ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో కూలిపోయిన ఉక్రెయిన్ విమానంలో ప్రయాణీకులు, సిబ్బంది మొత్తం మరణించారు. విమానంలో 167 మంది ప్రయాణీకులు, తొమ్మిది మంది సిబ్బంది ఉన్నట్టు సమాచారం. సమస్యాత్మక బోయింగ్ 737 విమానం టెహ్రాన్ లోని ఇమాం ఖొమేనీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికి కూలిపోయింది. ఇరాన్ న్యూస్ ఏజెన్సీ ఐ.ఎస్.ఎన్.ఎ. ప్రకారం సాంకేతిక లోపంవల్లనే విమానం కూలింది.
2020-01-08 Read Moreఇరాక్ లోని 2 అమెరికా సైనిక స్థావరాలపై తాము జరిపిన క్షిపణి దాడిలో 80 మంది మరణించినట్టు ఇరాన్ ప్రకటించింది. పశ్చిమ ఇరాక్ లోని అసద్ ఎయిర్ బేస్ అమెరికా డ్రోన్ ఆర్మీకి కేంద్ర బిందువుగా ఉంది. ఇరాన్ ఖుర్ద్స్ ఫోర్స్ కమాండర్ ఖాసిం సులేమానీని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హతమార్చింది డ్రోన్ క్షిపణులతోనే. ఇర్బిల్ సైనిక స్థావరంపైనా ఇరాన్ దాడి చేసింది. ఈ దాడి ‘అమెరికాకు చెంపదెబ్బ’ వంటిదని ఇరాన్ సుప్రీం నేత వ్యాఖ్యానించారు.
2020-01-08ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు అద్దాలు పగిలాయని అధికార పార్టీ వారంతా ఆగ్రహించారని, రాజధానిలో ఏడుగురు రైతులు ప్రాణాలు పోతే మాత్రం వారికి లెక్కలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మందడంలో మహాధర్నా చేపట్టిన రైతులు రోడ్డుపైనే బైఠాయించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
2020-01-08అమెరికా సైనిక దళాలున్న రెండు ఇరాకీ స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఇరాన్ టాప్ మిలిటరీ కమాండర్ ఖాసిం సులేమానీని హతమార్చినందుకు ప్రతీకారంగా ఈ దాడి జరిగినట్టు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. 12కు పైగా క్షిపణులను ఇరాన్ ప్రయోగించినట్టు తెలిపింది. అమెరికా సైనికులు మరణించినట్టుగా ఇంతవరకు సమాచారం రాలేదని, నష్టం అంచనా జరుగుతున్నట్టు ఓ అమెరికన్ అధికారి చెప్పారు. అల్ అసద్ స్థావరంలో ఇరాకీలు చనిపోయినట్టు ప్రాథమిక సమాచారం.
2020-01-082019-20 ఆర్థిక సంవత్సరం స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ధరల్లో 7.53 శాతం పెరుగుతుందని అంచనా. 1975-76 తర్వాత నామినల్ జీడీపీ వృద్ధి రేటు ఇంత తక్కువ నమోదు కావడం తొలిసారి అని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుత ధరల్లో (నామినల్) జీడీపీ సింగిల్ డిజిట్లో నమోదు కావడం 2002-03 తర్వాత తొలిసారి. వాస్తవ జీడీపీ వృద్ధి రేటు (స్థిర ధరల్లో) కేవలం 5 శాతం ఉంటుందని అంచనా. ఇదీ 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం నాటితో పోల్చదగినది.
2020-01-08 Read Moreఉక్రెయిన్ దేశానికి చెందిన ఒక బోయింగ్ 737 విమానం ఇరాన్లో కూలిపోయింది. 180 మంది ప్రయాణీకులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరానికి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. సాంకేతిక కారణాలతో విమానం కూలిపోయినట్టుగా ప్రాథమిక సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల తర్వాత టేకాఫ్ అయిన కొద్దిసేపటికి విమానం రాడార్ నుంచి అదృశ్యమైనట్టుగా ఫ్లైట్ రాడార్ సంస్థ చూపించింది.
2020-01-08బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే మంగళవారం రాత్రి జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయాన్ని సందర్శించారు. మొన్న దాడికి గురైన విద్యార్ధులను పరామర్శించి వారితో కొద్దిసేపు మాట్లాడారు. నిరసన తెలుపుతున్నవిద్యార్ధులను ఉద్ధేశించి దీపిక మైకులో మాట్లాడలేదు గాని, వారికి సంఘీభావాన్ని ప్రదర్శించారు. గాయపడిన వర్శిటీ విద్యార్ధి సంఘం అధ్యక్షురాలు ఐషే ఘోష్, ఇతర విద్యార్ధులతో కలసి నిల్చున్నారు. ఆ సమయంలో విద్యార్ధి నేత కన్నయ్య కుమార్ ప్రసంగిస్తున్నారు.
2020-01-08 Read Moreఇరాన్ టాప్ జనరల్ ఖాసిం సులేమానీని అమెరికా హతమార్చినప్పటి అద్భుత దృశ్యం అంటూ ఓ ‘‘వీడియో ఫుటేజీ’’ సామాజిక మాథ్యమాల్లో వైరల్ అయింది. ప్రధాని నరేంద్ర మోడీ ఫాలో అయ్యే వ్యక్తుల్లో ఒకరైన మీనా దాస్ నారాయణ్ కూడా ఈ ఫుటేజీని షేర్ చేశారు. కొద్దిగా శోధిస్తే తేలిందేమిటంటే... అదొక వీడియో గేమ్! AC-130 Gunship Simulator - Convoy engagement పేరిట Byte Conveyor Studios యూట్యూబ్ ఛానల్ ఐదేళ్ళ క్రితం ఈ వీడియోను పోస్టు చేసింది.
2020-01-07ఓ ఎర్ర టీషర్ట్ వేసుకున్న వ్యక్తి ఆకుపచ్చ జాకెట్ ధరించిన వ్యక్తిపై దాడి చేసిన వీడియో ఒకటి నిన్నటినుంచీ షేర్ అవుతోంది. అందులో ఎర్ర చొక్కా వ్యక్తిని వామపక్ష విద్యార్ధిగా, దాడికి గురైన వ్యక్తిని ఎబివిపి సభ్యుడిగా పేర్కొంటూ...ఈ సంఘటనే 5వ తేదీన జె.ఎన్.యు.లో హింసకు దారి తీసిందని బిజెపి సోషల్ మీడియా సైనికులు, బిజెపి అనుకూల జర్నలిస్టులు షేర్ చేస్తున్నారు. నిజానికి దాడి చేసిన ఎర్రచొక్కా వ్యక్తి ఎ.బి.వి.పి. సభ్యుడు షర్వేందర్. దాడికి గురైంది ఎ.ఐ.ఎస్.ఎ. సభ్యుడు వివేక్ పాండే.
2020-01-07 Read Moreకేరళలోని పాఠశాలలు, కళాశాలల ఉదయపు అసెంబ్లీలలో రాజ్యాంగ ప్రవేశికను పఠించేలా చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం చెప్పారు. విద్యా బోధనలో రాజ్యాంగ అధ్యయనం తప్పనిసరి చేయాలన్న కళాశాల యూనియన్లు విన్నవించిన నేపథ్యంలో సిఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగం, దాని విలువలు దాడికి గురవుతున్న దశలో, సామాజిక చైతన్యాన్ని పెంచవలసిన అవసరం ఉందని విజయన్ అభిప్రాయపడ్డారు.
2020-01-07 Read More