత వారం డౌ (ఐ.ఎన్.డి.యు) 12.4 శాతం పతనమైంది. ఎస్&పి 500 (ఎస్.పి.ఎక్స్) 11.5 శాతం దిగజారింది. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ఒక్క వారంలో ఇంత పతనం కావడం కూడా ఇదే తొలిసారి.
2020-03-03 Read Moreస్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 59.85 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ.. ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది. 50 శాతం సీలింగ్ ప్రకారం... నెల రోజుల్లోపు బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
2020-03-02‘కరోనా’పై ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ప్రపంచ జీడీపీ వృద్ధి రేటు 2020లో 2.9 శాతం నుంచి 2.4 శాతానికి పడిపోతుందని ఒఇసిడి పేర్కొంది. అయితే, ‘కరోనా’ ఆసియా-పసిఫిక్, యూరప్ లకు మరింత విస్తరిస్తే.. ఎక్కువ కాలం ప్రభావం చూపితే జీడీపీ ఏకంగా 1.4 శాతానికి పడిపోతుందని అంచనా వేసింది. గత నవంబర్ అంచనా కంటే ఇది 1.5 శాతం తక్కువ. ఈ ఆందోళనే నిజమైతే అనేక దేశాలు ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంటాయి. అందులో జపాన్, యూరప్ దేశాలు కూడా ఉంటాయని ‘కరోనావైరస్: ప్రమాదంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ’ నివేదికలో ఒఇసిడి పేర్కొంది.
2020-03-02‘కరోనా వైరస్’ మరో ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి కారణమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 2020లో ప్రపంచ జీడీపీ వృద్ధి 2.4 శాతానికి పడిపోతుందని ఒఇసిడి అంచనా వేసింది. ‘కరోనావైరస్: ప్రమాదంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ’ అనే శీర్షికన ఒఇసిడి ఆర్థిక నివేదిక సోమవారం (మార్చి2న) విడుదలైంది. 2019లో ప్రపంచ జీడీపీ 2.9 శాతమే పెరిగితే.. ఈ ఏడాది మరింత తగ్గనుంది. తొలి త్రైమాసికంలో నెగెటివ్ గ్రోత్ నమోదు కావచ్చని ఒఇసిడి అంచనా. చైనా వృద్ధి అంచనాను 4.9 శాతానికి (5.7 నుంచి), ఇండియా వృద్ధి అంచనాను 5.1 శాతానికి (6.2 నుంచి) తగ్గించింది.
2020-03-02