ఫిబ్రవరిలో ఇండియా ఫ్యాక్టరీ కార్యకలాపాలు మందగించాయి. ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ ఇండెక్స్ (పిఎంఐ) జనవరిలో ఉన్న 55.3 స్థాయి నుంచి ఫిబ్రవరిలో 54.5కి తగ్గిపోయింది. అయితే, వరుసగా 31వ నెల కూడా 50 పాయింట్ల మార్కుపైనే ఉంది. అంతకంటే తక్కువకు దిగజారితే నెగెటివ్ గ్రోత్ నమోదవుతుంది. ఫిబ్రవరిలో ఆర్డర్లు బాగానే ఉన్నా ‘కరోనా’ భయం సెంటిమెంట్ ను దెబ్బ తీసినట్టు సర్వేలో వెల్లడైంది. ఎగుమతులపై ‘కరోనా’ ప్రభావం గట్టిగానే ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
2020-03-02 Read Moreగత మూడేళ్ళుగా ఇండియాలో నిరుద్యోగ సమస్య పెరిగింది. 2020 ఫిబ్రవరిలో నిరుద్యోగం రేటు ఏకంగా 7.78 శాతానికి పెరిగింది. 2019 అక్టోబర్ తర్వాత ఇదే అత్యధికమని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సి.ఎం.ఐ.ఇ) పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో జనవరిలో 5.97 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు ఫిబ్రవరిలో 7.37 శాతానికి పెరిగింది. అయితే, పట్టణ ప్రాంతాల్లో 9.70 శాతం నుంచి 8.65 శాతానికి తగ్గింది. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తగ్గిన ప్రభావం నిరుద్యోగంపై తీవ్రంగా ఉంది.
2020-03-02 Read Moreపౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ని వ్యతిరేకిస్తున్నవారిని దేశద్రోహులుగా చిత్రిస్తూ కాల్చి చంపాలని ఓవైపు బీజేపీ నేతలు ర్యాలీలు చేస్తుంటే.. ఆ పార్టీ పాలనలో ఉన్న మహారాష్ట్ర మున్సిపాలిటీ ఒకటి సిఎఎ, ఎన్.ఆర్.సి.లను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. పర్బని జిల్లాలోని సేలు మున్సిపాలిటీలో ఫిబ్రవరి 28న కౌన్సిల్ సమావేశం జరిగింది. సిఎఎ-ఎన్.ఆర్.సి. వ్యతిరేక తీర్మానానికి మెజారిటీ మద్ధతు ఇవ్వగా.. ఎవరూ వ్యతిరేకించలేదు. ఇంతకు ముందే బిజెపి భాగస్వామిగా ఉన్న బీహార్ ప్రభుత్వం ఎన్.ఆర్.సి. వ్యతిరేక తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించిన సంగతి తెలిసిందే.
2020-03-02 Read More2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. రేపు (మార్చి 3న) నలుగురు దోషులను ఉరి తీయాల్సి ఉండగా... నాలుగో వ్యక్తి ‘క్షమాబిక్ష’ పిటిషన్ ను సోమవారం రాష్ట్రపతి తిరస్కరించారు. అయితే, క్షమాబిక్ష పిటిషన్ తిరస్కరణకు, మరణ శిక్ష అమలుకు మధ్య వ్యవధి ఉండాలి. ఈ నేపథ్యంలోనే రేపు ఉరి శిక్ష అమలు కాదని ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు ప్రకటించింది. ఎప్పుడు ఉరి తీసేదీ మళ్లీ ప్రకటించనుంది.
2020-03-02ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలి ఖొమేనీకి సన్నిహితుడైన కౌన్సిల్ సభ్యుడు మహ్మద్ మిర్ మహమ్మది (71) ‘కరోనా వైరస్’తో మరణించారు. ఖొమేనీ, పార్లమెంటు మధ్య వ్యవహారాలను సమన్వయం చేసే సలహాదారుగా మహమ్మది ఉన్నారు. చైనా తర్వాత ఇప్పుడు ఇరాన్ లోనే ‘కరోనా’ మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. 978 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ కాగా వారిలో 54 మంది మరణించారు. మరణాల రేటు (5.5 శాతం) మరే దేశం కన్నా ఇరాన్ లోనే ఎక్కువగా ఉంది.
