ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు, ‘భవిష్యత్ ముఖ్యమంత్రి’గా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేష్ ఎదురీదుతున్నారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు గంటలపాటు కౌంటింగ్ జరిగాక లోకేష్ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి రామక్రిష్ణారెడ్డి 600 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. రాజధాని ప్రాంతంలో భాగమైన ఈ నియోజకవర్గాన్ని లోకేష్ ఏరికోరి ఎంచుకున్నారు. చంద్రబాబు, లోకేష్ నివాసం ఉంటున్న ఉండవల్లి ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉంది.
2019-05-23తొలి రౌండ్ కౌంటింగ్ లో వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండో రౌండ్ పూర్తయ్యేసరికి ఆధిక్యంలోకి వచ్చారు. కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధికంటే చంద్రబాబు 1500 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక మెజారిటీలు వచ్చే నియోజకవర్గాల్లో కుప్పం ఎప్పుడూ ఉంటోంది. చిత్తూరు లోక్ సభ నియోజకవర్గంలో విజయావకాశాలు.. కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్ పైన ఆధారపడి ఉన్నాయి.
2019-05-23ఈ ఎన్నికల్లో అనూహ్యమైన పరిణామం... మొదటి గంటన్నర కౌంటింగ్ తర్వాత... కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబునాయుడు స్వల్పంగా వెనుకంజలో ఉండటం! అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధి చంద్రమౌళి 67 ఓట్ల ఆధిక్యంలో ఉండటం విశేషం. తొలి రౌండ్ లో ఆయనకు 4,456 ఓట్లు రాగా చంద్రబాబుకు 4,389 ఓట్లు లభించాయి. ఇదే పరిస్థితి కొనసాగకపోవచ్చు. అయితే, కుప్పంలో ఏ దశలోనూ చంద్రబాబు వెనుకంజ వేయడాన్ని ఆ పార్టీ కార్యకర్తలు ఊహించలేరు.
2019-05-23లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్ ప్రకారం ఎన్డీయే 270 సీట్లలో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ 84 సీట్లలోనూ, ఇతరులు 71 సీట్లలోనూ ఆధిక్యంలో ఉన్నారు. తూర్పున పశ్చిమ బెంగాల్, ఒడిషా, దక్షిణాన కర్నాటక, పశ్చిమాన మహారాష్ట్రలలో గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించడం ద్వారా బీజేపీ ఉత్తరాదిలో జరుగుతున్న నష్టాన్ని పూడ్చుకోగలుగుతోంది. 80 సీట్లు ఉన్న యూపీలో మాత్రం బీజేపీకి కొంత నష్టం తప్పేలా లేదు.
2019-05-2343 రోజుల ఉత్కంఠకు తెర పడింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కనిపిస్తోంది. తొలి గంట కౌంటింగ్ ముగిసేసరికి రాష్ట్ర అసెంబ్లీ సీట్లలో 27 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. అధికార తెలుగుదేశం పార్టీ కేవలం 7 చోట్ల ఆధిక్యాన్ని చూపించింది. లోక్ సభ సీట్లలోనూ ఇదే తరహా ఆధిపత్యం స్పష్టమవుతోంది. తొలి రౌండ్లలో పులివెందులలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి, మంగళగిరిలో నారా లోకేష్ ఆధిక్యంలో ఉన్నారు.
2019-05-23లోక్ సభ ఎన్నికల్లో ఏ రాష్ట్ర ప్రజలు ఎంత శాతం ఓట్లు వేశారు? బుధవారం వరకు ఖరారు చేసిన వివరాలతో రూపొందిన మ్యాప్ ఇది. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతోపాటే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, సిక్కిం అసెంబ్లీలకూ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో స్థానిక పోటీవల్ల పోలింగ్ శాతం అధికంగా ఉండటం సహజం. వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్ సభకు అత్యధికంగా 79.70 శాతం ఓట్లు పోలయ్యాయి. నాలుగు ఈశాన్య రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలతోపాటు పశ్చిమ బెంగాల్ లో 80 శాతం పైగా పోలింగ్ నమోదైంది.
2019-05-22‘ద వైర్’ వార్తా సంస్థపై అహ్మదాబాద్ కోర్టులో వేసిన సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాలన్నిటినీ అదానీ గ్రూపు ఉపసంహరించుకోనున్నట్టు న్యూస్ ఏజన్సీ ‘ఐఎఎన్ఎస్’ బుధవారం పేర్కొంది. అదానీ పవర్ కంపెనీకి పన్ను రాయితీలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక మండళ్ల నిబంధనలను సడలించిందని 2017లో ‘ద వైర్’ ఓ కథనాన్ని ప్రచురించింది. కాంగ్రెస్ నేతలపైన, నేషనల్ హెరాల్డ్ పత్రికపైన అనిల్ అంబానీ వేసిన రూ. 5000 కోట్ల దావాను ఉపసహరించుకుంటున్నట్టు వార్త వచ్చిన మర్నాడే అదానీ గ్రూపు నిర్ణయం వెలువడటం విశేషం.
2019-05-22 Read Moreఓట్ల లెక్కింపునకు ముందే.. అసెంబ్లీ నియోజకవర్గానికి 5 చొప్పున ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీ ప్యాట్) స్లిప్పులను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎంల)తో పోల్చి చూడాలన్న ప్రతిపక్ష పార్టీల విన్నపాన్ని ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. మంగళవారం 22 పార్టీల నేతలు తమను కలసి చేసిన విన్నపంపై ఈసీ బుధవారం స్పందించింది. కౌంటింగ్ ప్రక్రియలో ఏ మార్పూ చేయబోమని స్పష్టం ఈసీ స్పష్టం చేసింది.
2019-05-22 Read Moreటివి9 నుంచి ఉధ్వాసనకు గురైన రవిప్రకాష్ బుధవారం ‘అజ్ఞాతం’ నుంచే ఓ వీడియోను విడుదల చేశారు. మేఘ కంపెనీ అధినేత కృష్ణారెడ్డి తన మిత్రులతో కలసి 20 చొప్పున వాటాలు కొనుగోలు చేస్తానంటే శ్రీనిరాజుతో కలిపానని, కానీ జూపల్లి రామేశ్వరరావు మెజారిటీ వాటా కొనుగోలు చేశారని రవిప్రకాష్ చెప్పారు. మాట తప్పినందుకు కృష్ణారెడ్డిని ప్రశ్నించానని, మైనారిటీ వాటాదారైన తనతో ఒప్పందానికి తిరస్కరించిన రామేశ్వరరావును ప్రతిఘటించానని, అప్పుడే తనను టీవీ9 వదిలేలా చేస్తానని ఆయన హెచ్చరించారని, తర్వాత 3 దొంగ కేసులు పెట్టించారని రవిప్రకాష్ ఆరోపించారు.
2019-05-22టీవీ9 యాజమాన్య వివాదంలో నమోదైన కేసులకు సంబంధించి.. ముందస్తు బెయిలు కోసం మాజీ సీఈవో రవిప్రకాష్ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. సోమవారం రవిప్రకాష్ దాఖలు చేసిన పిటిషన్ ను వేసవి సెలవుల ధర్మాసనం విచారించింది. రవిప్రకాష్ విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. పోలీసులు అరెస్టు చేసే సూచనలు కనిపిస్తున్నాయని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే, రవిప్రకాష్ విచారణకు సహకరించడంలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది పేర్కొన్నారు.
2019-05-22