2020-03-02 Read Moreరూపాయి విలువ రోజు రోజుకూ దిగజారుతోంది. సోమవారం మార్కెట్లు ముగిసేసరికి డాలరుకు 72.74 రూపాయలుగా నమోదైంది. క్రితం ముగింపు కంటే ఇది 50 పైసలు తక్కువ. ఇండియాలో కొత్తగా రెండు ‘కరోనా వైరస్’ కేసులు నమోదు కావడం దీనికి కారణంగా చెబుతున్నారు. గత శుక్రవారం రూపాయి విలువ 60 పైసలు తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా ‘కరోనా’ ప్రభావం తీవరించడం స్టాక్ మార్కెట్లతో పాటు రూపాయి విలువపైనా ప్రభావం చూపిందన్నది విశ్లేషకుల కథనం.
2020-03-02‘‘మీరు నిప్పుతో ఆట ఆడుతున్నారు... మీరు జాగ్రత్తగా ఉండాలి’’ 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో దోషి పవన్ గుప్తా న్యాయవాదికి ఢిల్లీ జడ్జి ధర్మేంద్ర రాణా చేసిన హెచ్చరిక ఇది. రాష్ట్రపతికి క్షమాబిక్ష పిటిషన్ పెట్టుకున్న నేపథ్యంలో రేపు ఉరిని ఆపాలని పవన్ గుప్తా వేసిన పిటిషన్ పై జడ్జి ధర్మేంద్ర సోమవారం విచారణ జరిపారు. రాష్ట్రపతి నిర్ణయం వెలువడాల్సిన నేపథ్యంలో తీర్పును రిజర్వు చేశారు. అయితే, దోషులు అన్ని అవకాశాలనూ వినియోగించుకోవడానికి గత నెలలో ఢిల్లీ హైకోర్టు నిర్దేశించిన వారం రోజుల ‘డెడ్ లైన్’ దాటిపోయిందని జడ్జి గుర్తు చేశారు.
2020-03-02 Read More2012 ఢిల్లీ సామూహిక హత్యాచారం కేసులో నాలుగో దోషి క్షమాబిక్ష పిటిషన్ ను కూడా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సోమవారం తిరస్కరించారు. ఢిల్లీ కోర్టు ఇచ్చిన డెత్ వారంట్ ప్రకారం దోషులు నలుగురినీ మార్చి 3న ఉరి తీయవలసి ఉండగా... పవన్ గుప్తా రాష్ట్రపతికి క్షమాబిక్ష పిటిషన్ పెట్టుకున్నారు. మిగిలిన ముగ్గురి విన్నపాలనూ ఇంతకు ముందే తిరస్కరించారు. పవన్ గుప్తా పిటిషన్ తిరస్కరణతో.. ఉరి శిక్షను వాయిదా వేయించడానికి దోషులు వేస్తున్న ఎత్తుగడల్లో చివరి అంకం ముగిసినట్టే. అయితే, రేపు ఉరి తీస్తారా లేదా? అన్నది తేలాలి.
2020-03-02ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్కొక్కరికి ‘కరోనా’ నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. ఢిల్లీలో ‘కరోనా’ సోకిన వ్యక్తి ఇటలీకి వెళ్లి వచ్చినట్టు, తెలంగాణ వ్యక్తి దుబాయ్ వెళ్లి వచ్చినట్టు ఆ ప్రకటనలో ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇద్దరి పరిస్థితీ నిలకడగానే ఉందని తెలిపింది. వీరితో ఇండియాలో ‘కరోనా’ కేసుల సంఖ్య 5కి పెరిగింది. ఇంతకు ముందు కేరళలో ముగ్గురికి ‘కరోనా’ సోకగా వ్యాధి నయమై వారు డిశ్చార్జి అయ్యారు.
2020-03-02ఢిల్లీ మతోన్మాద దాడుల సమయంలో మరణించిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత్ శర్మ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. అంకిత్ శర్మ కుటుంబంలో ఒకరికి ఢిల్లీ ప్రభుత్వంలో ఉద్యోగం ఇస్తామని కూడా ఆయన చెప్పారు. అంకిత్ శర్మ నివాసం ఉన్న చాంద్ బాగ్ ప్రాంతంలో అల్లర్లు, దహనాలు అధికంగా జరిగాయి. ఆ సందర్భంలో అంకిత్ మృతదేహం మురికి కాల్వలో దొరికిన సంగతి తెలిసిందే. ఆ కేసులో అనుమానితుడైన కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ను ‘ఆప్’ సస్పెండ్ చేసింది.
2020-03-02 Read More